UG courses
-
నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్‌తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్‌కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్‌ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్‌లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. -
నీట్ ఎగ్జామ్‌లో సత్తా చాటిన తండ్రి, కూతురు!..50 ఏళ్ల వయసులో..
కూతురు అటెన్షన్‌తో చదవాలని ఏకంగా 50 ఏళ్ల వయసులో ఆమె తోపాటు నీట్ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు ఓ తండ్రి. అతడిది ఇంజీనరింగ్ బ్యాగ్రౌండ్ అయినా సరే కూతురితో పోటీపడి మరీ చదివాడు. తన కూతరిని ఇన్స్పేర్ చేసేలా ప్రిపేరయ్యి మరీ విజయం సాధించాడు. అతడి కూతురు కూడా మంచి మార్కులతో ఈ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణురాలయ్యింది. ఆ తండ్రి కూతుళ్లు విజయగాథ ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుంమా..!ఆ తండ్రి పేరు వికాస్ మంగ్రోత్రా. ఆయన ఢిల్లీలో కార్పొరేట్ ఉద్యోగిగా పనిచేన్నారు. అతడికి 18 ఏళ్ల మిమాన్సా అనే కూతురు ఉంది. ఆయన తన కూతురు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించేలా చేసేందుకు ఓ తండ్రిగా ఈ ఏజ్‌లో చేసిన సాహసంగా చెప్పొచ్చు. వికాస్ తన కూతరికి నీట్ ఎగ్జామ్‌లో పలు సందేహాలు తీర్చేవాడు. ఆమె కూతురు పడుతున్న టెన్షన్, ఇబ్బందులు చూసి..ఆమెకు తానే స్పూర్తి కలిగించేలా చేద్దామన్న ఉద్దేశ్యంతో ఆమెతో కలిసి ఈ నీట్ ఎగ్జామ్‌కి అప్లై చేశాడు. ఇద్దరు కలిసి పోటీపడి మరీ ప్రిపేరయ్యేవారు. నిజానికి వికాస్ 90లలో డాక్టర్ కావాలనుకుని ప్రీ మెడికల్ టెస్ట్‌లకు అప్లై చేశాడు. అయితే మార్కులు తక్కువ రావడం తోపాటు కొన్నీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంజనీరింగ్ చదవాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం తన కూతురు కోసమే గాక తన సామర్థ్యాన్ని కూడా పరీక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇలా ఈ నీట్ ఎగ్జామ్ రాసినట్లు వికాస్ చెప్పుకొచ్చారు. తన కూతురు ప్రిపరేషన్లో ఎదురయ్యే సందేహాలను తీరుస్తున్నప్పుడు వాళ్లు ఫీల్ అవుతున్న ఇబ్బందులును గ్రహించి..ఎలా ఈ ఎగ్జామ్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాలో చెప్పాలనే ఉద్దేశ్యంతో కూతురి తోపాటు ప్రిపేర్ అయ్యానని అన్నారు. చివరికి ఇద్దరూ ఈ ఎగ్జామ్‌లో మంచి ర్యాంకులతో పాసయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ ఆయన తన కూతురుని ఎగ్జామ్‌లో బాగా ప్రిపేర్ చేసేందుకు ఒక ఏడాది పాటు సెలవులు పెట్టిమరీ ప్రిపేర్ చేయించారు. ఇక ఆయన కూడా ఆఫీస్ పనివేళ్లలు పూర్తి అయిన తర్వాత కొద్ది గంటలు ఈ ఎగ్జామ్‌కి కేటాయించి మరీ ప్రీపేర్ అయ్యినట్లు తెలిపారు. అయితే వికాస్ నీట్ ఎగ్జామ్‌ని 2022లో కూడా అటెంప్ట్ చేశానని అలాగే యూపీఎస్సీ, జేకేసెట్, సీఎస్ఈ వంటి ఇతర పరీక్షలు కూడా సరదాగా రాసేవాడినని చెప్పుకొచ్చారు. అంతేగాదు మన పిల్లలు పాఠ్యాంశాలు బాగా చదివేలా తల్లిదండ్రులుగా మనమే ముందుకొచ్చి సహకరించాలని అన్నారు. (చదవండి: లెమన్‌గ్రాస్ టీతో ఎన్ని లాభాలో తెలుసా..!) -
వచ్చే ఏడాది 300 వర్సిటీల్లో ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 300కు పైగా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) ప్రోగ్రామ్ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు పరిశోధన స్పెషలైజేషన్ డిగ్రీని అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టింది. ఆనర్స్ డిగ్రీ అందించేందుకు 150 విశ్వవిద్యాలయాలు ముందుకు రాగా, ఇప్పటికే 105 వర్సిటీలు కోర్సు ప్రారంభించాయి. 