తెలంగాణ హిస్టరీ
శాతవాహన వంశ స్థాపకుడు?
- శ్రీముఖ శాతకర్ణి
మౌర్య సామ్రాజ్య పతనానంతరం, శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారు అని తెలిపినవారు? - వి.ఎ. స్మిత్
శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం? - మత్స్య పురాణం
శాతవాహనులు - ఆంధ్రులు ఒక్కరే అన్నవారు?
- ఆర్.జి.భండార్కర్, వి.ఎ. స్మిత్, రాప్సన్
శాతవాహనుల జన్మస్థలం మహారాష్ర్ట అని పేర్కొన్నవారు? - పి.టి. శ్రీనివాస అయ్యంగార్
శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించినవారు? - వి.వి.మిరాశి
శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని పేర్కొన్నవారు? -సూక్తాంకర్
శాతవాహనుల తొలి రాజధాని? - కోటిలింగాల
ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పూనా సమీపంలో లభించాయి? -మొదటి శాతకర్ణి
నానాఘాట్ శాసన కర్త? - నాగానిక
సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు? - రెండో శాతకర్ణి
రెండో శాతకర్ణి.. శుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొనే గ్రంథం?
- గార్గి సంహిత
తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించిన శాతవాహన రాజు? - మొదటి పులోమావి
ఏ రాజు కాలంలో గౌతమీ బాలశ్రీ.. నాసిక్ శాసనం వేయించింది? - వాశీష్టపుత్ర పులోమావి
నహపాణుడి పునర్ముద్రిత నాణేలు ఎక్కడ లభించాయి? - జోగల్తంబి
ఆంధ్ర రాజులు సుశర్మను చంపి మగధను ఆక్రమించినట్లు పేర్కొనే పురాణం? - మత్స్య పురాణం
కామర్థకవంశ చష్టానుడు.. వాశీష్ఠపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత?
- టాలమీ
రాజు పేరు ముందు తల్లి నామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైంది?
- గౌతమీపుత్ర శాతకర్ణి
శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం?
- జైన మతం
‘కవి వత్సల’ అనే బిరుదున్న రాజు? - హాలుడు
శాతవాహన వంశంలో అతి గొప్ప రాజు?
- గౌతమీపుత్ర శాతకర్ణి
శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు? - ఆహారము
భారత్‌లో తొలిసారిగా బ్రాహ్మణులకు భూ దానాలు ప్రారంభించిన రాజ వంశం?
- శాతవాహనులు
నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం? - భట్టిప్రోలు
శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉన్నాయని తెలిపే గ్రంథం?
- గాథాసప్తశతి
అమరావతి స్థూపాన్ని విస్తృతపరిచి, మహాచైత్య వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి? - యజ్ఞశ్రీ శాతకర్ణి
శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు? - భూమి శిస్తు
శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే?
- వృత్తి సంఘాలు
శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం?
- గుంటుపల్లి
శాతవాహనుల రాజ భాష? - ప్రాకృతం
సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు? - కుంతల శాతకర్ణి
నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు? - మొదటి శాతకర్ణి
సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు? - శాతవాహనుడు
శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే? - సామంత రాజ్యాలు
శాతవాహనుల శాసనాలు అన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి?
- ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో
శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన కుంద కుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు? - జైనం
నాసిక్, కన్హేరి గుహలను బౌద్ధ మతస్తులకు దానం చేసిన శాతవాహన రాజు? - కృష్ణుడు
కార్లే గుహలను మహాసాంఘిక బౌద్ధశాఖకు దానం చేసిన రాజు? - రెండో పులోమావి
అజంతా గుహల్లోని 9, 10 గుహలు ఏ యుగానికి చెందినవి? - శాతవాహనులు
గాథాసప్తశతిని పోలిన గ్రంథం ‘వజ్జలగ్గ’ను రచించింది? - జయవల్లభ
శాతవాహనుల కాలంలో రాతిలో తొలిచిన చైత్యం ఎక్కడ ఉంది? - గుంటుపల్లి
శ్రీ పర్వతం వద్ద శైల మండపాలు నిర్మించిన రాజు? - యజ్ఞశ్రీ శాతకర్ణి
శాతవాహనుల కాలంలో బౌద్ధ స్థూపాలను వేటితో నిర్మించారు? - ఇటుకలు
ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం? - ఘంటసాల
శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు? - స్థారవాహులు
శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్ దేశ నాణేలు ఏ ప్రాంతంలో లభించాయి? - కొండాపూర్
బృహత్కథను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు? - పైశాచీ భాష
శాతవాహనుల కాలంలో ఒక సువర్ణ (బంగారు) నాణేనికి ఎన్ని కార్షపణాలు (వెండి)?
