భారత జాతీయోద్యమ కాలంలో సాహిత్యాభివృద్ధి | Bhavitha Special | Sakshi
Sakshi News home page

భారత జాతీయోద్యమ కాలంలో సాహిత్యాభివృద్ధి

Published Fri, Nov 25 2016 4:48 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

భారత జాతీయోద్యమ కాలంలో సాహిత్యాభివృద్ధి

భారత జాతీయోద్యమ కాలంలో సాహిత్యాభివృద్ధి

19వ శతాబ్దం రెండో సగంలో భారతదేశంలో జాతీయ, రాజకీయ చైతన్యం పరవళ్లు తొక్కింది. సుసంఘటితమైన జాతీయోద్యమం రెక్కవిప్పింది.

19వ శతాబ్దం రెండో సగంలో భారతదేశంలో జాతీయ, రాజకీయ చైతన్యం పరవళ్లు తొక్కింది. సుసంఘటితమైన జాతీయోద్యమం రెక్కవిప్పింది. 1885 డిసెంబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. విదేశీ పాలన నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ నాయకత్వంలో భారత ప్రజలు సుదీర్ఘ పోరాటం సాగించారు. దీని ఫలితంగా దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించింది. బ్రిటిష్ పాలన సృష్టించిన పరిస్థితులే భారతీయుల్లో జాతీయవాద వ్యాప్తికి దారి తీశాయి. బ్రిటిష్ పాలన, దాని ప్రత్యక్ష, పరోక్ష ఫలితాలు దేశంలో జాతీయోద్యమ స్ఫూర్తికి, జాతీయవాద సాహిత్యాభివృద్ధికి నైతిక, భౌతిక పరిస్థితులు కల్పించాయి.
 
 పాశ్చాత్య విద్యా ప్రభావం
 19వ శతాబ్దంలో ఆధునిక పాశ్చాత్య విద్య వ్యాప్తి ఫలితంగా ప్రజల్లో చాలామంది ఒక నూతన హేతువాద, లౌకిక, ప్రజాస్వామిక, జాతీయవాద, రాజకీయ దృక్పథాన్ని అలవర్చుకున్నారు. ఐరోపా దేశాల్లోని సమకాలీన జాతీయోద్యమాల్ని అధ్యయనం చేసి వాటి నుంచి ఉత్తేజం పొందారు. రూసో, పేస్, జాన్‌స్టువార్‌‌ట మిల్ తదితర పాశ్చాత్య తత్వవేత్తల నుంచి స్ఫూర్తి పొందారు. మాజిని, గారిబాల్డీ, ఐరిష్ జాతీయోద్యమ నేతలు భారతీయులను ప్రభావితం చేశారు. దాదాభాయ్ నౌరోజీ, సయ్యద్ అహ్మద్ ఖాన్, రనడే, తిలక్, గాంధీ వంటి నాయకులు విద్యావ్యవస్థలో భారతీయ భాషలకు పెద్దపీట వేయాలని ఆందోళన చేశారు.
 
 ఆంగ్లేయ విద్యా విధానంతో జాతీయవాద సాహిత్యం బలపడింది. 1835లో మెకాలే ఆంగ్ల భాషను అధికార మాధ్యమంగా ప్రకటించడంతో భారతీయ సాహిత్యంలో నూతన పంథా ప్రారంభమైంది. హేతువాదం, మానవతావాదం, కాల్పనికవాదం వంటి భావాలు సమాజంలో చొచ్చుకొని వచ్చాయి. రచనా సంప్రదాయాల్ని ప్రభావితం చేశాయి. ఇందులో భాగంగానే సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లను ప్రశ్నించే ధోరణులు, అభ్యుదయ భావాలు సాహిత్యంలో చోటుచేసుకున్నాయి.
 
