
న్యూఢిల్లీ: కొత్తగా నిర్వహించనున్న ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ–క్యూట్)’ను వచ్చే సెషన్ నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబం ధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కొత్తగా క్యూట్‌ను నిర్వహించనున్న విషయం తెల్సిందే. బోర్డు ఎగ్జామ్ మార్కుల ప్రాధాన్యతను తగ్గించాలనో, కోచింగ్ సంస్కృ తిని మరింత పెంచాలనే ఉద్దేశంతోనో క్యూట్ ను ప్రవేశపెట్టడంలేదని జగదీశ్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment