
గ్రూప్-2 పేపర్-3 గ్రాండ్ టెస్ట్
మార్కులు: 150 సమయం: 2గం॥30 ని॥
మార్కులు: 150 సమయం: 2గం॥30 ని॥
1. మన దేశంలో జాతీయాదాయాన్ని మొదట శాస్త్రీయంగా లెక్కించినవారు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) వి.కె.ఆర్.వి. రావు
3) మహలనోబిస్
4) షిర్రాస్
2. 2014-15లో స్థిర ధరల్లో (2011-12) జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా ఎంత?
1) 16.7 శాతం 2) 17.6 శాతం
3) 18.7 శాతం 4) 19.6 శాతం
3. ఏ కాలంలో భారత్‌లో తలసరి ఆదాయం వృద్ధి ఎక్కువగా ఉంది?
1) 1960-61 నుంచి 1970-71
2) 1970-71 నుంచి 1980-81
3) 1990-91 నుంచి 2000-01
4) 2004-05 నుంచి 2010-11
4. 2014-15లో ప్రస్తుత ధరల్లో నికర జాతీయాదాయం ఎంత?
1) రూ.112,17,079 కోట్లు
2) రూ.113,37,085 కోట్లు
3) రూ.114,18,079 కోట్లు
4) రూ.116,17,011 కోట్లు
5. వాస్తవ జాతీయాదాయంగా దేన్ని పరిగణిస్తారు?
1) స్థూల జాతీయోత్పత్తి
2) ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం
3) నికర జాతీయోత్పత్తి
4) నికర దేశీయోత్పత్తి
6. ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’తో సంబంధం ఉన్న వ్యక్తి?
1) రాజా చెల్లయ్య 2) కాల్డార్
3) గౌతమ్ మాథూర్
4) ప్రొ. రాజ్‌కృష్ణ
7. ఎవరి జన్మదినాన్ని మన దేశ జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటున్నాం?
1) మహలనోబిస్ 2) వి.కె.ఆర్.వి. రావు
3) దాదాభాయ్ నౌరోజీ
4) సి. రంగరాజన్
8. కింది వాటిలో కార్‌లమార్‌క్సతో సంబంధం ఉన్నవి?
ఎ) మిగులు విలువ బి) శ్రమ దోపిడి
సి) ఆర్గానిక్ కాంపోజిషన్ ఆఫ్ కాపిటల్ సి) నవ కల్పనలు
1) ఎ, బి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
9. విస్తరణ ప్రభావాల (ఞట్ఛ్చఛీ ఉజజ్ఛఛ్టిట)ను తెలియజేసిన ఆర్థిక వేత్త?
1) గున్నార్ మిర్థాల్ 2) షుంపీటర్
3) హరడ్-డోమర్ 4) రాగ్నార్ నర్‌క్స
10. ఏ కోవకు చెందిన దేశాలను రెండో ప్రపంచ దేశాలుగా పేర్కొంటారు?
1) సామ్యవాద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు
2) పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు
3) అంతర్జాతీయంగా రుణాల ఊబిలో ఉన్న దేశాలు
4) రాజరిక వ్యవస్థలున్న దేశాలు
11. 2013-14లో స్థూల దేశీయ పొదుపులో ప్రభుత్వ రంగ వాటా?
1) జీడీపీలో 2% 2) జీడీపీలో 2.5%
3) జీడీపీలో 1.5% 4) జీడీపీలో 1%
12. మూలధనాన్ని, ఎంపిక చేసిన రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలనేది ఏ రకమైన వృద్ధి వ్యూహం?
1) శ్రమ సాంద్రత వ్యూహం
2) సంతులిత వృద్ధి వ్యూహం
3) అసంతులిత వృద్ధి వ్యూహం
4) మూలధన సాంద్రత వృద్ధి వ్యూహం
13. కింది వాటిలో భిన్నమైంది?
1) భారతీయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంక్
2) సహకార బ్యాంకులు
3) వ్యవసాయ పరోక్ష సహాయ సంస్థ 4) నాబార్‌డ
14. {పస్తుతం మన దేశానికి అధికంగా గ్రాంట్ ఇస్తున్న దేశం?
1) జపాన్ 2) జర్మనీ
3) ఇంగ్లండ్ 4) అమెరికా
15. ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?
1) సురేష్ టెండూల్కర్ 2) ఎన్.సి. సక్సేనా
3) రంగరాజన్ 4) కేల్కర్
16. పట్టణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు నూతన ప్రాతిపదిక రూపొందించడానికి ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది?
1) రంగరాజన్ 2) ఎస్.ఆర్. హసీమ్
3) కేల్కర్ 4) వై.వి. రెడ్డి
17. మన దేశంలో అంత్యోదయ అన్నయోజన కార్యక్రమం ప్రతిపాదనకు ఏ భావన మూలం?
1) ఆర్థిక అసమానతలను తొలగించడం 2) అతిపేదవారిని ఆదుకోవడం
3) భూపంపిణీలో అసమానతలను తొలగించడం
4) ఆర్థిక శక్తి కేంద్రీకరణను తగ్గించడం
18. 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా?
1) 12% 2) 22%
3) 32% 4) 42%
19. మన దేశంలో సహకార ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం?
1) 1900 2) 1902
3) 1904 4) 1906
20. 2011 లెక్కల ప్రకారం భారత్‌లో ఆయుఃప్రమాణం ఎంత?
1) 64.1 సం॥ 2) 65.1 సం॥
3) 66.1 సం॥ 4) 67.1 సం॥
21. 1956 (రెండో) పారిశ్రామిక విధాన తీర్మానంలో ‘బి’ జాబితాలో ఉన్న పరిశ్రమలు ఎన్ని?
1) 15 2) 16
3) 17 4) 12
22. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది?
1) వినోదం పన్ను 2) ఆదాయపు పన్ను
3) సంపద పన్ను 4) ఎస్టేట్ సుంకం
23. మన దేశంలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లను నియంత్రించే సంస్థ?
1) రిజర్‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) సెబీ
3) ఆర్థిక మంత్రిత్వ శాఖ
4) నీతి ఆయోగ్
24. ‘ప్లాన్‌డ ఎకానమీ ఫర్ ఇండియా’ అనే గ్రంథం రాసినవారు?
1) మహలనోబిస్
2) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
3) జాన్ మతాయ్
4) దాదాభాయ్ నౌరోజీ
25. సూక్ష్మవిత్తం ప్రాతిపదిక ఏది?
1) పేదవారితో బ్యాంకింగ్
2) రుణ వ్యయం తగ్గించడం
3) రుణాన్ని సమర్థంగా వసూలు చేయడం
4) పైవన్నీ
26. 1970లో ‘ఆపరేషన్ ఫ్లడ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏది?
1) నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్‌డ 2) నీటిపారుదల మంత్రిత్వ శాఖ
3) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
4) ప్లానింగ్ కమిషన్
27. ‘భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఒక అభివృద్ధి కారకం’ అన్నదెవరు?
1) ఆడం స్మిత్ 2) ఎడ్విన్ కెనాన్
3) మార్షల్ 4) టి.ఆర్. మాల్థస్
28. సరైన జత కానిది?
1) పసుపు విప్లవం - పసుపు
2) నీలి విప్లవం - చేపలు
3) శ్వేత విప్లవం - పాలు
4) సిల్వర్ విప్లవం - గుడ్లు
29. 2016-17లో భారత ఆర్థిక వృద్ధి రేటును ఆర్‌బీఐ ఎంతగా అంచనా వేసింది?
1) 7.1% 2) 7.2%
3) 7.6% 4) 7.8%
30. శ్వేత విప్లవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
1) స్వామినాథన్ 2) నార్మన్ బోర్లాగ్
3) వర్గీస్ కురియన్ 4) హరిహరన్
31. ఏ ప్రణాళికను ‘ప్లాన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రాన్‌సపోర్‌ట’ అంటారు?
