twice
-
ఆ రాష్ట్రంలో ఏటా రెండుసార్లు స్వాతంత్య్ర వేడుకలు
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో రెండుసార్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దీనివెనుక చారిత్రక కారణం ఉంది.గోవాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. భారతదేశం 1947, ఆగష్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రం పొందింది. బ్రిటీష్ వారు భారతదేశానికి రాకముందే పోర్చుగీస్‌వారు గోవాలో స్థిరపడ్డారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసినప్పటికీ, పోర్చుగీస్‌వారు 14 ఏళ్ల తర్వాత గోవాకు స్వాతంత్య్రాన్ని అందించారు. పోర్చుగీసువారు 1510 నుండి గోవాలో తిష్టవేశారు. అక్కడ నివసిస్తున్న హిందువులను నానా హింసలకు గురిచేశారు. పోర్చుగీస్ ప్రభుత్వం ఎవరైనా హిందువులు స్వచ్ఛందంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే, వారికి 15 ఏళ్లపాటు పాటు భూమి పన్ను నుండి విముక్తి కల్పిస్తామని ప్రకటించింది.భారతదేశనికి స్వాతంత్య్రం లభించాక గోవాను భారత్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే పోర్చుగీస్ వారు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో 1940 నుంచి గోవాలో స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రమయ్యింది. పలు సత్యాగ్రహాలు నిర్వహించారు. గోవాను మహారాష్ట్రలో కలపాలని కొందరు, కర్ణాటకలో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు. కొందరు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంటూ, స్వయంప్రతిపత్తిని కోరుకున్నారు. మరికొందరైతే పూర్తి స్వాతంత్ర్యం కోరుకున్నారు.ఈ పరిస్థితులను గమనించిన మహాత్మాగాంధీ గోవా విముక్తి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని సూచించారు. 1947లో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయ్యింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. 1961, డిసెంబరు18న నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు 30 వేల మంది భారతీయ సైనికులు గోవాపై దాడి చేసి ఫోర్చుగీసువారిని గోవా నుంచి తరిమికొట్టారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే పేరు పెట్టింది. సందర్భాన్ని పురస్కరించుకుని గోవాలో ప్రతీయేటా డిసెంబరు 19న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అలాగే భారత్‌లో గోవా భాగమైనందున ఆగస్టు 15న కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. -
10, 12 బోర్డు పరీక్షలు ఇకపై ఏడాదిలో రెండుసార్లు
న్యూఢిల్లీ: పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రెండు పరీక్షలు రాయాలా, లేదా ఒక్క పరీక్షకే హాజరు కావాలా అన్నది విద్యార్థుల ఇష్టమని స్పష్టం చేసింది. ఈ ఆప్షన్ ఐచ్ఛికమే తప్ప, నిర్బంధం కాదని వివరించింది. విద్యార్థుల్లో పరీక్షంటే భయం దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. నూతన కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్సీఎఫ్) సాధాసాధ్యాలపై మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈకి మాదిరిగానే విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసేందుకు వీలు దొరుకుతుంది. బెస్ట్ స్కోర్ సాధించొచ్చు. ఈ ఆప్షన్ పూర్తిగా విద్యార్థుల ఇష్టానికే వదిలేశాం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు. ఏడాదిలో ఒకేసారి పరీక్ష ఉండటం, ఈ చాన్స్ మిస్సయితే ఒక సంవత్సరం కోల్పోతామనే భయం, ఒత్తిడి ఎక్కువమంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. దీంతో, వారు పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు. రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశమిస్తే ఇలాంటి భయాలు వారిలో ఉండవు. పూర్తిస్థాయిలో ప్రిపేరయి పరీక్ష రాస్తే సంతృప్తికరమైన స్కోర్ సాధించగలుగుతారు. ఒకసారి మంచి స్కోర్ తెచ్చుకున్న విద్యార్థి మరో విడత పరీక్ష రాయాలా వద్దా అనేది ఐచ్చికం. ఇందులో ఎటువంటి నిర్బంధం లేదు’అని వివరించారు. 2024 నుంచే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. డమ్మీ స్కూల్స్ పనిపడతాం రాజస్తాన్‌లోని కోటాలో పరీక్షలకు శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులు ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో బలవన్మరణాలకు పాల్పడటంపై మంత్రి ప్రధాన్ స్పందిస్తూ.. ‘ఇది చాలా సున్నితమైన అంశం. విస్మరించరానిది’అన్నారు. అదేవిధంగా, తమ సొంత రాష్ట్రంలోని స్కూల్లో అడ్మిట్ అయిన విద్యార్థులు అక్కడ చదవకుండా, పరీక్షల శిక్షణ కోసం కోటా వంటి చోట్లకు వెళ్తుండటంపై మంత్రి.. ఇటువంటి డమ్మీ స్కూళ్లపై చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాఠశాలకు హాజరు కాకపోవడం విద్యార్థుల వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని, వారు ఒంటరితనంతో బాధపడుతూ, ఒత్తిడులకు గురవుతున్నట్లు నిపుణులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యా సంబంధ విధాన నిర్ణయాలపై ప్రభుత్వానికి సలహాలిచ్చే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ)ని ఆధునీకరిస్తామని మంత్రి ప్రధాన చెప్పారు. -
ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎక్సామ్స్..
ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా బోర్డ్ ఎక్సామ్స్‌తో సహా పలు కీలక మార్పులు చేయనున్నారు. అందుకు అనుగుణంగా 2024 ఏడాదికి పాఠ్య పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం నూతన విధివిధానాలకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించుకునేలా ప్రతి ఏడాది రెండు సార్లు బోర్డు పరీక్షలను పెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం విద్యార్థులు బాగా చదివిని సబ్జెక్టులనే ఎక్సామ్స్ రాసుకునే వెసులుబాటు కల్పించారు. మంచి మార్కులు వచ్చిన పరీక్షనే ఫైనల్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం తెచ్చుకునేలా ఈ విధానం ఉపయోగపడనుంది. ఇంటర్ స్థాయిలో విద్యార్థులకు రెండు భాషలను అభ్యసించేలా కొత్త విధానాలను సిద్ధం చేశారు. ఇందులో ఒకటి తప్పకుండా భారతీయ భాష అయి ఉండాలని నిబంధనలు విధించారు. పాఠ్యపుస్తకాల ధరను తగ్గించాలని నొక్కి చెబుతూనే, తరగతి గదిలో పుస్తకాలను 'కవరింగ్' చేసే ప్రస్తుత పద్ధతిని నివారించవచ్చని కొత్త ఫ్రేమ్‌వర్క్ గుర్తించింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే.. -
JEE Main Exam: జేఈఈ మెయిన్.. ఇక రెండుసార్లే
సాక్షి, అమరావతి: ఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించనుంది. గతంలో కరోనా సమయంలో నాలుగుసార్లు నిర్వహించిన ఎన్టీఏను ఏటా అలాగే అవకాశం కల్పించాలని విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్నా కేవలం రెండుసార్లు మాత్రమే ఈ పరీక్షను చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూళ్లను వచ్చే వారం విడుదల చేయనుంది. బోర్డుల పరీక్షలతో సమస్య రాకుండా ఉండేందుకు ఆయా రాష్ట్రాలతో కూడా ఎన్టీఏ సంప్రదిస్తోంది. బోర్డు పరీక్షలు, జేఈఈ పరీక్షలు ఒకే తేదీల్లో కాకుండా వేర్వేరుగా కొంత వ్యవధిలో నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా వేళలో నాలుగుసార్లు నిర్వహణ గతంలో జేఈఈ మెయిన్‌ను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుండగా 2019 నుంచి రెండుసార్లకు పెంచారు. ఒకే దఫా కారణంగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారని భావించి ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా సమయంలో పరీక్షలకు తీవ్ర ఆటంకం ఏర్పడడంతో 2021లో మెయిన్‌ను నాలుగు దఫాలుగా నిర్వహించారు. విద్యార్థులు ఈ నాలుగు దఫాల్లో దేనిలోనైనా పాల్గొని జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా అవకాశమిచ్చారు. 2022లో కూడా రెండుసార్లే నిర్వహించినా అవి చాలా ఆలస్యం కావడం, బోర్డు పరీక్షల సమయంలో వాటిని నిర్వహించేలా ముందు షెడ్యూళ్లు ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. పైగా.. కరోనా అనంతరం రెగ్యులర్ తరగతులు ఆ ఏడాది చాలా ఆలస్యంగా ప్రారంభమైనందున తాము మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరారు. అయితే, జనవరి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించాల్సిన ఆ పరీక్షలు జూన్, జూలైకు వాయిదా పడడం, ఫలితాల విడుదల కూడా చాలా జాప్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ కూడా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో.. విద్యాసంవత్సరం నష్టపోకుండా కొనసాగాలంటే ఇకపై జనవరి, ఏప్రిల్ మాసాల్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే నిర్వహించి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుకెళ్లేలా ప్రవేశ పరీక్షలను నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఎన్టీఏ భావిస్తోంది. అందుకనుగుణంగా ఇంటర్మీడియెట్ బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూళ్లకు ఇబ్బంది రాకుండా చూసేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తోందని వివిధ కోచింగ్ సంస్థల అధ్యాపకులు చెబుతున్నారు. ఏటా 10 లక్షలకు పైగా అభ్యర్థులు.. మరోవైపు.. జేఈఈ పరీక్షలకు ఏటా పది లక్షల మందికి పైగా అభ్యర్థులు రిజిస్టర్ అవుతున్నారు. ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించి మెరిట్లో ఉన్న టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తున్నారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2019లో అత్యధికంగా 12.37 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు రిజిస్టరయ్యారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
ఏడాదికి రెండుసార్లు ‘క్యూట్’ !
న్యూఢిల్లీ: కొత్తగా నిర్వహించనున్న ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ–క్యూట్)’ను వచ్చే సెషన్ నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ చెప్పారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబం ధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కొత్తగా క్యూట్‌ను నిర్వహించనున్న విషయం తెల్సిందే. బోర్డు ఎగ్జామ్ మార్కుల ప్రాధాన్యతను తగ్గించాలనో, కోచింగ్ సంస్కృ తిని మరింత పెంచాలనే ఉద్దేశంతోనో క్యూట్ ను ప్రవేశపెట్టడంలేదని జగదీశ్ స్పష్టంచేశారు. (చదవండి: కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: మోదీ) -
నీట్, జేఈఈ ఏటా రెండుసార్లు
న్యూఢిల్లీ: తరచూ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో కేంద్రం భారీ సంస్కరణలకు తెర లేపింది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్), జేఈఈ(మెయిన్స్), జాతీయ అర్హత పరీక్ష(నెట్) లాంటి పరీక్షలను ఇకపై సీబీఎస్ఈకి బదులుగా, కొత్తగా ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. నీట్, ఐఐటీ జేఈఈ–మెయిన్స్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. నీట్‌ను ఫిబ్రవరి, మే నెలల్లో, జేఈఈ–మెయిన్స్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు. విద్యార్థి ఈ పరీక్షలను రెండుసార్లు రాసినా, ఉత్తమ స్కోరునే ప్రవేశాల సమయం లో పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కసారి హాజరైనా సరిపోతుంది. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్)ల నిర్వహణ బాధ్యతను కూడా ఎన్టీఏకే అప్పగించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రాల లీకేజీని అడ్డుకుని, పారదర్శకంగా, సమర్థంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా పోటీ పరీక్షలు నిర్వహించేందుకే కొత్త విధానం అమల్లోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా పరీక్షలకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించారు. నెట్‌తో ప్రారంభం.. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయాలంటే అర్హత సాధించాల్సిన నెట్ పరీక్షతో(డిసెంబర్లో) ఎన్టీఏ పని ప్రారంభిస్తుంది. జేఈఈ మెయిన్స్ నిర్వహణను ఎన్టీఏకు అప్పగించినా, అడ్వాన్స్డ్ మాత్రం యథావిధిగా ఐఐటీల ఆధ్వర్యంలోనే జరుగుతుందని జవదేకర్ వెల్లడించారు. పైన పేర్కొన్న అన్ని పరీక్షలకు సిలబస్, ఫీజు, భాష, ప్రశ్నలు అడిగే తీరు మారవని స్పష్టం చేశారు. టైం టేబుల్‌ను ఎప్పటికప్పుడు మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 4–5 రోజుల పాటు జరిగే ఈ పరీక్షలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, పరీక్షకు ఎప్పుడు హాజరుకావాలో విద్యార్థే నిర్ణయించుకోవచ్చని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి అధునాతన ఎన్క్రిప్షన్ విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. ఎన్టీఏ విధానంలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ఎంతో అనుకూలమని, ఆగస్టు మూడో వారం నుంచి విద్యార్థులు అధీకృత కంప్యూటర్ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా సాధన చేయొచ్చని జవదేకర్ తెలిపారు. పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో అలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా ఉచిత సాధన కేంద్రాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఎన్టీఏ అంటే... దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏని ఏర్పాటుచేయాలని 2017–18 బడ్జెట్లో ప్రతిపాదించారు. దానికి కేంద్ర కేబినెట్ గతేడాది నవంబర్ 10న ఆమోదం తెలిపింది. ఎన్టీఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తుంది. ప్రముఖ విద్యావేత్తను ఎన్టీఏకు డైరెక్టర్ జనరల్/సీఈఓగా మానవ వనరుల శాఖ నియమిస్తుంది. నిపుణులు, విద్యావేత్తల నేతృత్వంలోని 9 వేర్వేరు విభాగాలు సీఈఓకి సహాయకారిగా ఉంటాయి.యూజీసీ, ఎంసీఐ, ఐఐటీ సభ్యులతో పాలక మండలిని ఏర్పాటుచేస్తారు. కేంద్రం ఎన్టీఏకు తొలుత రూ.25 కోట్ల ఏకకాల గ్రాంటు కేటాయిస్తుంది. తరువాత ఆ సంస్థే సొంతంగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఏకు డైరెక్టర్ జనరల్‌గా వినీత్ జోషి కొనసాగుతున్నారు. -
రెండు సార్లు జన్మించిన బిడ్డ
-
మీకు ఒకసారి చికెన్‌గున్యా సోకిందా.. అయితే..
న్యూఢిల్లీ: మీకు ఒకసారి చికెన్‌గున్యా సోకి తగ్గిందా. మీ సమాధానం అవును అయితే ఇక మీరు చికెన్‌గున్యా విషయంలో బేఫికర్ అంటున్నారు శాస్త్రవేత్తలు. చికెన్‌గున్యా ఒకసారి సోకినవారిలో మళ్లీ అంతగా ప్రభావం చూపదని ఢిల్లీ ఎయిమ్స్ వైరాలజిస్టులు స్పష్టం చేశారు. శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించిన వారి విషయంలో మాత్రమే చికెన్‌గున్యా రెండోసారి ప్రభావం చూపే అవకాశం ఉందని మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లలిత్ దర్ వెల్లడించారు. ఢిల్లీలో 2006లో చికెన్‌గున్యా తీవ్రంగా ప్రబలిన అనంతరం అక్కడ ఈ వ్యాధి అంతగా వ్యాపించలేదని.. అయితే ఆ తరువాతి కాలంలో అక్కడ జన్మించిన, ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారిలో ఈ వ్యాధి ప్రబలుతోందని ప్రస్తుత వ్యాధి తీవ్రతను ఆయన విశ్లేషించారు. ఢిల్లీలో చికెన్‌గున్యా మూలంగా ప్రజలు చనిపోతున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో కేవలం చికెన్‌గున్యా మూలంగానే మరణాలు సంభవిస్తున్నాయనడం సబబు కాదని.. ఇతర కారణాలతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై మాత్రమే చికెన్ గున్యా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం ఇటీవల జ్వరంతో మృతి చెందిన 13 కేసులను పరిశీలించిన అనంతరం.. ఆ మరణాలకు కేవలం చికెన్‌గున్యా కారణం కాదని.. నిమోనియా, సెప్సిస్, కిడ్నీ సంబంధ వ్యాదులతో వారు మృతి చెందారని వెల్లడించింది. -