19 కేంద్రీయ, 24 రాష్ట్ర స్థాయి, 44 డీమ్డ్, 18 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. నాలుగేళ్ల కోర్సు ఐచ్ఛికమే నాలుగేళ్ల డిగ్రీ పాఠ్యాంశాలు, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించారు. నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థుల ఐచ్ఛికమే. మూడేళ్ల సాంప్రదాయ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆసక్తి ఉన్న వారు నాలుగో ఏడాది ఆనర్స్ డిగ్రీని అభ్యసించవచ్చు. విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల యూజీ డిగ్రీని, 160 క్రెడిట్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీని అందిస్తారు. పరిశోధన స్పెషలైజేషన్ అభ్యసించే వారు నాలుగేళ్ల యూజీ కోర్సులో పరిశోధన ప్రాజెక్టు చేపట్టాలి. దీంతో వారికి రీసెర్చ్ స్పెషలైజేషన్‌తో పాటు ఆనర్స్ డిగ్రీ లభిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థుల్లో డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నవంబర్ వరకు 6 లక్షల మందికిపైగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎక్కువ మంది భారతీయలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
ఆర్ట్స్ కోర్సులకే అందలం! దేశంలో యూజీ కోర్సుల్లోనే అత్యధిక చేరికలు
సాక్షి, అమరావతి: దేశంలో వివిధ ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆర్ట్స్ కోర్సులవైపే మొగ్గుచూపుతున్నారు. బీఏలో ఏకంగా 1.04 కోట్ల మంది చేరగా ఆ తర్వాత బీఎస్సీలో 49.12 లక్షల మంది, బీకాంలో 43.22 లక్షల మంది చేరారు. ఉన్నతవిద్యా కోర్సుల్లో చేరినవారిలో ఏకంగా 78.9 శాతం మంది అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) కోర్సుల్లోనే ఉండటం గమనార్హం. ఇదే సమయంలో పీజీ కోర్సులు చదువుతున్నవారు కేవలం 11.4 శాతానికే పరిమితమయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల హాట్ ఫేవరెట్ కోర్సులు అయిన బీటెక్‌లో 23.20 లక్షల మంది చేరగా, బీఈలో 13.42 లక్షల మంది ఉన్నారు. ఈ మేరకు దేశంలోని వివిధ కోర్సుల్లో చేరికలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) నివేదిక–2020–21 విడుదల చేసింది. ఇందులోని గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ కోర్సుల్లో మొత్తం 4,13,80,713 మంది విద్యార్థులు చేరగా.. అందులో 3.26 కోట్ల మంది (78.9 శాతం) యూజీ కోర్సులు చదువుతున్నారు. ఇక పోస్ట్రుగాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో 47.16 లక్షలు (11.4 శాతం) మంది ఉన్నారు. ఇక డిప్లొమా కోర్సుల్లో చేరికలు తక్కువగానే నమోదయ్యాయని.. మొత్తం విద్యార్థుల్లో వీరి సంఖ్య 29.79 లక్షలే (7.2 శాతం)నని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరినవారిలో అత్యధికులు టెక్నికల్, పాలిటెక్నిక్, నర్సింగ్, టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదువుతున్నారు. అలాగే పీజీ డిప్లొమా కోర్సులను కేవలం 2.57 లక్షల మంది మాత్రమే అభ్యసిస్తున్నారు. ఇక సర్టిఫికెట్ కోర్సుల్లో చేరినవారు 1.55 లక్షల మంది మాత్రమేనని ఐష్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం విద్యార్థుల్లో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల వాటా వరుసగా 0.62, 0.38 శాతాలు మాత్రమేనని నివేదిక పేర్కొంది. బీఏ, బీకాంల్లో మహిళలు.. బీటెక్, బీఈల్లో పురుషులు.. జాతీయ స్థాయిలో పలు కోర్సుల్లో చేరికలను గమనిస్తే ఇంజనీరింగ్ కోర్సుల మినహా దాదాపు మిగిలిన అన్ని కోర్సుల్లోనూ పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీఏలో చేరిన వారిలో 52.7 శాతం మంది మహిళలే ఉన్నారు. ఇక బీఎస్సీలో 52.2 శాతం, బీకాంలో 48.5 శాతం మంది మహిళలేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రం పురుషులతో పోలిస్తే మహిళల చేరికలు 28.5 శాతమే ఉన్నాయి. పీజీ సోషల్ సైన్సెస్ కోర్సుల్లోనూ 56.5 శాతం చేరికలతో మహిళలదే పైచేయిగా ఉంది. అలాగే పీజీ సైన్స్ కోర్సుల్లో 61.5 శాతం, మేనేజ్మెంట్ కోర్సుల్లో 43.1 శాతం, కామర్స్‌లో 66.5 శాతం మంది మహిళలు ఉన్నారు. ఎడ్యుకేషన్ విభాగంలోనూ 64.4 శాతంతో మహిళల చేరికలే అధికమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పీహెచ్డీ కోర్సుల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగంలో 33.3 శాతమే మహిళల