1) 1వ 2) 2వ
3) 3వ 4) 4వ
32. కింది వాటిని జతపర్చండి?
పెరంబూర్ జీజీ) సింద్రీ
విశాఖపట్నం జీఠి) బొకారో
హిందుస్థాన్ షిప్ యార్‌డ
ఇనుము - ఉక్కు కర్మాగారం
రైలుపెట్టెల కర్మాగారం
ఎరువుల కర్మాగారం
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
33. కింది వాటిలో ఆర్థికాభివృద్ధిలో భాగం కాని అంశం?
1) సంకుచిత, పరిమాణాత్మక భావన 2) అభివృద్ధికి తోడ్పడే నిర్మాణాత్మక మార్పులు
3) మార్పులతో కూడిన వృద్ధి
4) సంస్థాగత, సాంకేతిక మార్పులు
34. కింది వాటిని జతపర్చండి?
రెండో ప్రణాళిక నాలుగో ప్రణాళిక
ఆరో ప్రణాళిక పదో ప్రణాళిక
a 2002-07 b1980-85
c 1969-74 d 1956-61
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
35. హరిత విప్లవంతో సంబంధం లేనిది?
1) పనికి ఆహార పథకం
2) మెక్సికో గోధుమలు
3) మేలు రకమైన వంగడాలు
4) నార్మన్ బోర్లాగ్
36. కింది వాటిలో ఒక దేశంలో మూలధన కల్పనకు సంబంధించి మూడు దశలేవి?
ఎ) వాస్తవిక స్వదేశీ పొదుపు కల్పన
బి) పొదుపు సమీకరణ
సి) సమీకరించిన పొదుపును ఉత్పాదక
పెట్టుబడిగా మార్చడం
డి) సాంకేతిక పరిజ్ఞానం
1) ఎ, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి
37. దేశంలో నల్లధనం వల్ల కలిగే దుష్ఫలితాలు?
ఎ) అధిక ద్రవ్యోల్బణం
బి) ఆర్థిక అసమానతలు తగ్గడం
సి) ఆర్థిక స్థోమత కేంద్రీకరణ
డి) అనుత్పాదక వ్యయం పెరగడం
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి
38. కింది వాటిని జతపర్చండి?
జీ) రూర్కెలా జీజీ) భిలాయ్
జీజీజీ) దుర్గాపూర్ జీఠి) బొకారో
పశ్చిమబెంగాల్ జార్ఖండ్
ఒడిశా ఛత్తీస్‌గఢ్
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-c, ii-d, iii-a, iv-b
3) i-d, ii-c, iii-b, iv-a
4) i-a, ii-b, iii-c, iv-d
39. ‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి రెండు కాదు.. 40 కోట్లు’ అని 1950లో జనాభాను ఉద్దేశించి అన్నవారు?
1) జయప్రకాశ్ నారాయణ్
2) గుల్జారీలాల్ నందా
3) బాబూ రాజేంద్రప్రసాద్
4) జవహర్‌లాల్ నెహ్రూ
40. రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు?
1) మౌంట్‌బాటన్
2) కారన్‌వాలీస్
3) విలియం బెంటిక్
4) థామస్ మన్రో
41. కింది వాటిలో సరైనవి?
ఎ) 2వ ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. బి) 5వ ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు తక్కువ కేటాయింపులు చేశారు.
సి) 9వ ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు అధిక కేటాయింపులు చేశారు.
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి 4) బి, సి
42. కింది వాటిలో చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి సరైనవి?
ఎ) రుణాలు అందించడం కోసం
ఎస్‌ఐడీబీఐని ఏర్పర్చారు
బి) పరపతి పర్యవేక్షణకు 1991లో నాయక్
కమిటీని నియమించారు
సి) పెట్టుబడుల పర్యవేక్షణకు అబిద్
హుస్సేన్ కమిటీ సూచించింది
1) ఎ, సి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, బి
43. కింది వాటిలో సరైనవి?
ఎ) మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి
అధిక కేటాయింపులు చేశారు.