పాక్ జైల్లో భారతీయుడిపై దాడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైల్లో భారతీయ ఖైదీపై దాడి జరిగింది. పెషావర్ సెంట్రల్ జైల్లో ఉన్న హమీద్ నెహల్ అన్సారీపై ఓ పాకిస్తాన్ ఖైదీ దాడికి పాల్పడినట్లు మీడియా సంస్థ 'డాన్' శుక్రవారం వెల్లడించింది. గత రెండు నెలల వ్యవధిలో అన్సారీపై దాడి జరగటం ఇది రెండవ సారి. జైలు అధికారులు సైతం రోజూ వేధిస్తున్నారని, అన్సారీకి ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతూ అన్సారీ తరఫు లాయర్ కోర్టును కోరారు. దీనిపై జైలు సూపరిండెంట్ మసూద్ రెహ్మాన్ సమాధానమిస్తూ.. అన్సారీకి అయినటువంటి గాయాలు చాలా చిన్నవనీ.. జైళ్లలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని పేర్కొనడం విశేషం. గాయాలయిన అన్సారీని ఆసుపత్రికి తరలిస్తామని చెప్పిన జైలు అధికారులు ఆ విధంగా చేయలేదని లాయర్ ఆరోపించారు. అన్సారీకి ప్రత్యేక భద్రత కల్పించాలని కోరినా.. జైలు అదికారులు తిరస్కరించినట్లు తెలిపారు. నఖిలీ పాకిస్తాన్ ఐడీ కార్డును కలిగి ఉన్నాడన్న కారణంతో అరెస్టైన అన్సారీ మూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. -
మధ్య ప్రదేశ్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
మధ్యప్రదేశ్ః నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో మరో దారుణం వెలుగు చూసింది. పదమూడేళ్ళ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. రెండు రోజుల్లో రెండు గ్రూపులు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. తోడుకోసం రమ్మని ఒకరు, లిఫ్ట్ ఇస్తామని మరొకరు నమ్మించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసు వివరాలను పరిశీలిస్తే... నిందితులు బాధితురాలికి తెలిసున్నవారుగా తెలుస్తోందని, ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నామని... అతడి ఆధారంగా మిగిలినవారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నట్లు ధార్ కోట్ పోలీసులు చెప్తున్నారు. మార్చి 7వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా దేవాలయానికి వెళ్ళిన బాలికను తమకు తోడుగా రమ్మంటూ నమ్మించి, ఒప్పించి ఇద్దరు యువకులు పారిశ్రామిక ప్రాంతంలోకి తీసుకెళ్ళారని, అనంతరం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆకాష్ అలియాస్ గోలు, అతిని స్నేహితుడితో సహా ఆమెను మానభంగం చేయడంతోపాటు ఆరోజు అక్కడే బలవంతంగా ఉంచేసినట్లు కూడ బాధితురాలు తెలిపింది. అయితే మర్నాడు మార్చి 8వ తేదీన వారినుంచి తప్పించుకొని నగరంలోనే ఉన్న తన తాతగారింటికి వెళ్ళానని, అయితే వారికి జరిగిన విషయం చెప్పలేదని ఆమె తెలిపింది. అక్కడినుంచీ తిరిగి ఇంటికి బయల్దేరిన తనను తనకు తెలిసిన మరో ఇద్దరు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి సంజయ్ కాలనీకి తీసుకువెళ్ళారని, అక్కడ ఆరుగురు యువకులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే బాధితురాలి తల్లిదండ్రులు ఆమె మార్చి 7న ఇంటినుంచి వెళ్ళి తిరిగి రాలేదంటూ ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండురోజుల అనంతరం తనంతట తానుగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాలిక... తనపై జరిగిన ఆఘాయిత్యాలను పోలీసులకు వివరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, నిందితులు సంతోష్ (24), సుభాష్ సింగ్ (20) ఆకాష్ అలియాస్ గోలు (19), భరత్ (18) తోపాటు మరో ముగ్గురిపై వివిధ సెక్షల్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ అంజనా ధుర్వే తెలిపారు.