వాటా. పీహెచ్డీ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీల్లో 48.8 శాతం మంది మహిళలున్నారు. పీహెచ్‌డీలో పెరిగిన చేరికలు కాగా పీహెచ్డీ కోర్సుల్లో చేరికలు పెరిగాయని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2.11 లక్షల మంది పీహెచ్డీ కోర్సుల్లో చేరినవారున్నారు. వీరిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో 56,625 మంది ఉన్నారు. ఇక మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ వంటి అంశాల్లో 48,600 మంది పరిశోధనలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులు అభ్యసిస్తున్నవారు 2,255 మంది ఉన్నారు. పీజీలో అత్యధికం ఈ కోర్సుల్లోనే.. దేశంలో పీజీ కోర్సుల్లో చేరినవారిలో అత్యధికంగా 9,41,648 మంది సోషల్ సైన్సు కోర్సులను చదువుతున్నారు. సైన్సు కోర్సులు అభ్యసిస్తున్నవారు 6,79,178 మంది ఉన్నారు. 68,60,001 మంది మేనేజ్మెంట్ కోర్సులు చదువుతున్నారు. కామర్స్ కోర్సులో 5,36,560 మంది చేరారు. పీజీ కోర్సుల్లోనే భాషా సంబంధిత కోర్సుల్లో 3,20,176 మంది ఉన్నారు. ఇక ఎడ్యుకేషన్ విభాగం కోర్సులను 2,06,394 మంది చదువుతున్నారు. -
ఏడాదికి రెండుసార్లు ‘క్యూట్’ !
న్యూఢిల్లీ: కొత్తగా నిర్వహించనున్న ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ–క్యూట్)’ను వచ్చే సెషన్ నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబం ధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కొత్తగా క్యూట్‌ను నిర్వహించనున్న విషయం తెల్సిందే. బోర్డు ఎగ్జామ్ మార్కుల ప్రాధాన్యతను తగ్గించాలనో, కోచింగ్ సంస్కృ తిని మరింత పెంచాలనే ఉద్దేశంతోనో క్యూట్ ను ప్రవేశపెట్టడంలేదని జగదీశ్ స్పష్టంచేశారు. (చదవండి: కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: మోదీ) -
శివనాడార్ వర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తులు
UG Admissions In Shiv Nadar University 2022: ఢిల్లీకి చెందిన విశ్వవిద్యాలయం శివనాడార్ 2022–23 విద్యా ఏడాదికి పలు కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, మేనేజ్మెంట్– ఎంటర్ ప్రెన్యూర్షిప్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధన అందించే అకాడమీ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతోంది. బీఎస్సీ (పరిశోధన), కెమిస్ట్రీ డిగ్రీతో పాటు ఒక కొత్త ఏకీకృత బ్యాచిలర్ ఇన్ టెక్నాలజీ ప్రోగ్రామ్‌ను పరిచయం చేయనుంది. శాట్, ఏసీటీ, ఎస్ఎన్యూ, జేఈఈ మెయిన్స్ స్కోరుతో ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని శివనాడార్ ఈడీ కల్నల్ గోపాల్ కరుణాకరన్ ఒక ప్రకటనలో తెలిపారు. (క్లిక్: అందుకే భారతీయులు ఉక్రెయిన్ బాట!) -
NEET UG 2021: నీట్ కటాఫ్ 460!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి గత నెలలో జరిగిన నీట్–21 పరీక్ష ఓఎంఆర్ ఆధారిత ప్రాథమిక కీ శుక్రవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ వెబ్సైట్లో కీని అందుబాటులో పెట్టింది. ప్రస్తుతం విడుదల చేసిన ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అనంతరం తుది కీని విడుదల చేస్తారు. కాగా ఈనెల 20 నుంచి 22వ తేదీల మధ్య ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాథమిక కీలో ఫిజికల్ సైన్స్ కేటగిరీలో ఒకట్రెండు మినహా మిగతావాటికి సమాధానాలు దాదాపు సరిగ్గానే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కటాఫ్ తగ్గొచ్చు.. ఈ సారి ఎంబీబీస్ ప్రవేశాల్లో కటాఫ్ మార్కులు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతేడాది కన్వీనర్ కోటాలో సీటు దక్కించుకున్న చివరి అభ్యర్థి మార్కులు 493కాగా, ఈ సారి పేపర్ తీరుతో కటాఫ్ మార్కులు తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా విడుదలైన ప్రాథమిక కీ ఆధారంగా ఇప్పటికే పలు కార్పొరేట్ విద్యా సంస్థలు కటాఫ్ మార్కులపై అంచనా వేశాయి. ఈ ఏడాది 460 మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
విద్యార్థుల ప్రాణాలు పణంగా పెడతారా?
