ఒక రాజ్యం లక్షణం గాని, స్వభావం గాని, అది పౌరులకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుంది అని పేర్కొన్నవారు ఎవరు?
-హెచ్.జె. లాస్కీ
హక్కు అనగా.. -కలిగి ఉండుట
పపంచంలో అతిపెద్ద హక్కుల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? -క్రీ.శ. 1215
అతిపెద్ద హక్కుల ఒప్పందాన్ని ఏమని పిలుస్తారు? - మాగ్నాకార్టా
{పపంచంలో మొదటిసారిగా బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో లిఖితపూర్వకంగా హక్కుల్ని రాజ్యాంగంలో పొందుపర్చుకున్న దేశం ఏది?
- అమెరికా
భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో మొదటిసారిగా భారతీయులకు హక్కులు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వ్యక్తి?
- బాలగంగాధర తిలక్
బాలగంగాధర తిలక్ స్వరాజ్య బిల్లుని ఏ సంవత్సరంలో పొందుపరిచారు?
- 1895
1921 నాటి ఐరిష్ ఫ్రీ స్టేట్ రాజ్యాంగంలో పేర్కొన్న హక్కులు భారతీయులకు కూడా అవసరమని, వాటిని అమలు చేయాలని కోరుతూ ‘కామన్‌వెల్త్ ఆఫ్ బిల్ ఆఫ్ రైట్స్’ను ఎవరు ప్రతిపాదించారు? - అనిబిసెంట్
భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడ జరిగిన సమావేశంలో భారతీయులు రూపొందించుకోబోయే రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులే ముఖ్యమైన ప్రాతిపదిక కావాలని ప్రకటించింది? -మద్రాసు సమావేశం (1927)
1928లో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక రాజ్యాంగ కమిటీ భారతీయులకు ఎన్ని రకాల హక్కులు కావాలని సూచించింది? - 19 రకాలు
భారత జాతీయ కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది?
- కరాచీ సమావేశం (1931)
అల్పసంఖ్యాక వర్గాలకు తగిన రక్షణ, హామీలను చట్టబద్ధంగా కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలని ఎవరు పేర్కొన్నారు?
- తేజ్ బహదూర్ సప్రు
ప్రాథమిక హక్కుల ఉప సంఘానికి చైర్మన్ ఎవరు? - జె.బి. కృపలానీ
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? -అమెరికా
ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు? -3వ భాగం
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని రకాల ప్రాథమిక హక్కులను పొందుపరిచారు? - 7
ప్రాథమిక హక్కుల గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనల్లో పొందుపరిచారు?
- 12-35 నిబంధనలు
ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులున్నాయి? - 6
ప్రాథమిక హక్కుల నుంచితొలగించిన హక్కు ఏది? - ఆస్తి హక్కు
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు?
- 1978లో 44వ రాజ్యాంగ సవరణ
ప్రస్తుతం ఆస్తిహక్కు రాజ్యాంగంలో ఏ నిబంధనలో పొందుపరిచారు? ఏ హక్కుగా కొనసాగుతోంది? - 300 ఏ, చట్టబద్ధ హక్కుగా
సమానత్వపు హక్కు గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనల్లో పొందుపరిచారు?
-14 నుంచి 18 వరకు
చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే అంశం గురించి రాజ్యాంగంలో ఏ నిబంధన పేర్కొంటుంది? - 14వ నిబంధన
చట్టం అందరికీ సమాన రక్షణ కల్పించాలని రాజ్యాంగంలో 14వ నిబంధన పేర్కొంటుంది. రక్షణ అనే పదం ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? -అమెరికా
రాజ్యాంగంలోని 14వ నిబంధన పరిధిలోకి రాని వారు?
- రాష్ర్టపతి, గవర్నర్ తదితరులు
ప్రాథమిక హక్కులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
- 2 రకాలు అవి 1. సహకారాత్మక హక్కులు
2. నకారాత్మక హక్కులు
రూల్ ఆఫ్ లా ఆధారంగా ఏ నిబంధనను పొందుపరిచారు. -14వ నిబంధన
రాజ్యాంగంలో ప్రజల మధ్య 5 రకాల వివక్షలు పాటించరాదని ఏ అధికరణ పేర్కొంటుంది?
-15వ అధికరణ
5 రకాల వివక్షలు అనగా?
- కులం, మతం, జాతి, లింగ, ప్రాంతం
మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించవచ్చని రాజ్యాంగంలో ఏ అధికరణ పేర్కొంటుంది?
- 15(3)
రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంటుంది? -16వ నిబంధన
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి సరైన ప్రాతినిధ్యం లేకపోతే రిజర్వేషన్లు కల్పించవచ్చని రాజ్యాంగంలో ఏ నిబంధన పేర్కొంటుంది? - 16(4) నిబంధన
అస్పృశ్యత మహాపాపం అని ఇది హిందూ సమాజాన్ని తినే విషక్రిమి వంటిది అని తెలిపిన వ్యక్తి ఎవరు? - మహాత్మాగాంధీ
రాజ్యాంగంలో 17వ నిబంధన దేని గురించి వివరిస్తుంది? - అస్పృశ్యత నివారణ
అస్పృశ్యత నివారణ చట్టాన్ని పార్లమెంటు ఏ సంవత్సరంలో రూపొందించింది?
- 1955
అస్పృశ్యత అనే పదం ఉపయోగించడం వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయని ఆ పదం ఉపయోగించరాదని ఏ కోర్టు వ్యాఖ్యానించింది?
- మైసూరు హైకోర్టు(కర్ణాటక హైకోర్టు), 1974లో
అస్పృశ్యత నివారణ చట్టాన్ని పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా ఏ సంవత్సరంలో మార్చారు?
-1976
గౌరవ బిరుదులు స్వీకరించరాదని, బిరుదులు ప్రజల మధ్య సాంఘిక వ్యత్యాసాలకు కారణం అవుతాయని ఏ నిబంధన పేర్కొంటుంది?
-18వ నిబంధన
ఏ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ బిరుదులను ప్రవేశపెట్టింది?
-1954
బిరుదులు రాజ్యాంగ విరుద్ధమని 1977లో ఏ రాష్ర్ట హైకోర్టు తీర్పు చెప్పింది?
- మధ్యప్రదేశ్ హైకోర్టు
భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ తదితర బిరుదులు కావని కేవలం ‘పురస్కారాలు’ అని వాటిని భారతీయులకు 18వ నిబంధన ప్రకారం ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
- బాలాజీ రాఘవన్ గట యూనియన్ ఆఫ్ ఇండియా 1996.
మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఎవరు? - మొరార్జీ దేశాయ్
ఉఆఇ వర్గాల వారికి ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని ఏ కమిటీ సిఫారసు చేసింది? - జస్టిస్ జీవన్‌రెడ్డి కమిటీ
ఇందిరా సహాని గట యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ైఆఇలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 27% రిజర్వేషన్లు కల్పించడం, సమంజసమేనని తీర్పును ప్రకటించిన నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
- జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య
స్వేచ్ఛా-స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనల్లో పొందుపరిచారు? - 19 నుంచి 22 వరకు
స్వాతంత్య్ర హక్కు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఎవరు పేర్కొన్నారు?
- జస్టిస్ సిక్రీ
ప్రస్తుతం రాజ్యాంగంలో 19వ నిబంధన ఎన్ని రకాల స్వేచ్ఛా, స్వాతంత్య్రాల గురించి తెలియజేస్తుంది?
- 6 రకాలు అవి..
1. 19 1 (అ) వాక్ స్వాతంత్య్రం-భావ ప్రకటనా స్వేచ్ఛ
2. 19 1 (ఆ) ఆయుధాలు లేకుండా సభలు, సమావేశాల ఏర్పాటు స్వేచ్ఛ
3. 19 1 (ఇ) సంఘాలు - సంస్థలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
4. 19 1 (ఈ) దేశంలో ఎక్కడైనా పర్యటించే స్వేచ్ఛ
5. 19 1 (ఉ) దే శంలో ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం ఏర్పాటు స్వేచ్ఛ
6. 19 1 (ఎ) ఇష్టమైన వృత్తి, వ్యాపారాలు చేపట్టే స్వేచ్ఛ
19 1 (ఊ)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
పత్రికా స్వాతంత్య్రం రాజ్యాంగంలో ఏ నిబంధనలో అంతర్భాగంగా ఉంది?
- 19 1(అ)లో వాక్ స్వాతంత్య్రం - భావ ప్రకటనా స్వేచ్ఛ
జాతీయ జెండాను ఎగురవేయడం భావప్రకటన స్వాతంత్య్రంలో అంతర్భాగమే అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
- నవీన్ జిందాల్ కేసు
ఏ కేసులో బంద్‌లు రాజ్యాంగ విరుద్ధం అని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది?
- భరత్ కుమార్ కేసులో
భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వం ఏయే రంగాల్లో బిరుదులు ఇవ్వవచ్చు?
-విద్యా, వైజ్ఞానిక సంబంధ బిరుదులు
రాజ్యాంగంలో ఏ నిబంధన.. నేరం నుంచి రక్షణ పొందే అవకాశం కల్పిస్తుంది?
- 20వ నిబంధన
ఒక వ్యక్తిని ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు శిక్ష విధించరాదు. దీన్ని న్యాయ పరిభాషలో ఏమంటారు?