 సాహిత్యం - పత్రికల పాత్ర
 జాతీయవాదుల దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికి, ఆధునిక ఆర్థిక, సామాజిక, రాజకీయ భావాలను ప్రజల్లో వ్యాప్తి చేయడానికి, జాతీయ చైతన్యాన్ని కలిగించడానికి పత్రికలు
 ప్రధాన సాధనంగా ఉపయోగపడ్డాయి. 19వ శతాబ్దం రెండో సగంలో జాతీయ భావాలను ప్రచారం చేసే పత్రికలు చాలా వెలువడ్డాయి. అవి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించాయి. భారతీయ దృక్పథాన్ని వివరించాయి. జాతీయ శ్రేయస్సు కోసం ప్రజలందరూ సమైక్యం కావాలని పిలుపునిచ్చాయి. స్వపరిపాలన, ప్రజాస్వామ్యం, పారిశ్రామికీకరణ లాంటి విషయాలను ప్రజల్లో ప్రచారం చేశాయి. బెంగాల్‌లో ది హిందూ పేట్రియట్, అమృత బజార్, ఇండియన్ మిర్రర్, ది బెంగాలీ; బొంబాయిలో ది నేటివ్ ఒపీనియన్, ఇందుప్రకాశ్, మరాఠా, కేసరి; మద్రాసు రాష్ర్టంలో ది హిందూ, స్వదేశమిత్రన్, ఆంధ్ర ప్రకాశిక, కేరళ పత్రిక; ఉత్తరప్రదేశ్‌లో అడ్వకేట్, హిందూస్తానీ, ఆజాద్; పంజాబ్‌లో ట్రిబ్యూన్, అక్బర్-ఇ-యామ్, కోహినూర్ ఆనాటి ప్రముఖ 
 వార్తాపత్రికలు.
 
 నవల, వ్యాసం, దేశభక్తి గేయాల రూపంలో జాతీయ సాహిత్యం ప్రజల్లో జాతీయాభిమానాన్ని, చైతన్యాన్ని రేకెత్తించింది. బెంగాల్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటర్జీ, శరత్ చంద్ర ఛటర్జీ; అస్సాంలో లక్ష్మీనాథ్ బెజ్‌బారువా; మహారాష్ర్టలో విష్ణుశాస్త్రి చిప్‌లంకర్; తమిళనాడులో సుబ్రమణ్య భారతి; ఉర్దూలో ఇక్బాల్, అల్తాఫ్ హుస్సేన్ హోలి; ఆంధ్ర దేశంలో కందుకూరి వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి లాంటివారు ఆనాటి ప్రముఖ జాతీయ కవులు, రచయితలు.
 
 జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన కార్యకలాపాలు చాలావరకు పత్రికా రంగం ద్వారానే సాగేవి. కాంగ్రెస్ తీర్మానాలు మొదలైనవన్నీ పత్రికా ముఖంగానే వెలువడేవి. అప్పట్లో శక్తిమంతులు, ధీశాలురైన పాత్రికేయుల సారథ్యంలో వార్తాపత్రికలు వెలువడ్డాయి. జి. సుబ్రమణ్య అయ్యర్ సంపాదకత్వంలో ది హిందూ, స్వదేశమిత్రన్; బాలగంగాధర్ తిలక్ సంపాదకత్వంలో కేసరి, మరాఠా; సురేంద్రనాథ్ బెనర్జీ సంపాదకత్వంలో అమృతబజార్ పత్రిక; గోపాలకృష్ణ గోఖలే సంపాదకత్వంలో సుధాకర్; ఎన్‌ఎన్ సేన్ సంపాదకత్వంలో ఇండియన్ మిర్రర్; దాదాభాయ్ నౌరోజీ సంపాదకత్వంలో వాయిస్ ఆఫ్ ఇండియా; జీపీ వర్మ సంపాదకత్వంలో హిందూస్తానీ, అడ్వకేట్ పత్రికలు; పంజాబ్ నుంచి ట్రిబ్యూన్, అక్బర్-ఇ-యామ్ పత్రికలు; బొంబాయి నుంచి ఇందు ప్రకాశ్, ధ్యాన్ ప్రకాశ్, కల్, బంగ నివాసి, సాధారణి వెలువడేవి.
 