సాక్షి, హైదరాబాద్: ‘నగరంలో కోవిడ్ కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో విద్యార్థుల ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారా?’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్‌తో సొంతూర్లకు వెళ్లిన విద్యార్థులు హైదరాబాద్‌కు ఎలా రావాలని, ఒకవేళ వచ్చినా వసతి గృహాల్లోకి ప్రవేశం లేదని, అందువల్ల వారు ఎక్కడుండాలని నిలదీసింది. అలాగే సిటీ బస్సు సర్వీసులు లేవని, అలాంటప్పుడు వారు పరీక్షా కేంద్రాలకు ఎలా చేరుకోవాలని ఏజీని ప్రశ్నించింది. కోవిడ్ విజృంభిస్తున్నందున ఎంట్రన్స్ టెస్ట్‌లతోపాటు యూజీ, పీజీ పరీక్షలనూ ఆన్లైన్లో నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ–తెలంగాణ శాఖ అధ్యక్షుడు బల్మూరి వెంకట నరసింగరావు, గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులు సొంతూర్లకు వెళ్లిపోయారని, ఇప్పుడు పరీక్షలు రాసేందుకు తిరిగి హైదరాబాద్‌కు రావాలనుకున్నా.. రవాణా సౌకర్యాలు లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. నగరంలోని హాస్టల్స్‌లోకి ప్రవేశం లేదని, ఇటీవల కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కూడా ఈ నెల 30 వరకు కళాశాలలు, పాఠశాలలు తెరవడానికి వీల్లేదని గుర్తుచేశారు. యూనివర్సిటీ గ్రాం ట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటికే 194 విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించాయని, మెజారిటీ వర్సిటీలు ఆన్లైన్లోనే వాటిని జరిపాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఇటీవల వరకు పరీక్షలు ఉంటాయో లేదో అనే సందే హం ఉందని, అకస్మాత్తుగా పరీక్షలు అంటే వి ద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులకే హాజరుకాలేకపోతున్నారని వివరించారు. మరి ఆన్లైన్లో పరీక్షలు ఎలా రాస్తారని ధర్మాస నం దామోదర్‌రెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన వివరణ ఇస్తూ అందుకే పరీక్షలను మూడు వారాలు వాయిదా వేసి, విద్యార్థులకు గడువు ఇస్తే పరీక్షలకు సమాయత్తం అవుతారని చెప్పారు. ఆన్లైన్ పరీక్షలు రాసేందుకు సమీపంలోని పట్టణాల్లో ఏర్పాట్లు చేసుకుంటారని నివేదించారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని ధర్మాసనానికి నివేదించారు. అలా గే ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో పరీ క్షలు నిర్వహించడం సాధ్యం కాదని తెలిపా రు. ఈ నెల 16 నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, వీటిని ఆపే లా ఆదేశించాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి నివేదించా రు. విద్యార్థులు ఒక్క దగ్గర చేరితే వారిని ఆప డం సాధ్యం కాదని, కరచాలనం చేస్తారని, తద్వారా వారికి, వారి తల్లిదండ్రులకు కూడా వైరస్ వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఫుట్‌పాత్‌లపై ఎండలో నిలబడుతున్నారు ‘కామన్ ఎంట్రన్స్ ఆన్లైన్ పరీక్షల కోసం విద్యార్థుల వెంట వచ్చే వారి తల్లిదండ్రులు ఫుట్‌పాత్‌ల మీద ఎండలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. భౌతిక దూరం పాటించకుండా పక్కపక్కనే నిలబడాల్సిన దుస్థితి. వారికి కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నిర్వహించబోయే పరీక్షలకు హాజరుకాలేని వారికి మళ్లీ నిర్వహిస్తారా? వాటిని సప్లిమెంటరీ అని కాకుండా మరోసారి నిర్వహిస్తారా? హాస్టల్స్ మూతపడ్డాయి కాబట్టి విద్యార్థులకు వసతి ఎలా కల్పిస్తారు? రవాణా సౌకర్యం ఎలా కల్పిస్తారు? ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి అభ్యంతరం ఏంటి?’అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ధర్మాసనం సందేహాలపై ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకొని తెలియజేస్తానని, దీనికి గడువు కావాలని ఏజీ కోరడంతో అనుమతిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. -
యూజీ కోర్సులు..
విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు మొదటి గమ్యస్థానం.. అమెరికా. ఏ అంతర్జాతీయ సర్వే చూసినా అమెరికా యూనివర్సిటీలు టాప్‌లోనే ఉంటాయి. క్వాకరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూనివర్సిటీల ర్యాంకు (2016-17)లో టాప్-100లో 32 ఇన్స్టిట్యూట్స్,టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీల సర్వే (2016-17)ల్లో 41 అమెరికన్ విద్యాసంస్థలు టాప్-100లో నిలిచాయి. ప్రస్తుతం యూఎస్‌లోని ప్రముఖ యూనివర్సిటీలన్నీ 2017 సంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ యూనివర్సిటీల్లో యూజీ కోర్సులు.. అర్హతలు.. ప్రవేశానికి అవసరమైన పత్రాలు తదితర వివరాలు.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రదేశం: శాన్ఫ్రాన్సిస్కో సౌత్, కాలిఫోర్నియా, యూఎస్. మొత్తం విద్యార్థులు: 16,000కుపైగా (6,994 మంది అండర్‌గ్రాడ్యుయేట్స్, 9,128 మంది గ్రాడ్యుయేట్స్. వీరిలో 3,555 మంది విదేశీ విద్యార్థులు). ఫ్యాక ల్టీ: 2,153 మంది; స్టూడెంట్ - ఫ్యాకల్టీ రేషియో: 4:1 ప్రత్యేకతలు ఇప్పటివరకు 31 మంది స్టాన్‌ఫర్డ్ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబె ల్ బహుమతి లభించింది. ప్రస్తుత ఫ్యాకల్టీలో 21 మంది నోబెల్ గ్రహీతలు. 151 దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించారు. యూజీ కోర్సులు: టాప్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు.. కంప్యూటర్ సైన్స్, హ్యూమన్ బయాలజీ, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ, ఎకనామిక్స్. అర్హత: దరఖాస్తుకు ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి సబ్మిట్ చేయాలి. ప్రవేశాలకు అవసరమైన పత్రాలు అకడమిక్ సర్టిఫికెట్లు లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్ (ఎస్సేతో కలిపి)/ఏసీటీ (రైటింగ్) స్కోర్లు టోఫెల్ స్కోర్ విద్యాభ్యాసానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నట్లు రుజువు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు: 1861 ప్రదేశం: కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్, యూఎస్. మొత్తం విద్యార్థులు: 11,331 (అండర్ గ్రాడ్యుయేట్స్ 4,527; గ్రాడ్యుయేట్స్ 6,804; మొత్తం విద్యార్థుల్లో 3,717 మంది విదేశీ విద్యార్థులు). ఫ్యాకల్టీ: 1,036. వీరిలో 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు. స్టూడెంట్, ఫ్యాకల్టీ రేషియో: 8:1 ప్రత్యేకతలు ఇప్పటివరకు 85 మంది మిట్ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబెల్ బహుమతి లభించింది. 116 దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. యూజీ అడ్మిషన్స్-2017 మిట్ యూజీ అడ్మిషన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏటా 4 వేల మంది విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటుంటే.. 150 మందికి మాత్రమే ప్రవేశం లభిస్తోంది. కోర్సులు: ఎలక్ట్రికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ; ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్; ఏరోస్పేస్ ఇంజనీరింగ్; ఆఫ్రికన్ అండ్ ఆఫ్రికన్ డయాస్పోరా స్టడీస్; ఆంత్రోపాలజీ; అప్లైడ్ ఇంటర్నేషనల్ స్టడీస్; ఆర్కియాలజీ అండ్ మెటీరియల్స్; ఆర్కిటెక్చర్; పబ్లిక్ పాలసీ తదితర కోర్సులు. అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/ 10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టులు- స్కోర్లు టోఫెల్ (పీబీటీ) - కనీసం 577. 600కు పైగా సాధిస్తే ప్రాధాన్యతనిస్తారు. టోఫెల్ (ఐబీటీ) - కనీసం 90. 100కు పైగా సాధిస్తే ప్రాధాన్యతనిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీలు ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ యాక్షన్: జనవరి 1, 2017 వెబ్సైట్: www.caltech.edu ప్రవేశాలకు అవసరమైన పత్రాలు అకడమిక్ సర్టిఫికెట్లు లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్, శాట్ సబ్జెక్టు టెస్ట్/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు మొత్తం విద్యార్థులు: 2,243 (వీరిలో 603 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు). స్టూడెంట్, ఫ్యాకల్టీ రేషియో 3:1 ప్రత్యేకతలు కాల్టెక్ ఫ్యాకల్టీ/ పూర్వ విద్యార్థులు 34 మంది నోబెల్ బహుమతులు పొందారు. కోర్సులు: బయాలజీ; బయోఇంజనీరింగ్; కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్; ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సెన్సైస్; జియోలాజికల్ అండ్ ప్లానెటరీ సెన్సైస్; ద హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్; ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమీ. అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీలు ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ డెసిషన్: జనవరి 3, 2017 వెబ్సైట్: mitadmissions.org ప్రవేశాలకు అవసరమైన పత్రాలు అకడమిక్ సర్టిఫికెట్స్ లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్, శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఠి మొత్తం విద్యార్థులు: 14,221 (వీరిలో 2,888 మంది విదేశీ విద్యార్థులు). ప్రత్యేకతలు ఠి 80 మంది ఇక్కడి ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థులకు నోబెల్ బహుమతి పొందారు. ఠి కోర్సులు: ఆంత్రోపాలజీ; అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్; ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్; బయలాజికల్ కెమిస్ట్రీ; సినిమా అండ్ మీడియా స్టడీస్; కంప్యూటర్ సైన్స్ తదితర కోర్సులు. ఠి అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. ఠి దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి, సబ్మిట్ చేయాలి. ముఖ్య తేదీలు ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ డెసిషన్: జనవరి 1, 2017 వెబ్సైట్: mitadmissions.org ప్రవేశాలకు అవసరమైన పత్రాలు దరఖాస్తు ప్రింటవుట్ అకడమిక్ సర్టిఫికెట్స్ లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్, శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు యేల్ యూనివర్సిటీ ఏర్పాటు: 1701; ప్రదేశం: న్యూ హెవెన్, కనెక్టికట్ మొత్తం విద్యార్థులు: దాదాపు 12 వేల మంది. (వీరిలో 118 దేశాలకు చెందిన 4,462 మంది విదేశీ విద్యార్థులు/ స్కాలర్స్). మొత్తం ఫ్యాకల్టీ సంఖ్య: 4,410 ప్రత్యేకతలు ప్రపంచంలోనే రెండో ధనిక విద్యాసంస్థ అంతేకాకుండా మూడో అతిపెద్ద లైబ్రరీ ఉంది. అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఐదుగురు (జార్జి బుష్ సీనియర్, జార్జిబుష్ జూనియర్, బిల్ క్లింటన్, విలియమ్ హోవర్డ్ టఫ్ట్, గెరాల్డ్ ఫోర్డ్) ఇక్కడే చదువుకున్నారు. కోర్సులు: ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్; ఆంత్రోపాలజీ; అప్లైడ్ ఫిజిక్స్, ఆర్కియాలజికల్ స్టడీస్, ఆర్కిటెక్చర్, ఆర్ట్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, క్లాసికల్ సివిలైజేషన్, క్లాసిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్... అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. ప్రవేశం కోసం కావాల్సిన పత్రాలు దరఖాస్తు ప్రింటవుట్ అకడమిక్ సర్టిఫికెట్స్ మిడ్ ఇయర్ రిపోర్ట్స్ ఇద్దరు టీచర్ల్లు ఇచ్చిన లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్/శాట్ సబ్జెక్టు/రీజనింగ్ టెస్ట్‌లు/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్/పీటీఈ స్కోర్లు. టెస్టులు- స్కోర్లు: శాట్ వెర్బల్- 710 - 800 శాట్ మ్యాథ్స్ - 710 - 790 శాట్ రైటింగ్ - 720 -800 దరఖాస్తుకు చివరి తేదీలు: ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ డెసిషన్: జనవరి 2, 2017 వెబ్సైట్: www.uchicago.edu ఏర్పాటు: 1740; ప్రదేశం: ఫిలడెల్ఫియా మొత్తం విద్యార్థులు: 21,395 మంది (వీరిలో 4,048 మంది విదేశీ విద్యార్థులు). ప్రత్యేకతలు ఈ యూనివర్సిటీ ఫ్యాకల్టీ/పూర్వ విద్యార్థుల్లో 25 మందికి నోబెల్ బహుమతి అందింది. వివిధ దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా పనిచేసిన వారిలో కొంతమంది ఇక్కడే విద్యనభ్యసించారు. కోర్సులు: ఆఫ్రికన్ స్టడీస్; ఇంటర్నేషనల్ రిలేషన్స్; అర్బన్ స్టడీస్; ఎన్విరాన్మెంటల్ స్టడీస్; బయో ఇంజనీరింగ్; బయోమెడికల్ సైన్స్; నెట్వర్క్డ్ అండ్ సోషల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్; విజువల్ స్టడీస్; సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్; డిజిటల్ మీడియా డిజైన్. అర్హత: విద్యార్థులు దరఖాస్తు చేయడానికి ముందు సెకండరీ స్కూల్ (ఇంటర్మీడియెట్/ 10+2) కోర్సులు పూర్తిచేసుండాలి. ప్రవేశం కోసం కావాల్సిన పత్రాలు అకడమిక్ సర్టిఫికెట్స్ మిడ్ఇయర్ రిపోర్ట్స్ లెటర్ ఆఫ్ రికమండేషన్స్ శాట్/శాట్ సబ్జెక్టు టెస్టులు/ఏసీటీ స్కోర్లు టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వ్యక్తిగత అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సంబంధిత వివరాలన్నీ పూర్తిచేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీలు: ఎర్లీ యాక్షన్: నవంబర్ 1, 2016 రెగ్యులర్ డెసిషన్: జనవరి 5, 2017 వెబ్సైట్: www.admissions.upenn.edu -
బీటెక్ అమెరికా
స్టడీ అబ్రాడ్ : కంట్రీ ప్రొఫైల్ స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల తొలి ప్రాధాన్యం.. యూఎస్! అక్కడ కోర్సు పూర్తిచేస్తే తిరుగులేని కెరీర్ సొంతమవుతుందని భావించి, ఏటా లక్షల మంది ఆ దిశగా ప్రయత్నిస్తుంటారు. వీరిలో అధిక శాతం మంది లక్ష్యం.. ఎంఎస్, ఎంబీఏ! అయితే అమెరికాలో యూజీ కోర్సులు చేయడానికి కూడా అవకాశాలు అనేకం. మరికొద్ది నెలల్లో యూఎస్ వర్సిటీల్లో స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమెరికాలో బీటెక్ అవకాశాలు.. అనుసరించాల్సిన విధానాలపై విశ్లేషణ.. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్).. భారత్‌లో ఎంతో క్రేజ్ ఉన్న కోర్సు. ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో సీటు కోసం తీవ్ర పోటీ ఉంటుంది. దాంతో అమెరికాలోని యూజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే భారత్ విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2015 నాటికి అమెరికాలో 9 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు ఉండగా, వారిలో భారత విద్యార్థుల సంఖ్య 1,32,888. వీరిలో 15-18 శాతం మంది యూజీ కోర్సుల విద్యార్థులు! వీరిలో 80 శాతం మంది ఇంజనీరింగ్‌కు సంబంధించిన వారు కాగా, మిగిలిన వారు సైన్స్ కోర్సులు చేస్తున్నవారు. యూఎస్‌లో బీటెక్‌కు మార్గం యూఎస్‌లో బీటెక్‌లో ప్రవేశించాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి.. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో 70 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. * స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్)లో స్కోర్. * శాట్ సబ్జెక్టు టెస్ట్‌ల్లో స్కోర్ (కొన్ని ప్రముఖ యూనివర్సిటీలకు మాత్రమే) * ACT (American College Testing) శాట్, ఏసీటీ పరీక్షల విధానం శాట్ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. అవి.. రీడింగ్ (52 ప్రశ్నలు), రైటింగ్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ (44 ప్రశ్నలు); మ్యాథమెటిక్స్ (58 ప్రశ్నలు). మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుంది. అదనంగా మరో 50 నిమిషాల్లో ఒక ఎస్సే రాయాలి. ఇది అభ్యర్థుల ఛాయిస్ మాత్రమే. 1600 పాయింట్లకు గరిష్ట స్కోరింగ్ ఉంటుంది. ఇందులో 50 శాతం మ్యాథమెటిక్స్‌కే!. విద్యార్థులు 1200 పాయింట్లు సాధిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో దరఖాస్తుకు అర్హత లభిస్తుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కోర్సుకు అనుగుణంగా అనుబంధ సబ్జెక్టుల్లో పరిజ్ఞానాన్ని పరిశీలించేందుకు శాట్ సబ్జెక్టు టెస్ట్‌లు నిర్వహిస్తారు. మ్యాథమెటిక్స్, సైన్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్ తదితర 21 సబ్జెక్టుల్లో ఉండే శాట్ సబ్జెక్ట్ టెస్ట్‌లో ప్రతి సబ్జెక్ట్ పరీక్షకు 800 పాయింట్ల స్కోర్ ఉంటుంది. శాట్ పరీక్షను ఏటా ఏడుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. అయితే రెండు కంటే ఎక్కువ అటెంప్ట్‌లు ఇస్తే దరఖాస్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయముంది. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అమెరికాలోని కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే మరో పరీక్ష.. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్. ఇందులో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్ విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 1 నుంచి 36 పాయింట్ల స్కోర్ కేటాయిస్తారు. ఈ పాయింట్ల శ్రేణిలో 25 పాయింట్లు సొంతం చేసుకుంటే.. ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ పరీక్షను ఏటా ఆరుసార్లు నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం తొలుత అమెరికా విదేశీ వ్యవహారాల అధికారిక వెబ్సైట్ ఆధారంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీల జాబితాను పరిశీలించాలి. ఆయా యూనివర్సిటీలు-అవసరమైన అర్హతలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత శాట్ లేదా ఏసీటీ టెస్ట్‌లకు సన్నద్ధం కావాలి. ఆ స్కోర్ల ఆధారంగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. దరఖాస్తుతోపాటు అందించాల్సిన పత్రాలు.. * విద్యార్హతల సర్టిఫికెట్లు ఠ స్టాండర్ట్ టెస్ట్ స్కోర్ కార్డులు * కోర్సు ట్యూషన్ ఫీజు, కోర్సు వ్యవధిలో అమెరికాలో నివసించేందుకు అయ్యే వ్యయాలకు సరిపడినంతగా ఆర్థిక వనరులున్నాయనే రుజువులు. * స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (సదరు కోర్సులో, నిర్దిష్టంగా సదరు ఇన్‌స్టిట్యూట్‌నే ఎంపిక చేసుకోవడానికి కారణాలు, ఆ ఇన్స్టిట్యూట్ అర్హతలు, ఇతర ప్రమాణాలకు తాము ఎలా సరితూగుతామో తెలియజేస్తూ రాసే స్టేట్మెంట్) * లెటర్ ఆఫ్ రికమండేషన్ వీసా ఎలా ప్రవేశం ఖరారు చేసిన ఇన్స్టిట్యూట్ ఐ-20 పేరుతో అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ పంపుతుంది. దాని ఆధారంగా విద్యార్థులు ఎఫ్-1 వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తును పరిశీలించిన అధికారులు నిర్దేశిత తేదీలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందితే వీసా లభిస్తుంది. ఈ వీసా కాల పరిమితి కోర్సు వ్యవధి మేరకు ఉంటుంది. ఎఫ్-1 వీసా పొందిన వారు కోర్సు పూర్తయ్యాక 2 నెలలు అమెరికాలో ఉండే విధంగా నిబంధనలో వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఎఫ్-1వీసా ఆధారంగా యూజీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఆ అర్హతతో అమెరికాలోనే మరో ఇన్స్టిట్యూట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందితే.. మరో ఐ-20 ఫామ్ ఆధారంగా వీసా పొడిగింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజులు, వ్యయాలు యూనివర్సిటీలను బట్టి ఫీజుల్లో వ్యత్యాసాలున్నాయి. టాప్-10 యూనివర్సిటీల్లో వార్షిక ఫీజు 40-47 వేల డాలర్లు ఉంది. ఉండటానికి, రవాణా, ఆహారం తదితర అవసరాలకు నెలకు 10 వేల డాలర్ల వరకు అవసరం. కొన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు అందిస్తున్న స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలి. ఉదా: ఏఏసీఈ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్, ఫుల్బ్రైట్ స్కాలర్షిప్.. * ద అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఉమెన్ (విద్యార్థినులకు) వంటి స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నించొచ్చు. కొన్ని యూనివర్సిటీలు మెరిట్ కమ్ మీన్ బేస్డ్ విధానంలో తొలి సెమిస్టర్లో చూపిన ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లు అందిస్తున్నాయి. యూఎస్-టాప్ వర్సిటీలు * మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ * ప్రిన్స్టన్ యూనివర్సిటీ * కాలిఫోర్నియా యూనివర్సిటీ * హార్వర్డ్ యూనివర్సిటీ * మిచిగాన్ యూనివర్సిటీ * స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ * యూనివర్సిటీ ఆఫ్ షికాగో * కొలంబియా యూనివర్సిటీ * యేల్ యూనివర్సిటీ * కార్నెగీ మిలన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతి యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.usnews.com, https://educationusa.state.gov యూఎస్‌లో అండర్గ్రాడ్యుయేట్ చదవాలనుకునే విద్యార్థులు.. అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం 8 నెలల ముందు నుంచి ఆ దిశగా అడుగులు వేయాలి. హాజరు కావాల్సిన ప్రామాణిక పరీక్షలు, యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూట్లపై రెండు నెలల్లో అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దరఖాస్తు చేసుకోవడానికి ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంటుంది. శాట్, ఏసీటీ పరీక్షల విషయంలో ఆందోళన అనవసరం. ఈ ఏడాది శాట్‌లో చేసిన మార్పులు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి. - రుచి థోమర్, డీజీఎం, మాన్యా ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్.