- 1:35 (ఒక బంగారు నాణేనికి 35 కార్షపణాలు)
శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు? - 12 శాతం
శాతవాహనుల కాలంలో వృత్తి పన్ను?
- కారుకర
ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించింది? - మొదటి కృష్ణుడు
ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు? - సుహృల్లేఖ, ఆరోగ్య మంజరి, ప్రజ్ఞా పారమిత, మాధ్యమిక కారిక
బౌద్ధ మతస్తుల కోసం నాగానిక తొలిపించిన గుహలు? - నానాఘాట్
‘బెణకటకస్వామి’ అని బిరుదు గల శాతవాహన రాజు? - గౌతమీపుత్ర శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు?
- శకారి, ఆగమనిలయ, క్షహరాట వంశ నిషేశకర, త్రిసముద్రతోయ పీతవాహన
క్రీ.శ. 78లో శాలివాహన శకాన్ని ప్రారంభించింది? - గౌతమీపుత్ర శాతకర్ణి
గ్రూప్- 2 ప్రత్యేకం
శాసనాల ప్రకారం ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు?
- వాశీష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు
ఏ రాజును ఓడించి ఇక్ష్వాకులు విజయపురిలో అధికారాన్ని స్థాపించారు?
- మూడో పులోమావి
ఇక్ష్వాకులు స్థానికులు అని వాదించిన చరిత్రకారుడు? - కాల్డ్వెల్
ఇక్ష్వాకులు కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్రకు వలస వచ్చారని పేర్కొన్నవారు? - వోగేల్
శ్రీశాంతమూలుడు ఏ మతాన్ని ఆదరించాడు? - వైదిక మతం
ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పేర్కొనే పురాణం? - విష్ణు పురాణం
రెంటాల, దాచేపల్లి, కెసానపల్లి శాసనాలు వేయించిన ఇక్ష్వాక par రాజు?ఙ- శ్రీశాంతమూలుడు
శతసహస్రహలక, మహాదానపతి బిరుదులు కలిగిన ఇక్ష్వాక par రాజు?ఙ- శ్రీశాంతమూలుడు
ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలైన శాసనాలు?
- నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి
వీరపురుష దత్తుడి కాలంలో మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభాన్ని ప్రతిష్టించింది ఎవరు? - అడవి శాంతిశ్రీ
నాగార్జునకొండ వద్ద చుళ్లదర్మగిరిపై చైత్యగృహాన్ని నిర్మించింది? - ఉపాసిక బోధిశ్రీ
మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఏ రాజు కాలంలో ప్రారంభమైంది? - వీరపురుష దత్తుడు
ఏ రాజు కాలాన్ని ఆంధ్రలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు?
వీరపురుషదత్తుడు
అశ్వమేథయాగం చేసిన ఇక్ష్వాక రాజు?
- శ్రీశాంతమూలుడు
ఇక్ష్వాకుల రాజభాష? - ప్రాకృతంఙఞ్చటరాజు.. శివలింగాన్ని కాలితో తొక్కుతూ, బౌద్ధులకు అభయం ఇస్తున్న శిల్పం ఏ ప్రాంతంలో లభించింది?
- నాగార్జునకొండ
ఇక్ష్వాకుల రాజ చిహ్నం? - సింహం
భారతదేశంలో తొలి వైదిక (హిందూ) దేవాలయాలు నిర్మించిన రాజులు?
- ఇక్ష్వాకులు
ఏ ఇక్ష్వాక రాజు కాలంలో శ్రీ పర్వతం మహాయాన మతానికి పుణ్యక్షేత్రంగా
వర్ధిల్లింది? - వీరపురుషదత్తుడు
దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన రాజు?
- ఎహుబల శాంతమూలుడు
ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి?
- వ్యవసాయం
హారతి అంటే?
- చిన్న పిల్లలను రక్షించే దేవత
వీరగల్ అంటే? - యుద్ధంలో మరణించిన వీరుల స్మారక చిహ్నాలు
ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తి పన్నుల గురించి వివరిస్తున్న శాసనం?
- విషవట్టి శాసనం
ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ వర్తక శ్రేణులు? - పర్నిక శ్రేణి, పుసిన శ్రేణి
మొదటిసారిగా ఆయా నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది? - ఇక్ష్వాకులు
విష్ణుకుండినులు
విష్ణుకుండిన వంశ స్థాపకుడు?
- ఇంద్ర వర్మ
ప్రముఖ చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి ప్రకారం విష్ణుకుండినుల రాజధాని?
- ఇంద్రపాల నగరం
ప్రముఖ చరిత్రకారుడు పి.వి.కృష్ణశాస్త్రి ప్రకారం విష్ణుకుండినుల రాజధాని? - కీసర
పి.వి.పరబహ్మ్రశాస్త్రి ప్రకారం స్వతంత్ర విష్ణుకుండిన రాజ్య స్థాపకుడు?
- మొదటి గోవింద వర్మ
విష్ణుకుండినుల రాజ లాంఛనం? - సింహం
చైతన్యపురి వద్ద విహారాన్ని నిర్మించిన విష్ణుకుండిన రాజు? - గోవింద వర్మ
విష్ణుకుండినుల రాజభాష? - సంస్కృతం
విష్ణుకుండినుల ఆరాధ్య దైవం?
- శ్రీపర్వత స్వామి
రెండో మాధవవర్మ కాలంలో అమరావతి స్థూపం.. అమరేశ్వరాలయంగా మారిందని పేర్కొన్న చైనా యాత్రికుడు?
- హ్యుయాన్‌త్సాంగ్
మాధవవర్మకు ‘త్రివర నగర భువన యువతి ప్రియ’ అనే బిరుదు ఉన్నట్లు తెలిపే శాసనం?
- పొలమూరు శాసనం
జనాశ్రయ అనే బిరుదు కలిగిన విష్ణుకుండిన రాజు? - మాధవ వర్మ-3
కుమారుడికి మరణశిక్ష విధించిన విష్ణుకుండిన రాజు? - మూడో మాధవ వర్మ
ఘటికలు అంటే?
- బ్రాహ్మణ విద్యాకేంద్రాలు
తెలంగాణలో లభిస్తున్న తొలి ప్రాకృత శాసనం? - చైతన్యపురి శాసనం
తెలంగాణలో తొలి లక్షణ గ్రంథం?
- జనాశ్రయచ్ఛందోవిచ్ఛిత్తి
న్యాయపాలన ప్రస్తావన ఉన్న విష్ణుకుండినుల శాసనం? - పొలమూరు
గుల్మిక అంటే?
- సరిహద్దు రాష్ట్రాల సైనిక రాజ ప్రతినిధి
భారతదేశంలో మొదటి హిందూ గుహాలయాలు నిర్మించిన రాజవంశం?
- విష్ణుకుండినులు
విష్ణుకుండినులు ముద్రించిన నాణేలు?
- ఇనుప నాణేలు
ఉత్పత్తి పిడుగు అంటే? - శిల్పుల శ్రేణి
ఉండవల్లి గుహల్లో ఉన్న ఏ విగ్రహాన్ని పడుకుని ఉన్న అనంత పద్మనాభస్వామి విగ్రహంగా మార్చారు?
- నిల్చున్న బుద్ధుడి విగ్రహం
విష్ణుకుండినుల నాణేలపైముద్రించిన ముద్రలు? - సింహం, శంఖువు
కొప్పు నరేష్
సబ్జెక్టు నిపుణులు