1905లో పాలనా సౌలభ్యం కోసం అనే కారణంతో బెంగాల్‌ను తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్‌గా లార్‌డ కర్జన్ విభజించాడు. హిందూ, ముస్లింల ఐక్యతను దెబ్బతీసేందుకే ఈ చర్య తీసుకున్నట్లు పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. తూర్పు బెంగాల్‌లోని ప్రధాన ప్రాంతాలు.. అస్సాం, చిట్టగాంగ్, ఢాకా, రాజాషాహీ, తిప్పెరా. దీని రాజధాని ఢాకా. ఉప రాజధాని చిట్టగాంగ్. పుల్లర్‌ను బెంగాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించి కర్జన్ ఇండియా వదిలి బ్రిటన్‌కు వెళ్లిపోయాడు. 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది.
1905 ఆగస్టు 7న కలకత్తాలో స్వదేశీ ఉద్యమం (లేదా) వందేమాతర ఉద్యమం (లేదా) బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం ప్రారంభమైంది. వందేమాతరం అని నినదిస్తూ ప్రజలు కుల, మత, లింగ భేదాలకు అతీతంగా బ్రిటిష్ వారి విభజన చర్యను వ్యతిరేకించారు. జాతీయ కాంగ్రెస్ నాయకులు.. మితవాదులు, అతివాదులుగా విడిపోవడానికి బెంగాల్ విభజన ఒక కారణం. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమాన్ని బెంగాల్‌కి పరిమితం చేసి పోరాటం సాగించాలని మితవాదులు, దేశవ్యాప్తంగా ఉద్యమం సాగించాలని అతివాదులు విరుద్ధ భావాలతో ఉండటంతో 1907 సూరత్ జాతీయ కాంగ్రెస్‌లో వారు అతివాదులు, మితవాదులుగా విడిపోయారు. ఏది ఏమైనా వారి అంతిమ లక్ష్యం బెంగాల్ విభజన రద్దు. ఈ స్వదేశీ ఉద్యమం మనలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్వయంపోషకత్వం, నిస్వార్థ త్యాగాలను పెంపొందించింది.
వందేమాతర ఉద్యమం జరుగుతున్న కాలంలోనే ముస్లింలీగ్ ఆవిర్భవించింది. ఢాకా నవాబు సలీముల్లా దీని ఆవిర్భావ కారకుల్లో ఒకరు. భారతీయుల్లోని సంఘీభావాన్ని, మత సమైక్యతను దెబ్బతీసేందుకు బ్రిటిష్ వారు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వందేమాతరం, సంధ్య, యుగాంతర్ వంటి పత్రికలను మూసివేశారు. ప్రధాన జాతీయ నాయకులను అరెస్ట్ చేసి, వారిపై అభియోగాలు మోపి జైలు శిక్షలు విధించారు. బ్రిటిష్ వారు ఈ చర్యల ద్వారా వారికి తెలియకుండానే భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్షకు పునాదులు వేశారు. ఉద్యమం సమసిపోతుండటంతో భారతీయ యువకులు సాయుధ పోరాటాన్ని
అనుసరించారు.
వందేమాతర ఉద్యమం - సంస్థల స్థాపన
వందేమాతర ఉద్యమ సమయంలో స్వదేశీ సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. విదేశీ వస్తు బహిష్కరణ జరిగింది.
బెంగాల్ జాతీయ కళాశాలను అరవింద్ ఘోష్ ఏర్పాటు చేశారు.
1906లో జాతీయ విద్యా మండలిని స్థాపించారు.
భారతీయ యువకులు పారిశ్రామిక శిక్షణ కోసం జపాన్ వెళ్లారు.
అహ్మదాబాద్‌లో దేశీయ ఉత్పాదిత వస్తు సంరక్షణ సమితి ఏర్పడింది.
బారిసాల్‌లో అశ్వనీ కుమార్ దత్.. స్వదేశ బోధన సమితి స్థాపించారు.
బెంగాల్ కెమికల్స్ ఫ్యాక్టరీని పి.సి. రాయ్ (ప్రఫుల్ల చంద్రరాయ్) స్థాపించారు.
స్వదేశీ ఉద్యమ కాలంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కాశీం బజార్ వాసి.. మునీంద్ర నంది ధన సహాయం చేశారు.
వందేమాతర ఉద్యమ కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గేయం - అమర్ సోనార్ బంగ్లా
1906లో జాతీయ శిక్షా పరిషత్ స్థాపించారు.
భారతీయ ఉద్యమకారులపై సానుభూతి ప్రకటించిన బ్రిటిష్ అధికారి- సర్ హెన్రీ కాటన్
వందేమాతర ఉద్యమం - ప్రముఖులు - ప్రాధాన్యత
బంకించంద్ర ఛటర్జీ: 1882లో ఆనంద్‌మఠ్ రాశారు. ఈ గ్రంథంలో వందేమాతరం గేయాన్ని రచించారు.
