ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు
ఇండియన్ నేవీ.. పైలట్/నాయిక్ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ల ప్రవేశం కోసం నిర్వహించే కోర్సుకు అవివాహిత మహిళలు, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కోర్సు జూన్, 2017 నుంచి ఇండియన్ నేవల్ అకాడమీ - ఎజిమల(కేరళ)లో ప్రారంభమవుతుంది. ఇంజనీరింగ్‌గ్రాడ్యుయేట్స్‌కు ఇది చక్కటి అవకాశం. ప్రారంభంలో సబ్ లెఫ్టినెంట్‌గా చేరినవారికి అన్ని కలుపుకుని నెలకు రూ.87,600 నుంచి రూ.90,000 వరకు చెల్లిస్తారు.
పైలట్ అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. ఇంతకుముందు పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ)లో ఉత్తీర్ణులు కానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.వయోపరిమితి: 19 - 24 ఏళ్లు. అభ్యర్థులు జూలై 2, 1993 - జూలై 1, 1998 మధ్య జన్మించి ఉండాలి. కమర్షియల్ పైలట్ లెసైన్స్ (సీపీఎల్) ఉన్నవారికి 19-25 ఏళ్లు. వీరు జూలై 2, 1992 - జూలై 1, 1998 మధ్య జన్మించాలి.పైలట్ శారీరక ప్రమాణాలు: అభ్యర్థులు ఎత్తు కనీసం 162.5 సెం.మీ ఉండాలి. దీంతోపాటు తగిన బరువును కలిగి ఉండాలి.
ఠి నాయిక్ అర్హత: 60 శాతం మార్కులతో మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ ప్రొడక్షన్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ఐటీ/కెమికల్ మెట్లర్జీ/ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ఈ స్పెషలైజేషన్లలో బీటెక్ ఫైనలియర్ చదివే విద్యార్థులూ అర్హులే.వయోపరిమితి: 19 1/2 - 25 ఏళ్లు. జూలై 2, 1992 - జనవరి 1, 1998 మధ్య జన్మించి ఉండాలి.నాయిక్ శారీరక ప్రమాణాలు: పురుషులు కనీసం 157 సెం.మీ, మహిళలు కనీసం 152 సెం.మీ ఉండాలి. దీంతోపాటు వయసు, ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల ఆధారంగా సర్వీస్ సెలెక్షన్ బోర్డ్
(ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ స్టేజ్-1, స్టేజ్-2 అనే రెండు దశలుగా ఉంటుంది. ఇవి.. డిసెంబర్, 2016 నుంచి మార్చి,
2017 వరకు ఉంటాయి.
స్టేజ్-1: దీన్ని ఒక రోజు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి.
స్టేజ్-2: ఇందులో భాగంగా నాలుగు రోజులు సైకలాజికల్ టెస్టులు, గ్రూప్ టాస్క్ టెస్టులు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించినవారిని వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. వైద్య పరీక్షలు మూడు నుంచి ఐదు రోజులపాటు ఉంటాయి. పైలట్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ)తోపాటు ఏవియేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. పైలట్ పరీక్షలు, ఇంటర్వ్యూ బెంగళూరులో, నాయిక్ ఇంటర్వ్యూలు బెంగళూరు/భోపాల్/కోయంబత్తూరు/విశాఖపట్నంలో ఉంటాయి.
అన్నింటిని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. పైలట్, నాయిక్‌గా మొత్తం 14 ఏళ్లపాటు విధులు నిర్వర్తించొచ్చు. అంతకుమించి పొడిగించరు.పైలట్ ఎంట్రీ: ఎంపికైనవారు 22 వారాలపాటు నేవల్ ఓరియెంటేషన్ కోర్సు (ఎన్‌వోసీ), తర్వాత స్టేజ్-1, స్టేజ్-2 ప్లైయింగ్ ట్రైనింగ్‌లను పూర్తిచేసుకోవాలి. వీటిని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి వింగ్స్ అవార్డు ఇస్తారు.నాయిక్ ఎంట్రీ: వీరికి కూడా వివిధ నేవల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్/యూనిట్స్/షిప్స్‌లో, ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ అందిస్తారు.
వేతన శ్రేణి, పదోన్నతులు: మొదట సబ్ లెఫ్టినెంట్ (పేస్కేల్: రూ.15,600 - రూ.39,100, గ్రేడ్ పే రూ.5400) హోదాతో ఉద్యోగంలో చేరినవారు తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి లెఫ్టినెంట్ (పేస్కేల్: రూ.15,600 - రూ.39,100, గ్రేడ్ పే రూ. 6100), లెఫ్టినెంట్ కమాండర్ (పేస్కేల్: రూ.15,600-రూ.39,100, గ్రేడ్ పే రూ.6600), కమాండర్ (పే స్కేల్: రూ.37400- రూ. 67,000, గ్రేడ్ పే రూ.8000) స్థాయి వరకు చేరుకుంటారు.
నిబంధనలకు మేరకు ఇతర అలవెన్సులు (ఫ్లైయింగ్, ఇన్‌స్ట్రక్షనల్, యూనిఫామ్, హౌస్ రెంట్, హార్డ్ ఏరియా, ట్రాన్స్‌పోర్ట్, డైవింగ్ తదితర) ఉంటాయి. కుటుంబానికంతటికీ ఉచిత వైద్య సదుపాయం, క్యాంటీన్, రేషన్, మెస్/క్లబ్/స్పోర్ట్స్ సౌకర్యాలు, ఫర్నీచర్‌తో కూడిన ప్రభుత్వ నివాస గృహం, త క్కువ వడ్డీకి కారు/హౌసింగ్ లోన్ ఇస్తారు. రైలు ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం తగ్గింపు ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబంతో కలిసి ఉచితంగా కూడా ప్రయాణించొచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత రెండు ప్రింటవుట్స్ తీసుకోవాలి. ఒక దరఖాస్తు ప్రింటవుట్‌కు సంబంధిత విద్యార్హతలు (పదో తరగతి, ఇంటర్మీడియెట్, బీటెక్/బీఈ), మార్కుల లిస్ట్స్, ఇతర సర్టిఫికెట్లను కలిపి ‘పోస్ట్ బాక్స్ నెంబర్ 02, సరోజిని నగర్ పీవో, న్యూఢిల్లీ - 110023’కి సాధారణ పోస్టులో పంపాలి. ఎన్వలర్ కవర్ పైన ‘ఆన్‌లైన్ అప్లికేషన్ నెంబర్...... అప్లికేషన్ ఫర్ పైలట్/నాయిక్ జూన్ 2017 కోర్స్ క్వాలిఫికేషన్...... పర్సంటేజ్.........%’ రాయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2016
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in