బి) రెండో ప్రణాళికలో రవాణా, సమాచార రంగాలకు అధిక కేటాయింపులు చేశారు.
సి) ఐదో ప్రణాళికలో పరిశ్రమలకు అధిక కేటాయింపులు చేశారు.
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) బి, సి
44. కింది వాటిలో సరికానిది?
ఎ) 3వ ప్రణాళికలో ప్రాధాన్య అంశం స్వావలంబన, స్వయం సమృద్ధి
బి) 4వ ప్రణాళికలో ప్రాధాన్య అంశం పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన
సి) 11వ ప్రణాళికలో ప్రాధాన్య అంశం సమ్మిళిత, వేగవంతమైన ఆర్థికాభివృద్ధి
1) ఎ, బి 2) సి
3) బి 4) సి, డి
45. కింది వాటిలో 8వ ప్రణాళికతో సంబంధం లేని అంశాలు?
ఎ) ఈ ప్రణాళికలో ప్రైవేట్ పెట్టుబడులు ప్రభుత్వం కంటే పెరిగాయి.
బి) దీన్ని ఆదేశాత్మక ప్రణాళికగా రూపొందించారు.
సి) ఈ ప్రణాళికలో విదేశీ మారక నిల్వలు పెంచడానికి కృషి చేశారు.
డి) ఈ ప్రణాళికలో రూపాయి మూల్య హీనీకరణ చేశారు.
1) ఎ, బి, సి 2) బి, డి
3) ఎ, డి 4) డి
46. 6వ ప్రణాళికకు సంబంధించిన అంశాలు?
ఎ) ప్రణాళికకు ప్రభుత్వ అంచనా వ్యయం రూ.97,500 కోట్లు
బి) ప్రణాళిక వాస్తవిక వ్యయం రూ.1,09,292 కోట్లు
సి) ప్రణాళిక ప్రైవేట్ రంగ వ్యయం రూ.74,710 కోట్లు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి 4) సి
47. 9వ ప్రణాళికకు సంబంధించిన అంశాలు?
ఎ) సాంఘిక న్యాయంతో కూడిన సత్వర అభివృద్ధి
బి) ఈ ప్రణాళిక ప్రైవేట్ పెట్టుబడులను పెంచింది
సి) ఈ ప్రణాళిక కాలంలో ప్రైవేట్ బీమా సంస్థల స్థాపనకు అవకాశం ఇచ్చారు
డి) ఈ ప్రణాళికలో, ముందటి ప్రణాళికల కంటే తలసరి ఆదాయం పెరిగింది
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) పైవన్నీ
48. 11వ ప్రణాళికతో సంబంధం లేని అంశం?
ఎ) ఈ ప్రణాళిక ప్రారంభంలో వృద్ధిరేటు లక్ష్యం 9%
బి) ఈ ప్రణాళిక సమీక్షించదగిన ప్రత్యేక లక్ష్యాలు 27
సి) ఈ ప్రణాళిక, శక్తికి అధిక కేటాయింపులు చేసింది
డి) ఈ ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు
1) ఎ, బి 2) బి
3) సి 4) బి
49. కింది వాటిలో 3వ ప్రణాళికతో సంబంధం లేని అంశాలు?
ఎ) రైతుల కోసం ఏఆర్‌డీసీని ఏర్పర్చారు
బి) వ్యవసాయ అభివృద్ధికి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
సి) రూపాయి మూల్యహీనీకరణ చేశారు
డి) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు
1) ఎ 2) సి
3) సి, డి 4) బి
50. దేశంలో ఎన్ని ప్రణాళికల వరకు ట్రికిల్ డౌన్ సిద్ధాంతాన్ని అనుసరించారు?
1) 1, 2 ప్రణాళికలు
2) 1, 2, 3 ప్రణాళికలు
3) 1, 2, 3, 4 ప్రణాళికలు
4) 1, 2, 3, 4, 5 ప్రణాళికలు
51. జతపర్చండి?
{పాజెక్ట్
జీ) జూరాల - పాకాల
జీజీ) దేవాదుల
జీజీజీ) ఎల్లంపల్లి జీఠి) శ్రీరాంసాగర్
లబ్ధిపొందే జిల్లాలు
నల్లగొండ, వరంగల్, ఖమ్మం
నల్లగొండ, వరంగల్
కరీంనగర్, ఆదిలాబాద్
ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-a, ii-c, iii-b, iv-d
3) i-a, ii-c, iii-d, iv-b
4) i-a, ii-d, iii-b, iv-c
52. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
ఎ) 1 నుంచి 2 ఎకరాల భూ కమతాన్ని చిన్న కమతంగా పరిగణిస్తారు
బి) 4 నుంచి 10 ఎకరాల భూ కమతాన్ని మధ్యతరహా కమతంగా పరిగణిస్తారు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
53. జతపర్చండి?
కడెం దిగువ మానేరు
నక్కలగండి నిజాంసాగర్
ఆదిలాబాద్ ఛ) కరీంనగర్
నల్లగొండ నిజామాబాద్
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-a, ii-c, iii-b, iv-d
3) i-a, ii-c, iii-d, iv-b
4) i-a, ii-d, iii-b, iv-c
54. సరైన దాన్ని గుర్తించండి?
ఎ) చెరువులు అత్యధికంగా ఉన్న జిల్లా వరంగల్ కాగా, అత్యల్పంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్
బి) కాలువల ద్వారా అత్యధికంగా నల్లగొండ జిల్లా లబ్ధి పొందుతుండగా, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా లబ్ధి పొందుతోంది.
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
55. ఖీగిఅఔఖీఅ అంటే?
1) తెలంగాణ వెదర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్
2) తెలంగాణ వెల్త్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్
3) తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ టెంపరేచర్ యాక్ట్
4) తెలంగాణ వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్
56. కింది వాటిలో సరి కానివి?
ఎ) ప్రస్తుతం దేశంలో, తెలంగాణ రాష్ర్టంలో అత్యధికంగా గ్రామీణ పరపతిని అందించేవి వాణిజ్య బ్యాంకులు
బి) దేశంలో గ్రామీణ పరపతిని అందించడంలో ఆర్‌ఆర్‌బీలు చివరి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ర్టం రెండో స్థానంలో ఉంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీ కాదు
57. కింది వాటిలో మల్చింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు?
ఎ) నేల కోతను అరికడుతుంది
బి) నీటి సంరక్షణకు తోడ్పడుతుంది
సి) మెట్ట వ్యవసాయ ప్రాంతంలో ప్రయోజనం అధికంగా ఉంటుంది
డి) ప్రవాహ నీటిలో ఒండ్రు మట్టిని, మురికిని తగ్గిస్తుంది
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, డి, సి 4) బి, సి
58. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై లక్షిత ప్రజానీకానికి అవగాహన కల్పించడం కోసం 2015లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం?
1) మన తెలంగాణ - మన వ్యవసాయం
2) మన వ్యవసాయం - మన తెలంగాణ
3) మన తెలంగాణ - మన రైతు
4) మన ఊరు - మన వ్యవసాయం
59. 2014-15లో ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ర్ట తలసరి ఆదాయం?
1) రూ.1,27,112 2) రూ.1,31,185
3) రూ.1,29,182 4) రూ.1,35,140
60. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పన్నుల్లో మన రాష్ట్రానికి లభించిన వాటా?
1) 1.44% 2) 2.44%
3) 2.95% 4) 3.25%
61. జతపర్చండి?
జీ) పాయిగా జమియత్ జీజీ) జాత్
జీజీజీ) మశ్రుతి జీఠి) ఆల్తమ్గా
్చ) బేషరత్ భూములు
ఛ) అశ్విక దళాల పోషణార్థం ఇచ్చే భూములు
ఛి) వంశపారంపర్య భూములు
ఛీ) మత, సైనిక, పౌర సంబంధ సేవలకు గుర్తింపుగా ఇచ్చే భూములు
1) i-b, ii-a, iii-d, iv-c
2) i-b, ii-c, iii-a, iv-d
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-b, ii-a, iii-d, iv-c
62. నిజాం సొంత ఖర్చుల కోసం ఉద్దేశించిన భూములను ఏమని పిలిచేవారు?