- డబుల్ జియోపార్డీ
20(3) నిబంధన ప్రకారం ఒక వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు. దీన్ని న్యాయ పరిభాషలో ఏమంటారు? -సెల్ఫ్ ఇంక్రిమిషన్
రాజ్యాంగంలో జీవించే హక్కు లేదా ప్రాణ రక్షణ హక్కు గురించి ఏ నిబంధన వివరిస్తుంది? - 21వ నిబంధన
రాజ్యాంగంలో 21ఏ అనే నిబంధనను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు?
- 86వ రాజ్యాంగ సవరణ 2002లో
ప్రాథమిక హక్కుల్లో 6-14 ఏళ్ల లోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును అందించాలని ఏ నిబంధన పేర్కొంటుంది? - 21ఏ నిబంధన
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ‘నూతన విద్యా విధానం’ ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? -1986
ఏ కమిటీ సూచన మేరకు విద్యను రాష్ర్ట జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి చేర్చారు? - స్వరణ్ సింగ్ కమిటీ
రాజ్యాంగంలోని ఏ నిబంధన వ్యక్తిని నిర్బంధం నుంచిరక్షణ పొందే అవకాశం కల్పిస్తుంది?
- 22వ నిబంధన
నిరోధక నిర్బంధం అంటే ఏమిటి?
- ఒక వ్యక్తి నేరం చేయకపోయినప్పటికి నేరం చేస్తాడేమో అనే అనుమానంతో ముందుగానే నిర్బంధంలోకి తీసుకోవడం
దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వ్యక్తి స్వేచ్ఛ కంటే గొప్పవి అని పేర్కొంటూ నిర్బంధ నిరోధక చట్టాన్ని సమర్థించినవారు?
- బి.ఆర్.అంబేద్కర్
పనిటివ్ చట్టాలు అంటే ఏమిటి?
- ముద్దాయి నేరం నిరూపితమై న్యాయస్థానం విధించిన శిక్షలను అమలు చేయడం కోసం నిర్బంధిస్తారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనవసరమైన చట్టాలను రద్దు చేసి అవసరమైన చట్టాలను రూపొందించడం కోసం నియమించిన కమిటీ? - రామానుజన్ కమిటీ
పీడనాన్ని నిరోధించే హక్కు గురించి రాజ్యాంగంలో ఏ నిబంధనలు వివరిస్తున్నాయి?
-23, 24 నిబంధనలు
వెట్టిచాకిరి, వేశ్యా వృత్తి, బానిసత్వాలను రాజ్యాంగం ఏ నిబంధనల ప్రకారం నిషేధించింది? - 23వ నిబంధన
రాజ్యం ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రజలతో నిర్బంధంగా పనిచేయించడం ఏ నిబంధనకు వ్యతిరేకం కాదు? - 23వ నిబంధన
వెట్టిచాకిరి నిర్మూలన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించింది?
-1976
బాల కార్మిక వ్యవస్థ నిషేధం, 14 ఏళ్ల లోపు పిల్లలను కర్మాగారాల్లో పనిచేయించరాదని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
- 24వ నిబంధన
బాల కార్మిక నిషేధ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రూపొందించింది? - 1986
ఏ నిబంధన భారతదేశంలో చట్టాల రూపాలు, న్యాయ సమీక్ష గురించి తెలియజేస్తుంది?
- 13వ నిబంధన
రాజ్యాంగం 12వ నిబంధన ప్రకారం రాజ్యం అంటే?
- కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట, స్థానిక ఫ్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు రాజ్యం పరిధిలోకి వస్తాయి.
మత స్వాతంత్య్ర హక్కు గురించి రాజ్యాంగం ఏ నిబంధనల్లో పొందుపరిచారు?
- 25-28 వరకు
భారతదేశం లౌకిక రాజ్యం అని అనడానికి అవకాశం కల్పించే ప్రాథమిక హక్కు ఏది?
- మత స్వాతంత్య్ర హక్కు
భారతదేశ పౌరులకే కాకుండా విదేశీయులకు కూడా వర్తించే హక్కు?
- మత స్వాతంత్య్ర హక్కు
వ్యక్తి తన అంతరాత్మ ప్రబోధానుసారం ఏ మతాన్నైనా స్వీకరించి ప్రచారం చేసుకొనే స్వేచ్ఛను రాజ్యాంగంలోని ఏ నిబంధన కల్పిస్తుంది? - 25వ నిబంధన
మత అభివృద్ధి కోసం మతపరమైన సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించే రాజ్యాంగ నిబంధన? - 26వ నిబంధన
మత అభివృద్ధి కోసం మతపరమైన పన్నులు విధించరాదని ఏ రాజ్యాంగ నిబంధన తెలియజేస్తుంది?
-27వ నిబంధన
వి. కొండల్
ప్రభుత్వ కళాశాల
లెక్చరర్, నల్లగొండ