కామన్వెల్త్, ఆసియా క్రీడలు | Asian Commonwealth Games | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్, ఆసియా క్రీడలు

Published Mon, Jan 23 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

Asian Commonwealth Games

కామన్వెల్త్‌ క్రీడల్లో కామన్వెల్త్‌ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారు. ఈ క్రీడలు తొలిసారిగా 1930లో కెనడాలోని హామిల్టన్‌ నగరంలో జరిగాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రపంచ యుద్ధాల కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో వీటిని నిర్వహించలేదు. 1930–50 కాలంలో బ్రిటిష్‌ ఎంపైర్‌ గేమ్స్‌గా, 1954–66 మధ్య బ్రిటిష్‌ ఎంపైర్‌ అండ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌గా, 1970–74 కాలంలో బ్రిటిష్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌గా ఈ క్రీడలను పిలిచారు. 1978 నుంచి కామన్వెల్త్‌ గేమ్స్‌గా పిలుస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్‌ దేశాలు (ఆరు) ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్నాయి. ఈ క్రీడలను ఆస్ట్రేలియా, కెనడాలు అత్యధికంగా చెరో నాలుగుసార్లు నిర్వహించాయి. భారతదేశం 2010 లో కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.

20వ కామన్వెల్త్‌ క్రీడలు
20వ కామన్వెల్త్‌ క్రీడలు 2014, జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. ఈ క్రీడల్లో 71 దేశాలకు చెందిన 4,947 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 17 క్రీడల్లో 261 ఈవెంట్లు జరిగాయి. ఇంగ్లండ్‌ అత్యధికంగా 58 స్వర్ణ, 59 రజత, 57 కాంస్య పతకాలను సాధించింది. ఈ క్రీడల్లో మొత్తం 174 పతకాలను కైవసం చేసుకుని ఇంగ్లండ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్‌లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు 15 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలు కలిపి మొత్తం 64 పతకాలు లభించాయి. ఆరంభ వేడుకల్లో భారత్‌ తరపున షూటర్‌ విజయ్‌ కుమార్‌ జాతీయ పతాకాన్ని చేబూని భారత క్రీడా బృందానికి ముందు నడిచాడు. ముగింపు వేడుకల్లో సీమా పూనియా (డిస్కస్‌ త్రో) జాతీయ పతాకధారిగా నిలిచింది.

భారత స్వర్ణపతక విజేతలు

సంజిత కుముక్‌చామ్‌    మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌
సుఖేన్‌ డే    పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌
అభినవ్‌ బింద్రా    షూటింగ్‌
అపూర్వి చందేల    మహిళల షూటింగ్‌
రాహి సర్నోబత్‌    మహిళల షూటింగ్‌
సతీష్‌ శివలింగం    వెయిట్‌ లిఫ్టింగ్‌
జీతూ రాయ్‌    షూటింగ్‌
అమిత్‌ కుమార్‌    రెజ్లింగ్‌
వినేష్‌ ఫోగత్‌    మహిళల రెజ్లింగ్‌
సుశీల్‌ కుమార్‌    రెజ్లింగ్‌
బబిత కుమారి    మహిళల రెజ్లింగ్‌
యోగేశ్వర్‌ దత్‌    రెజ్లింగ్‌
వికాస్‌ గౌడ    డిస్కస్‌ త్రో
దీపికా పల్లికల్‌    
జ్యోత్స్న చిన్నప్ప    స్క్వాష్‌ (మహిళల డబుల్స్‌)
పారుపల్లి కశ్యప్‌    బ్యాడ్మింటన్‌

కామన్వెల్త్‌ క్రీడలు– వేదికలు

ఇప్పటివరకు 20 కామన్వెల్త్‌ క్రీడలు జరిగాయి.
కొన్నింటి వివరాలు.
సంవత్సరం    నగరం    దేశం
1930    హామిల్టన్‌    కెనడా
1934    లండన్‌    ఇంగ్లండ్‌
1938    సిడ్నీ    ఆస్ట్రేలియా
1950    అక్లాండ్‌    న్యూజిలాండ్‌
1954    వాంకోవర్‌    కెనడా
1998    కౌలాలంపూర్‌    మలేసియా
2002    మాంచెస్టర్‌    ఇంగ్లండ్‌
2006    మెల్‌బోర్న్‌    ఆస్ట్రేలియా
2010    న్యూఢిల్లీ    ఇండియా
2014     గ్లాస్గో    స్కాట్లాండ్‌

ఆసియా క్రీడలు
ఆసియా క్రీడలు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ఒలంపిక్స్‌ తర్వాత ప్రపంచంలో అతి పెద్ద క్రీడా సంబరంగా వీటిని పేర్కొంటారు. ఈ క్రీడలు తొలిసారి 1951లో          (న్యూఢిల్లీ) జరిగాయి. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్‌ (ఏడు) దేశాలు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లో పాల్గొన్నాయి.

17వ ఆసియా క్రీడలు
17వ ఆసియా క్రీడలు 2014లో సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరిగాయి. వీటికి దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన 9,501 క్రీడాకారులు పాల్గొన్నారు. 36 క్రీడల్లో 439 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. చైనా 151 స్వర్ణపతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వీటితో పాటు 108 రజత, 83 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 342 పతకాలను చైనా సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా, జపాన్, కజకిస్థాన్, ఇరాన్, థాయిలాండ్, ఉత్తర కొరియా దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్‌ 57 పతకాలు సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 11 స్వర్ణ, 10 రజత, 36 కాంస్య పతకాలను భారత క్రీడాకారులు సాధించారు. జపాన్‌ స్విమ్మర్‌ హగినో కొసుకే నాలుగు స్వర్ణాలతో సహా మొత్తం ఏడు పతకాలు సాధించి ‘శాంసంగ్‌ అత్యంత విలువైన క్రీడాకారుడు’ అవార్డును గెలుచుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement