రోసీ ఫారల్ స్కేలు: దీన్ని ఫ్రాన్‌సలో అభివృద్ధి చేశారు.
రోసీ ఫారల్ స్కేలు: దీన్ని ఫ్రాన్‌సలో అభివృద్ధి చేశారు.
షిండే స్కేలు: దీన్ని జపాన్‌లో అభివృద్ధి చేశారు. దీనిలో 1 నుంచి 7 విభాగాలు ఉంటాయి. భూకంప తీవ్రత స్కేలుపై 6 -7 మధ్య ఉంటే నష్ట తీవ్రత అధికంగా ఉంటుంది.
మెర్కిలీ స్కేలు: ఇటలీకి చెందిన మెర్కిలీ దీన్ని రూపొందించారు. దీనిలో ఐ నుంచి గీఐఐ వరకు విభాగాలుంటాయి. ఈ స్కేల్లోని విభాగాలను రోమన్ అంకెల్లో గుర్తించారు. భూకంప తీవ్రత గీఐ, గీఐఐ ఉంటే కట్టడాలు కూలతాయి. నదీ ప్రవాహ మార్గాలు మారతాయి. జన జీవనం అతలాకుతలం అవుతుంది.
రిక్టర్ స్కేలు: భూతల ప్రకంపనలను నిరంతరం లెక్కించే రిక్టర్ స్కేలును అమెరికా శాస్త్రవేత్త చార్లెస్ రిక్టర్ 1935లో రూపొందించారు. దీనిలో 0 నుంచి 9 విభాగాలున్నాయి. మొత్తం 10 విభాగాలు.
‘ట్రైనైట్రోటోలిన్’ అనే రసాయనిక పదార్థం ద్వారా విడుదలయ్యే శక్తితో భూకంపన శక్తిని పోలుస్తూ రిక్టర్ ఈ విభజన చేశారు.
స్కేలుపై ఉన్న ప్రతి ఏకాంకం, కిందటి ఏకాకం కంటే 30 రెట్లు అధిక శక్తిని సూచిస్తుంది.
ఇప్పటి వరకు రిక్టర్ స్కేలుపై నమోదైన పెద్ద భూకంపం- 1960 చిలీ భూకంపం (తీవ్రత 9.2).