1) ఖల్సా భూములు 2) మథర్ మాష్
3) ఆల్తమ్గా 4) సర్‌ఫ-ఎ-ఖాస్
63. భూదాన ఉద్యమానికి సంబంధించి సరైనవి?
ఎ) భూదాన ఉద్యమాన్ని వినోబా భావే ప్రారంభించారు.
బి) భూదాన ఉద్యమం నల్లగొండ జిల్లా పోచంపల్లిలో ప్రారంభమైంది
సి) భూదాన ఉద్యమం, కమతాల గరిష్ట పరిమితిని నిర్ణయించింది
డి) భూదాన ఉద్యమం 1952లో ప్రారంభమైంది
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
64. భూ సంస్కరణల తాత్విక నేపథ్యం రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో కన్పిస్తుంది?
1) ఆర్టికల్ 39 2) ఆర్టికల్ 39 (బి)
3) ఆర్టికల్ 39 (సి) 4) ఆర్టికల్ 39 (ఎ)
65. కింది వాటిలో సరైనవి?
ఎ) నిజాం తన ముద్ర ద్వారా ఇచ్చే జాగీరు భూములను ఆల్తమ్గాగా పేర్కొనేవారు
బి) నిజాం ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేసే భూములను దివాని భూములు అనేవారు
సి) ఏ హక్కులు లేని కౌలుదారులను షక్మీదార్ అనేవారు
డి) చట్టపరమైన హక్కులు కలిగి భూమిని సేద్యం చేసే వారిని పట్టాదార్ అనేవారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
66. హైదరాబాద్ రాష్ర్టంలో భూ సంస్కరణల్లో భాగంగా మొదట ఏ రకమైన భూములను రైత్వారీ భూములుగా ప్రకటించారు?
1) ఖల్సా దివాని 2) సర్‌ఫ-ఎ-ఖాస్
3) జమీందారీ 4) జాగీర్దారీ
67. కృష్ణా నదిలో లభ్యమయ్యే నికర జలాలను ఎన్ని టీఎంసీలుగా బచావత్ ట్రిబ్యునల్ నిర్ధారించింది?
1) 1900 టీఎంసీలు 2) 1960 టీఎంసీలు
3) 2060 టీఎంసీలు 4) 2100 టీఎంసీలు
68. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ర్ట జనాభాకు సంబంధించి సరికానిది?
1) ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నారు.
2) రాష్ర్ట జనాభా 3,50,03,674
3) పట్టణ జనాభా 28.88%
4) భారతదేశంలోని పెద్ద రాష్ట్రాల్లో 12వ స్థానం
69. కింది వాటిలో సరైంది?
ఎ) జమీందారీ పద్ధతిని లార్‌డ కారన్ వాలీస్ ప్రవేశపెట్టారు
బి) మహల్వారీ విధానంలో రైతు ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లిస్తాడు
సి) రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో ప్రవేశపెట్టారు
డి) రైత్వారీ పద్ధతిలో, రైతు ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లిస్తాడు
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
70. కింది వాటిలో సరైంది?
ఎ) 2015-16 అంచనాల ప్రకారం 2011-12 స్థిర ధరల్లో తెలంగాణ రాష్ర్ట వృద్ధి రేటు 9.24%
బి) తెలంగాణ రాష్ర్ట స్థూల సమకూరిన విలువ ప్రాథమిక రంగ వాటా 17%
సి) తెలంగాణ రాష్ర్టంలో గ్రామీణ జనాభా 61.12%
డి) తెలంగాణ రాష్ర్టంలో పట్టణ జనాభా 18.88%
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, సి, డి
71. మన రాష్ర్టంలో అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న జిల్లా?