సర్ సలీముల్లా: బెంగాల్ విభజనను పాశవిక చర్య అని వ్యాఖ్యానించారు.
రవీంద్రనాథ్ ఠాగూర్: విశ్వకవి. రక్షాబంధన్ సంప్రదాయం పాటించాలని సూచించారు.
శ్రీ కృష్ణకుమార్ మిత్ర: సంజీవని వార్తా పత్రిక ఎడిటర్. లివర్‌పూల్ ఉప్పు, మాంచెస్టర్ వస్త్రాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
రజనీకాంత్ సేన్: వాణి, కల్యాణి, అమృత గ్రంథాలు రాసిన బెంగాలీ కవి. స్వదేశీ ఉద్యమంలో కవితావేశం ప్రదర్శించారు.
ద్విజేంద్రలాల్ రాయ్: బంగా అమర్ జననీ అమర్ గేయం రాశారు. స్వదేశీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
సయ్యద్ అబూ మహ ్మద్: స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన ప్రముఖ మేధావి.
ముకుంద దాస్: పల్లిసేవా, బ్రహ్మచారిణి మొదలైన రచనల ద్వారా స్వదేశీ ఉద్యమానికి జీవం పోశారు.
సురేంద్రనాథ్ బెనర్జీ: సిల్వర్ టంగ్‌డ ఆరేటర్‌గా ప్రసిద్ధి చెందారు. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బెంగాలీ యువకులను ఉద్దేశించి అనర్గళ ఉపన్యాసాలిచ్చారు.
గోపాల్ హరిదేశ్‌ముఖ్: పూనాకు చెందినవారు. లోక్‌హితవాదిగా ఖ్యాతి పొందారు. గ్రామాల్లో కుటీర పరిశ్రమలు ఉండాలని ప్రబోధించారు.
గణేశ్ వాసుదేవ్ జోషి: స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని వందేమాతర ఉద్యమానికి ముందే ప్రచారం చేశారు. ప్రతిరోజూ రాట్నంపై దారం తీసేవారు.
అంబాలాల్ సకర్‌లాల్, ప్రేమాబాయి, మణిబాయి, జిష్‌బాయి, రంచోడ్‌లాలా, హిమాబాయిలు వందేమాతర ఉద్యమాన్ని విస్తృతపర్చారు.
సుబ్రహ్మణ్యభారతి: తమిళ పద్యాలను ఆలపిస్తూ మద్రాస్ బీచ్ సమావేశంలో స్వదేశీ భావాన్ని ప్రచారం చేశారు.
గోపాలకృష్ణ గోఖలే: ప్రముఖ మితవాది. గాంధీజీకి రాజకీయ గురువు.
ఖాజీ సైఫుద్దీన్: హైదరాబాద్‌లో ప్రసంగిస్తూ అన్ని మతాల ప్రజలు దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
బాలగంగాధర తిలక్: కేసరి, మరాఠీ పత్రికల స్థాపకులు. గణపతి ఉత్సవాలు, శివాజీ జయంతిని ప్రారంభించారు. లోకమాన్య బిరుదాంకితులు.
తహల్ రామ్ గంగారామ్: ఆర్య సమాజ సభ్యుడు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో కీలకపాత్ర పోషించారు.
అరవిందఘోష్: బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించారు. 1906లో జాతీయ విద్యా మండలి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పాండిచ్చేరిలో స్థిరపడ్డారు.
బిపిన్ చంద్రపాల్: వందేమాతర ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు. ముట్నూరి కృష్ణారావు ఆహ్వానంపై ఆంధ్రాలో పర్యటించారు. భారత జాతీయవాదం, జాతీయతా సామ్రాజ్యం అ లాలాలజపతిరాయ్: పంజాబ్ కేసరి బిరుదాంకితులు. అతివాది. అన్‌హ్యాపీ ఇండియా అనే గ్రంథం రాశారు. భగత్ సింగ్‌కు గురువు.
అజిత్ సింగ్ : సర్దార్ బిరుదాంకితులు. పంజాబ్ ప్రాంత వాసి. మాండలే జైల్లో లాలా లజపతిరాయ్‌తో కలిసి శిక్ష అనుభవించారు.
లార్‌డ మింటో: 1905 వందేమాతర ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న కాలంలో భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్‌గా పనిచేశారు.
మార్లే: వందేమాతర ఉద్యమ కాలం నాటి భారతదేశ రాజ్య వ్యవహారాల కార్యదర్శి.
సయ్యద్ హైదర్ రాజా: ఢిల్లీలో స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
చిదంబరం పిళ్లై: మద్రాస్‌లో స్వదేశీ ఉద్యమానికి నాయకుడిగా ఉన్నారు. ట్యుటికోరిన్ ఓడరేవులో స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు.
ఐదో జార్జి: బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు 1911 డిసెంబర్ 11న ఢిల్లీలో ప్రకటించారు. ఈయన ఆనాటి బ్రిటిష్
సార్వభౌముడు.