 హేతువాద సాహిత్యం
 సామాజిక, రాజకీయ వ్యవస్థలను ప్రశ్నించే ధోరణితో కూడిన హేతువాద సాహిత్యం రాజా రామ్‌మోహన్‌రాయ్‌తో ప్రారంభమైంది.  సంబంధ్ కౌముది అనే పత్రిక ద్వారా సతీ సహగమన దురాచారాన్ని వ్యతిరేకించారు. యువ బెంగాల్ ఉద్యమకర్త అయిన హెన్రీ వివియన్ డిరోజియో సామాజిక, ఆర్థిక సమస్యలపై కరపత్రాలు ప్రచురించారు. తత్వబోధిని పత్రిక సంపాదకుడిగా అక్షయకుమార్ దత్తు..హేతువాదాన్ని ప్రచారం చేశారు.
 
 బెంగాల్‌లో బ్రిటిష్ వలస ప్రభుత్వ విధానాలను, నీలిమందు రైతాంగ సమస్యలను ప్రతిబింబిస్తూ ‘నీల్ దర్పణ్’ అనే నాటకాన్ని దీనబంధు మిత్ర రచించారు.మహారాష్ర్టలో బాలశాస్త్రి జాంబేకర్.. దర్పణ్, దిగ్ దర్పణ్ వంటి పత్రికల్లో హేతువాదాన్ని ప్రచారం చేశాడు. కులవ్యవస్థలోని దురాచారాలను ముఖ్యంగా బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ లోకహితవాది అనే కలం పేరుతో గోపాల్ హరిదేశ్‌ముఖ్ రచనలు చేశారు. మరాఠీలో చిప్లుంకర్, జ్యోతిబా పూలేలు తమ రచనల ద్వారా ప్రజల్లో హేతువాద దృక్పథాన్ని ప్రచారం చేశారు. జాతీయ భావాలను పెంపొందించారు. 
 
 ఊహాజనిత వాదం (భావుకతా వాదం)
 భావుకతావాదం కూడా జాతీయవాద సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన దుర్గేశనందిని, ఆనంద్‌మఠ్‌లను ఆధునిక సాహిత్యంలో మొట్టమొదటి నవలలుగా పేర్కొనవచ్చు. మహారాష్ర్టలో ఆర్.సి.దత్ రచించిన మహారాష్ర్ట జీవన ప్రభాత్, రాజపుత్ర జీవన సంజ లాంటి రచనలు వలస ప్రభుత్వ విధానంలో చోటుచేసుకున్న సామాజిక నిస్పృహను ప్రతిబింబించాయి.రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో భావుకతావాదాన్ని చక్కగా ప్రతిబింబించారు. తమిళ సాహిత్యంలో సుబ్రమణ్య భారతి దేశభక్తి గీతాలు, భక్తి పాటలతో సమకాలీన సామాజిక సమస్యలను ప్రచారం చేశారు. మహాభారతం ఆధారంగా పాంచాలీ శపథం రాశారు. కలిప్పట్టు, కన్నన్ పట్టు, కుయిల్ పట్టు 1921లో రచించారు.
 
 పూర్తి సంస్కరణ వాదంతో కూడిన రచనలు జాతీయవాద సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. ఇంద్రమీనన్ - ఇందులేఖ; సి.వి. రామన్ పిళ్లై - మార్తాండవర్మ; మైఖేల్ మధుసూదన్ దత్తు - శర్మిష్టి రచనలు సంస్కరణ వాదాన్ని ప్రతిబింబించాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గోరా నవల సంస్కరణ వాదాన్ని ప్రతిబింబించింది. అదేవిధంగా తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కరణ, హేతువాద రచనలతో తన పత్రికలైన వివేకవర్ధిని, సతీహిత బోధిని, హాస్య సంజీవని ద్వారా జాతీయ స్ఫూర్తిని పెంపొందించారు.
 