1) మహబూబ్‌నగర్ 2) నిజామాబాద్ 3) కరీంనగర్ 4) ఆదిలాబాద్
72. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానది నికర, మిగులు జలాల కేటాయింపులో సరైంది?
1) మహారాష్ర్ట 585 టీఎంసీలు
2) కర్ణాటక 734 టీఎంసీలు
3) ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు
4) పైవన్నీ
73. కుమార్ లలిత్ కమిటీ ప్రకారం తెలంగాణ ప్రాంత రెవెన్యూ మిగులు?
1) 53.93 కోట్లు 2) 63.93 కోట్లు 3) 73.93 కోట్లు 4) 83.93 కోట్లు
74. టి-ప్రైడ్ పథకం దేనికోసం ఉద్దేశించింది?
1) ఐటీ కంపెనీలను ప్రోత్సహించడం
2) విదేశీ కంపెనీలను ప్రోత్సహించడం 3) యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం
4) ఎస్సీ, ఎస్టీ వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం
75. టి-ఐడియా పథకానికి సంబంధించి సరికానిది?
1) భూమి కొనుగోలు లేదా లీజులపై 100% స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు
2) భూమి ఖరీదులో 25% రాయితీ (రూ.10 లక్షలకు పరిమితి)
3) విద్యుత్ ఖర్చుల్లో 5 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.1 చొప్పున రాయితీ
4) ఉత్పత్తులను 100% ప్రభుత్వం కొనుగోలు చేయడం
76. జెనోమ్ వ్యాలీ ప్రాజెక్ట్ సముదాయం దేని అభివృద్ధికి సంబంధించింది?
1) బయోటెక్నాలజీ
2) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
3) పారిశ్రామికోత్పత్తి
4) కమ్యూనికేషన్
77. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ స్థాపన వ్యయం ఎంతగా అంచనా వేశారు? 1) 10,200 కోట్లు 2) 13,064 కోట్లు 3) 13,700 కోట్లు 4) 14,600 కోట్లు
78. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఏ జిల్లాలో ఎక్కువ?
1) ఖమ్మం 2) కరీంనగర్ 3) ఆదిలాబాద్ 4) వరంగల్
79. గోదావరి పుష్కరాలు 2015లో ఎప్పుడు జరిగాయి?
1) జూలై 14 నుంచి 25 వరకు
2) జూలై 16 నుంచి 27 వరకు
3) జూలై 18 నుంచి 29 వరకు
4) జూలై 20 నుంచి 31 వరకు
80. తెలంగాణలో అతి తక్కువ షెడ్యూల్డ్ బ్యాంకులున్న జిల్లా?
1) నిజామాబాద్ 2) ఖమ్మం
3) ఆదిలాబాద్ 4) మెదక్
81. 2011-12లో మానవాభివృద్ధి సూచికలో భారతదేశంలో తెలంగాణ స్థానం?
1) 10 2) 11 3) 12 4) 13
82. 2015-16లో మానవాభివృద్ధి సూచికలో తెలంగాణ రాష్ర్టంలో మొదటి స్థానంలో నిలిచిన జిల్లా?
1) హైదరాబాద్ 2) రంగారెడ్డి 3) వరంగల్ 4) నిజామాబాద్
83. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి సరైంది?
ఎ) ఈ పథకాన్ని 2014, అక్టోబర్ 2న ప్రారంభించారు
బి) అర్హులైన అవివాహిత యువతులకు రూ.51,000 సహాయం అందిస్తారు.
సి) ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి తల్లిదండ్రుల ఆదాయ పరిమితి రూ.4 లక్షలు
డి) ఈ పథకాన్ని బీసీ అవివాహిత యువతులకు 2016 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేశారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
84. ఆసరా పింఛన్ పథకానికి సంబంధించి నిజం కానిది?
ఎ) దీన్ని షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూర్ గ్రామంలో ప్రారంభించారు
బి) 2014 నవంబర్ 8న ప్రారంభించారు
సి) ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.4,700 కోట్లు ఖర్చు చేస్తుంది
డి) ఈ పథకాన్ని మొదటగా హరీశ్‌రావు ప్రారంభించారు
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, డి 4) బి, సి, డి
85. కింది అంశాల్లో సరైంది?
