యూజీ కోర్సులు.. | UG courses | Sakshi
Sakshi News home page

యూజీ కోర్సులు..

Published Fri, Sep 30 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

యూజీ కోర్సులు..

యూజీ కోర్సులు..

విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు మొదటి గమ్యస్థానం.. అమెరికా. ఏ అంతర్జాతీయ సర్వే చూసినా అమెరికా యూనివర్సిటీలు టాప్‌లోనే ఉంటాయి. క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీల ర్యాంకు (2016-17)లో టాప్-100లో 32 ఇన్‌స్టిట్యూట్స్,టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీల సర్వే (2016-17)ల్లో 41 అమెరికన్ విద్యాసంస్థలు టాప్-100లో నిలిచాయి. ప్రస్తుతం యూఎస్‌లోని ప్రముఖ యూనివర్సిటీలన్నీ 2017 సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ యూనివర్సిటీల్లో యూజీ కోర్సులు.. అర్హతలు.. ప్రవేశానికి అవసరమైన పత్రాలు తదితర వివరాలు..
 
 స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ
  ప్రదేశం: శాన్‌ఫ్రాన్సిస్కో సౌత్, కాలిఫోర్నియా, యూఎస్.
  మొత్తం విద్యార్థులు: 16,000కుపైగా (6,994 మంది అండర్‌గ్రాడ్యుయేట్స్, 9,128 మంది గ్రాడ్యుయేట్స్. వీరిలో 3,555 మంది విదేశీ విద్యార్థులు).
 
  ఫ్యాక ల్టీ: 2,153 మంది; స్టూడెంట్ - ఫ్యాకల్టీ రేషియో: 4:1
    ప్రత్యేకతలు
 ఇప్పటివరకు 31 మంది స్టాన్‌ఫర్డ్ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబె ల్ బహుమతి లభించింది. ప్రస్తుత ఫ్యాకల్టీలో 21 మంది నోబెల్ గ్రహీతలు.
 
  151 దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించారు.
  యూజీ కోర్సులు: టాప్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు.. కంప్యూటర్ సైన్స్, హ్యూమన్ బయాలజీ, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ, ఎకనామిక్స్.
 
  అర్హత: దరఖాస్తుకు ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి.
 
  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి సబ్మిట్ చేయాలి.
 
 ప్రవేశాలకు అవసరమైన పత్రాలు
  అకడమిక్ సర్టిఫికెట్లు
  లెటర్ ఆఫ్ రికమండేషన్స్
  శాట్ (ఎస్సేతో కలిపి)/ఏసీటీ (రైటింగ్) స్కోర్లు
  టోఫెల్ స్కోర్
  విద్యాభ్యాసానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నట్లు రుజువు
 
 మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
 ఏర్పాటు: 1861
  ప్రదేశం: కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, యూఎస్.
  మొత్తం విద్యార్థులు: 11,331 (అండర్ గ్రాడ్యుయేట్స్ 4,527; గ్రాడ్యుయేట్స్ 6,804; మొత్తం విద్యార్థుల్లో 3,717 మంది విదేశీ విద్యార్థులు).
  ఫ్యాకల్టీ: 1,036. వీరిలో 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు.
  స్టూడెంట్, ఫ్యాకల్టీ రేషియో: 8:1
 
   ప్రత్యేకతలు
 ఇప్పటివరకు 85 మంది మిట్ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబెల్ బహుమతి లభించింది.
 116 దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు.
 
 యూజీ అడ్మిషన్స్-2017
  మిట్ యూజీ అడ్మిషన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏటా 4 వేల మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటుంటే.. 150 మందికి మాత్రమే ప్రవేశం       లభిస్తోంది.
 
  కోర్సులు: ఎలక్ట్రికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్; ఏరోస్పేస్ ఇంజనీరింగ్; ఆఫ్రికన్ అండ్ ఆఫ్రికన్ డయాస్పోరా స్టడీస్; ఆంత్రోపాలజీ; అప్లైడ్ ఇంటర్నేషనల్ స్టడీస్; ఆర్కియాలజీ అండ్ మెటీరియల్స్; ఆర్కిటెక్చర్; పబ్లిక్ పాలసీ తదితర కోర్సులు.

 అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/ 10+2) కోర్సులు పూర్తిచేసుండాలి.
 
 ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టులు- స్కోర్లు
 టోఫెల్ (పీబీటీ) - కనీసం 577. 600కు పైగా సాధిస్తే ప్రాధాన్యతనిస్తారు.
 టోఫెల్ (ఐబీటీ) - కనీసం 90. 100కు పైగా సాధిస్తే ప్రాధాన్యతనిస్తారు.
  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి.
 
 దరఖాస్తుకు చివరి తేదీలు
 ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016
 రెగ్యులర్ యాక్షన్: జనవరి 1, 2017
 వెబ్‌సైట్:  www.caltech.edu
 
 ప్రవేశాలకు అవసరమైన పత్రాలు
  అకడమిక్ సర్టిఫికెట్లు
  లెటర్ ఆఫ్ రికమండేషన్స్
  శాట్, శాట్ సబ్జెక్టు టెస్ట్/ఏసీటీ స్కోర్లు
 టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ స్కోర్లు
 
  మొత్తం విద్యార్థులు: 2,243 (వీరిలో 603 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు).
  స్టూడెంట్, ఫ్యాకల్టీ రేషియో 3:1
      ప్రత్యేకతలు
  కాల్‌టెక్ ఫ్యాకల్టీ/ పూర్వ విద్యార్థులు 34 మంది నోబెల్ బహుమతులు పొందారు.
  కోర్సులు: బయాలజీ; బయోఇంజనీరింగ్; కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్; ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సెన్సైస్; జియోలాజికల్ అండ్ ప్లానెటరీ సెన్సైస్; ద హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్; ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ.
 
  అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి.
  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి.
 దరఖాస్తులకు చివరి తేదీలు
 ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016
 రెగ్యులర్ డెసిషన్: జనవరి 3, 2017
 వెబ్‌సైట్: mitadmissions.org
 
 ప్రవేశాలకు అవసరమైన పత్రాలు
  అకడమిక్ సర్టిఫికెట్స్
  లెటర్ ఆఫ్ రికమండేషన్స్
  శాట్, శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు
  టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ స్కోర్లు
 
 యూనివర్సిటీ ఆఫ్ షికాగో
 ఠి మొత్తం విద్యార్థులు: 14,221 (వీరిలో 2,888 మంది విదేశీ విద్యార్థులు).
     ప్రత్యేకతలు
 ఠి 80 మంది ఇక్కడి ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబెల్ బహుమతి పొందారు.
 ఠి కోర్సులు: ఆంత్రోపాలజీ; అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్; ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్; బయలాజికల్ కెమిస్ట్రీ; సినిమా అండ్ మీడియా స్టడీస్; కంప్యూటర్ సైన్స్ తదితర కోర్సులు.
 ఠి అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి.
 
 ఠి దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి.

 ముఖ్య తేదీలు
 ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016
 రెగ్యులర్ డెసిషన్:  జనవరి 1, 2017
 వెబ్‌సైట్: mitadmissions.org
  ప్రవేశాలకు అవసరమైన పత్రాలు
  దరఖాస్తు ప్రింటవుట్
  అకడమిక్ సర్టిఫికెట్స్
  లెటర్ ఆఫ్ రికమండేషన్స్
  శాట్, శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు
  టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ స్కోర్లు
 
 యేల్ యూనివర్సిటీ
 ఏర్పాటు: 1701; ప్రదేశం: న్యూ హెవెన్, కనెక్టికట్
  మొత్తం విద్యార్థులు: దాదాపు 12 వేల మంది. (వీరిలో 118 దేశాలకు చెందిన 4,462 మంది విదేశీ విద్యార్థులు/ స్కాలర్స్).
  మొత్తం ఫ్యాకల్టీ సంఖ్య: 4,410
    ప్రత్యేకతలు
  ప్రపంచంలోనే రెండో ధనిక విద్యాసంస్థ అంతేకాకుండా మూడో అతిపెద్ద లైబ్రరీ ఉంది.
  అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఐదుగురు (జార్జి బుష్ సీనియర్, జార్జిబుష్ జూనియర్, బిల్ క్లింటన్, విలియమ్ హోవర్డ్ టఫ్ట్, గెరాల్డ్ ఫోర్డ్) ఇక్కడే చదువుకున్నారు.
  కోర్సులు: ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్; ఆంత్రోపాలజీ; అప్లైడ్ ఫిజిక్స్, ఆర్కియాలజికల్ స్టడీస్, ఆర్కిటెక్చర్, ఆర్ట్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, క్లాసికల్ సివిలైజేషన్, క్లాసిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్...
  అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి.
    ప్రవేశం కోసం కావాల్సిన పత్రాలు
  దరఖాస్తు ప్రింటవుట్  అకడమిక్ సర్టిఫికెట్స్  మిడ్ ఇయర్ రిపోర్ట్స్  ఇద్దరు టీచర్ల్లు ఇచ్చిన లెటర్ ఆఫ్ రికమండేషన్స్   శాట్/శాట్ సబ్జెక్టు/రీజనింగ్ టెస్ట్‌లు/ఏసీటీ స్కోర్లు   టోఫెల్/ఐఈఎల్‌టీఎస్/పీటీఈ స్కోర్లు.
 టెస్టులు- స్కోర్లు:  శాట్ వెర్బల్- 710 - 800  శాట్ మ్యాథ్స్ - 710 - 790  శాట్ రైటింగ్ - 720 -800
 దరఖాస్తుకు చివరి తేదీలు: ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016
 రెగ్యులర్ డెసిషన్: జనవరి 2, 2017
 వెబ్‌సైట్:  www.uchicago.edu
 
 ఏర్పాటు: 1740; ప్రదేశం: ఫిలడెల్ఫియా
  మొత్తం విద్యార్థులు: 21,395 మంది (వీరిలో 4,048 మంది విదేశీ విద్యార్థులు).
    ప్రత్యేకతలు
   ఈ యూనివర్సిటీ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థుల్లో 25 మందికి నోబెల్ బహుమతి అందింది.
  వివిధ దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా పనిచేసిన వారిలో కొంతమంది ఇక్కడే విద్యనభ్యసించారు.
  కోర్సులు: ఆఫ్రికన్ స్టడీస్; ఇంటర్నేషనల్ రిలేషన్స్; అర్బన్ స్టడీస్; ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్; బయో ఇంజనీరింగ్; బయోమెడికల్ సైన్స్; నెట్‌వర్క్‌డ్ అండ్ సోషల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్; విజువల్ స్టడీస్; సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్; డిజిటల్ మీడియా డిజైన్.
 
  అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/ 10+2) కోర్సులు పూర్తిచేసుండాలి.
    ప్రవేశం కోసం కావాల్సిన పత్రాలు
  అకడమిక్ సర్టిఫికెట్స్  మిడ్‌ఇయర్ రిపోర్ట్స్  లెటర్ ఆఫ్ రికమండేషన్స్  శాట్/శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు  టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ స్కోర్లు
  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి సబ్మిట్ చేయాలి.
  దరఖాస్తులకు చివరి తేదీలు:
 ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016
 రెగ్యులర్ డెసిషన్: జనవరి 5, 2017
 వెబ్‌సైట్: www.admissions.upenn.edu
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement