
ఎయిర్ ఇండియాలో 170 పోస్టులు
ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్..క్యాబిన్ క్రూ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.
ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్..క్యాబిన్ క్రూ పోస్టుల భర్తీకి ప్రకటనను
విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కాంట్రాక్ట్ కాల పరిమితి ఐదేళ్లు. సంస్థ అవసరం,
అభ్యర్థి పనితీరు ఆధారంగా పొడిగించేఅవకాశం ఉంది. ఈ కొలువులకు
అవివాహితులు మాత్రమే అర్హులు.
ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు: 170 (ఎస్సీ-28, ఎస్టీ-12, ఓబీసీ-43, ఓసీ-87)
వేతనం
శిక్షణా కాలంలో నెలకు రూ.10,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రూ.31,880 ఇస్తారు.
విద్యార్హత
ఇంటర్/10+2 ఉత్తీర్ణత. హోటల్ మేనేజ్‌మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీలో మూడేళ్ల డిగ్రీ/డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ కోర్సు ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి
కనీసం 18 ఏళ్లు; గరిష్టం 22 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఇతర ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూగా చేసినవారికీ సడలింపు ఇస్తారు. అయితే వీరికి ఈ సడలింపుతో కలుపుకొని గరిష్ట వయసు 28 ఏళ్లు మించకూడదు.
శారీరక ప్రమాణాలు
ఎ. ఎత్తు: పురుషులు 165 సెం.మీ (5 అడుగుల 5 అంగుళాలు); స్త్రీలు 157.5 సెం.మీ (5 అ॥2 అ॥ఎస్సీ, ఎస్టీలకు 2.5 సెం.మీ. (ఒక అంగుళం) సడలింపు ఉంటుంది.
బి. బరువు: సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
సి. కంటి చూపు: నియర్ విజన్ ఎన్/5 లేదా ఎన్/6; డిస్టెంట్ విజన్ (ఒక కంటికి) 6/6, (మరో కంటికి) 6/9 ఉండాలి. కళ్లద్దాలను అనుమతించరు. కాంటాక్ట్ లెన్స్ ‘+2డి’ స్థాయి వరకు ఉండొచ్చు. కలర్ విజన్.. ఇషిహర చార్ట్‌పై నార్మల్‌గా ఉండాలి.
డి. ఆహార్యం: ముఖంపై ఎలాంటి మచ్చలు (కనీసం పుట్టు మచ్చలు కూడా) ఉండకూడదు. పలు వరుస బాగుండాలి.
మాట తీరు
స్పష్టంగా మాట్లాడాలి. నత్తి ఉండకూడదు.
భాషా నైపుణ్యం
హిందీ, ఇంగ్లిష్ స్పష్టంగా రాయాలి. మాట్లాడాలి. విదేశీ భాషలు వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఎంపిక విధానం
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు/గత అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. వైద్య పరీక్షల వ్యయాన్ని (రూ.500 నుంచి రూ.1000 వరకు) అభ్యర్థులే చెల్లించాలి. గ్రూప్ డిస్కషన్‌కు మహిళలు చీర ధరించి, పురుషులు సాధారణ దుస్తులు వేసుకొని రావాలి. వైద్య పరీక్షలకు హాజరయ్యే నాటికి అభ్యర్థులకు పాస్‌పోర్ట్ ఉండాలి.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం
ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్ పేరిట రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఇచ్చారు. డీడీ వివరాలను ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియలో పొందుపరచాలి. ఒరిజినల్ డీడీనీ గ్రూప్ డిస్కషన్ సమయంలో సమర్పించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది:
నవంబర్ 11
వెబ్‌సైట్: www.airindiaexpress.in