ఎ) తెలంగాణకు సంబంధించి మొదటి రైలు మార్గం సికింద్రాబాద్ - వాడి
బి) సికింద్రాబాద్ - విజయవాడకు రైలు మార్గం 1886లో ఏర్పాటు చేశారు
సి) నిజాం స్టేట్ రైల్వేస్‌ను 1952లో దేశ రైల్వేలో విలీనం చేశారు
డి) తెలంగాణకు సంబంధించి మొట్టమొదటి విద్యుత్ రైలు మార్గం - 1962
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) బి, సి
86. టీఎస్‌టీడీసీ వల్ల ఏవి అభివృద్ధి చెందాయి?
ఎ) రవాణా బి) ఆహారోత్పత్తులు
సి) సమాచారం డి) హస్తకళలు
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) సి, డి 4) ఎ, బి
87. తెలంగాణ ప్రభుత్వం శిల్పారామం లాంటి హస్తకళల ప్రదేశాలను ఏ జిల్లాల్లో విస్తరించాలని భావిస్తోంది?
1) మెదక్ - నల్లగొండ
2) మెదక్ - రంగారెడ్డి
3) మెదక్ - వరంగల్
4) మెదక్ - ఖమ్మం
88. కింది ఏ జిల్లాల ఆదాయంలో సగానికంటే ఎక్కువ వాటా సేవా రంగం నుంచి లభిస్తోంది?
ఎ) హైదరాబాద్ బి) రంగారెడ్డి
సి) వరంగల్ డి) నిజామాబాద్
1) ఎ, బి, 2) ఎ, బి, సి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
89. తెలంగాణ సేవా రంగ ఉప రంగాల్లో అధిక వాటా కలిగిన రెండో ఉప రంగం?
1) రియల్ ఎస్టేట్, బిజినెస్
2) ప్రజా పరిపాలన, రక్షణ రంగం
3) బ్యాంకింగ్, బీమా రంగం
4) వర్తకం, హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం
90. దేశంలో పి.పి.పి. పద్ధతిలో నిర్మించిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు?
1) శంషాబాద్ 2) కొచ్చిన్
3) ముంబై 4) చెన్నై
91. వరంగల్ - మమ్నూరు ఎయిర్‌పోర్‌టకు సంబంధించి సరైంది?
ఎ) దీన్ని 1875 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు
బి) దీని రన్‌వే 6.6 కి.మీ.
సి) 1981లో దీని సేవలు రద్దయ్యాయి
డి) అప్పట్లో ఈ విమానాశ్రయం దేశంలో అతిపెద్దది
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
92. 2014-15 అంచనాల ప్రకారం తెలంగాణలో రహదారులకు సంబంధించి సరి కానిది?
1) జాతీయ రహదారులు - 2592 కి.మీ. 2) రాష్ర్ట రహదారులు - 3152 కి.మీ
3) జాతీయ రహదారులు 2 లైన్‌స పొడవు-964 కి.మీ.
4) పంచాయతీరాజ్ రోడ్ల పొడవు - 64,046 కి.మీ
93. 2014లో విదేశీ పర్యాటకులు అసలు సందర్శించని జిల్లాలు?
ఎ) నల్లగొండ బి) మెదక్
సి) కరీంనగర్ డి) ఖమ్మం
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) సి, డి 4) బి, సి, డి
94. కింది వాటిలో సరికానిది (పి.పి.పి. రోడ్ల నిర్మాణం పరంగా)?
1) హైదరాబాద్ - బీజాపూర్ - 36.4 కి.మీ.
2) సూర్యాపేట - జనగాం - 84.4 కి.మీ
3) మహబూబ్‌నగర్ - నల్లగొండ - 163.2 కి.మీ
4) జనగాం - చేర్యాల - దుద్దెడ - 48.4 కి.మీ