లార్‌డ హార్డింజ్: 1911 బెంగాల్ విభజన రద్దు సమయంలో ఆనాటి భారతదేశ బ్రిటిష్ వైస్రాయ్.
జి. సుబ్రహ్మణ్య అయ్యర్: మద్రాసు బీచ్ సమావేశం (1905 సెప్టెంబర్) అధ్యక్షులుగా వ్యవహరించారు. స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు.
సుబోధ్‌చంద్ర మల్లిక్: బెంగాల్‌లో జాతీయ విద్యాభివృద్ధికి 1905లో రూ.లక్ష విరాళంగా అందజేశారు.
కోటహరియప్ప: కడపలో స్వదేశీ వస్త్రాల స్టోర్‌ను ప్రారంభించారు. బి. వెంకటేశ్వరరావు దానికి సహాయ సహకారాలు అందించారు.
కౌతా శ్రీరామమూర్తి: వందేమాతర గేయాన్ని ఆలపించడంలో ప్రసిద్ధి చెందారు.
మార్‌క హంటర్: ఆంధ్రాలో రాజమండ్రి కళాశాల సంఘటన కాలం నాటి రాజమండ్రి ప్రభుత్వ ఆర్‌ట్స కళాశాల, ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్.
మాదిరి ప్రశ్నలు
1. స్వదేశీ ఉద్యమం (లేదా) వందేమాతర ఉద్యమం సందర్భంగా ఉరిశిక్షకు గురైనవారు?
1) చిన్నపరెడ్డి
2) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
3) కన్నెగంటి హనుమంతు
4) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
2. బెంగాల్ విభజన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1905 అక్టోబర్ 2
2) 1906 అక్టోబర్ 16
3) 1905 అక్టోబర్ 16
4) 1907 ఏప్రిల్ 24
3. కింది వాటిలో సరైన జత?
1) రక్షాబంధన్ - రవీంద్రనాథ్ ఠాగూర్
2) లోక్‌హితవాది- గోపాల్ హరిదేశ్‌ముఖ్
3) 1911 డిసెంబర్ 11 - బెంగాల్ విభజన రద్దు
4) పైవన్నీ
4. కింది వాటిలో సరికాని జత?
1) బెంగాల్ విభజన - కర్జన్
2) బెంగాల్ విభజన రద్దు - జార్జి 5
3) వందేమాతరం - బంకించంద్ర ఛటర్జీ
4) అమర్‌సోనార్ బంగ్లా - విష్ణు దిగంబర పలుస్కార్
5. వందేమాతర ఉద్యమాన్ని ఏ పేరుతో కూడా వ్యవహరిస్తారు?
1) స్వరాజ్య ఉద్యమం
2) ఆగస్ట్ ఉద్యమం
3) అసహాయ ఉద్యమం
4) స్వదేశీ ఉద్యమం
6. బెంగాల్ జాతీయ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించినవారు?
1) బాలగంగాధర్ తిలక్
2) అరవిందఘోష్
3) ముట్నూరి కృష్ణారావు
4) షేక్ చాంద్
7. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) వందేమాతర గేయకర్త -
బంకించంద్ర ఛటర్జీ
2) వందేమాతరం పత్రిక నిర్వాహకులు - మేడం కామా
3) కోటప్పకొండ సంఘటన స్వదేశీ ఉద్యమం నాటిది
4) పైవన్నీ
సమాధానాలు
1) 1; 2) 3; 3) 4; 4) 4;
5) 4; 6) 2; 7) 4.
ముఖ్యాంశాలు
1907లో మహిళా భారతి సంఘం ఎక్కడ ఏర్పాటైంది?
- విశాఖపట్నంలో
స్వామి వివేకానంద బోధనలతో ప్రభావితమై ఏర్పడిన సంస్థ? - అనుశీలన్ సమితి
అనుశీలన్ సమితి స్థాపకులు?
- సతీష్ చంద్ర బసు
ఆనంద్‌మఠ్ నవల రాసినవారు?
-బంకించంద్ర ఛటర్జీ
అనుశీలన్ సమితి అధ్యక్షులు?
- పి. మిత్ర
స్వదేశీ నేత కంపెనీని ఎక్కడ స్థాపించారు?
- పూనా
1905 డిసెంబర్‌లో మొట్టమొదటి భారత పరిశ్రమల సమావేశం ఎక్కడ జరిగింది?
- బెనారస్‌లో
మొట్టమొదటి భారత పరిశ్రమల సమావేశానికి అధ్యక్షులు ఎవరు? - రమేష్ చంద్ర దత్
వందేమాతర ఉద్యమానికి ఉపకరించిన గ్రంథాలు..
మోడర్‌న ఎక్ట్సోజివ్‌స (ఏస్లర్ రాశారు)
మోడర్‌న వెపన్‌స అండ్ మోడర్‌న వార్ (బ్లాచ్ రాశారు)
ది సోర్‌డ్సమన్ (ఆల్ఫ్రెడ్ హటన్ రాశారు).