 జాతీయవాద సాహిత్య దృక్పథం మహమ్మదీయుల రచనల్లో కూడా చోటుచేసుకుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్.. అల్-హిలాల్ పత్రిక ద్వారా సంస్కరణవాదంతోపాటు జాతీయ భావాలను ప్రకటించారు. మహ్మద్ ఇక్బాల్ (పంజాబ్) రచించిన సారే జహాసె అచ్ఛా.. జాతీయోద్యంపై గొప్ప ప్రభావం చూపింది. అతివాద యుగంలో తిలక్ నడిపిన కేసరి, మరాఠా పత్రికలు, లాలాలజపతిరాయ్ అన్ హ్యాపీ ఇండియా, బిపిన్ చంద్రపాల్ నడిపిన బెంగాల్ ఒపీనియన్, న్యూ ఇండియా భారత స్వాతంత్య్రోద్యమంపై ప్రభావం చూపాయి. 1916 నాటి హోంరూల్ ఉద్యమ కాలంలో అనీబిసెంట్ నడిపిన కామన్‌వీల్, న్యూ ఇండియా పత్రికలు స్వయం పరిపాలన, విద్య ప్రాధాన్యతను ప్రచారం చేశాయి. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన హిందూ స్వరాజ్ పత్రిక, భారత్‌లో ఆయన నడిపిన యంగ్ ఇండియా, హరిజన్ పత్రికలు జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చాయి. 
 
 విప్లవ హింసావాదం
 బ్రిటిష్ ప్రభుత్వ దమన నీతి, రాజకీయ పోరాటాల వైఫల్యం వల్ల ఆవరించిన నిస్పృహ అంతిమంగా విప్లవ హింసావాదంగా పరిణమించింది. 1905 తర్వాత అనేక పత్రికలు విప్లవ హింసావాదాన్ని ప్రచారం చేశాయి. బెంగాల్‌లో సంధ్య, యుగంతర్; పూనాలో కాల్ పత్రికలు విప్లవ ఉగ్రవాదాన్ని ప్రచారం చేశాయి. విప్లవవాదులు విదేశాల్లో కూడా తమ కేంద్రాలను ప్రారంభించారు. శ్యామ్‌జీ కృష్ణవర్మ.. ఇండియన్ సోషియాలజిస్టు, మేడమ్ కామా.. వందేమాతరం; మిస్ కాథరిన్ మాయో.. మదర్ ఇండియా ద్వారా విప్లవ భావాలతో కూడిన జాతీయ వాదాన్ని ప్రబోధించారు.
 
 తొలినాటి భారతీయ ఆంగ్ల రచయితలు
 భారత్‌లో ఆంగ్ల రచనలకు రాజా రామ్మోహన్‌రాయ్ ఆద్యుడు. 19వ శతాబ్దంలో హెన్రీ డిరోజియో, మైఖేల్ మధుసూదన్ దత్.. రామ్మోహన్‌రాయ్‌ని అనుసరించారు. తోరుదత్ ఆంగ్లంలో ‘ఏన్సియంట్ బలాడ్‌‌స’, లెజెండ్‌‌స ఆఫ్ హిందూస్తాన్’ లాంటి నవలలు రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలికి 1913లో నోబెల్ బహుమతి లభించింది. సరోజినీ నాయుడు 1905లో గోల్డెన్ త్రెషోల్డ్, 1917లో ది బ్రోకెన్ వింగ్‌‌స వంటి రచనలు చేశారు. కవి, తాత్వికుడు, రుషి అయిన అరవింద్ ఘోష్ రచించిన దీర్ఘ కవిత సావిత్రి, ది డివైన్ లైఫ్.. ఆంగ్ల సాహిత్యంలో విశిష్ట రచనలు. నిరాద్ సి.చౌధురి (1897-1999) ప్రఖ్యాత రచయిత. ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ యాన్ అన్‌నోన్ ఇండియన్ అనే రచనతో అంతర్జాతీయంగా కీర్తి పొందారు. జీవిత చరిత్ర రెండో భాగం దై హ్యాండ్, గ్రేట్ అనార్‌‌కను 90వ ఏట రాశారు. ది ప్యాసేజ్ టు ఇంగ్లండ్ అనేది మరో రచన. ఇవి కాకుండా ఆయన ఇతర రచనలు ‘ది కాంటినెంట్ ఆఫ్ సిర్‌‌స, టు లివ్ ఆర్ నాట్ టు లివ్, క్లైవ్ ఆఫ్ ఇండియా, స్కాలర్ ఎక్స్‌ట్రార్డినరీ, త్రీ హార్‌‌సమెన్ ఆఫ్ ది న్యూ అపోకలిప్స్.
 
 ముల్క్‌రాజ్ ఆనంద్
 సామాజిక సమస్యలపై అన్‌టచ్‌బుల్ (1935), కూలీ (1936), టూ లీవ్‌‌స అండ్ ఎ బడ్ (1937), ది విలేజ్ (1939), ది బిగ్ హార్‌‌ట (1945) మొదలైన నవలలు ఆంగ్లంలో రచించారు. ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ యాన్ ఇండియన్ ప్రిన్‌‌స నవలను 1953లో రచించారు.  ది లాస్ట్ చైల్డ్ కథా రచయితగా ప్రసిద్ధులు.
 
 ఆర్.కె.నారాయణ్
 భారతదేశ ఆంగ్ల కల్పనా సాహిత్య పితామహుడిగా పేరొందారు. స్వామి అండ్ ఫ్రెండ్‌‌స ఆయన మొదటి నవల. గైడ్ అనే నవలతో సహా 34 నవలలు రచించారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్‌‌ట్స, ది ప్రింటర్ ఆఫ్ మాల్గుడి, ది మ్యాన్ ఈటర్ ఆఫ్ మాల్గుడి, ది ఫైనాన్షియల్ ఎక్స్‌పర్‌‌ట, వెయిటింగ్ ఆఫ్ ది మహాత్మా, ది వెండర్ ఆఫ్ స్వీట్స్, రిలక్టంట్ గురు, ది పెయింటర్ ఆఫ్ సైన్‌‌స, ది టైగర్ ఆఫ్ మాల్గుడి వంటి నవలలు రచించారు.
 ముల్క్‌రాజ్ ఆనంద్, ఆర్.కె.నారాయణ్, రాజారావు ఆంగ్ల నవలాకారుల త్రయంగా ప్రసిద్ధి చెందారు. రాజారావు 1938లో కాంతాపుర, ది సర్పెంట్ అండ్ ది రోప్ (1960), ది కేట్ అండ్ షేక్‌స్పియర్ (1965) వంటి నవలలు రచించారు. ఆయన నవల ‘ది సర్పెంట్ అండ్ ది రోప్‌కి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ది చెస్ మాస్టర్ అండ్ హిజ్ మూవ్‌‌స నవలకు ప్రతిష్టాత్మక న్యూస్టాడ్ ఇంటర్నేషనల్ బహుమతి పొందారు. 1947లో ది కౌ ఆఫ్ బారికేడ్‌‌స, 1977లో ది పోలీస్‌మ్యాన్ అండ్ ద రోజ్.. రాజారావు ప్రఖ్యాత కథా సంకలనాలు. 
 కుష్వంత్ సింగ్ ప్రముఖ నవలాకారుడు, కథా రచయిత, ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా సంపాదకుడిగా ప్రఖ్యాతి పొందారు. ట్రెయిన్ టు పాకిస్తాన్, ఢిల్లీ, ఐ షల్ నాట్ హియిర్ ది నైటింగేల్ నవలలు రచించారు.
  నిసిమ్ ఎజెకీల్ భారతదేశ ఆంగ్ల కవుల్లో ఆధునికుడు. టైమ్ టు ఛేంజ్ (1952), సిక్స్‌టీ  పొయెమ్స్ (1953), ది థర్‌‌డ (1959), ది అన్‌ఫినిష్డ్ మ్యాన్ (1960), ది ఎగ్జాక్ట్ నేమ్ (1965), హిమ్న్స్ ఇన్ డార్‌‌కనెస్ (1976), లేటర్-డే సామ్స్ (1982), కలెక్టెడ్ పొయెమ్స్ (1989) వంటి ఆంగ్ల రచనలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement