ఆర్థిక సాధికారత: సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు కలిగి ఉండాలి. అప్పుడే వారు ఆర్థికంగా పురుషులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. మానవ వనరుల సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కూడా కీలకమవుతుంది. లైంగిక వివక్షతో వృత్తులను నిరాకరించకూడదు.
విద్యా సాధికారత: విద్య ద్వారా విజ్ఞానం, విజ్ఞానం ద్వారా నైపుణ్యం, నైపుణ్యం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అందువల్ల స్త్రీలకు సమాన విద్యావకాశాలు ఉండాలి. చైతన్యవంతమైన మహిళ సమాజ, కుటుంబ స్థితిగతులనూ మార్చగలదు. ఇది సమాజాభివృద్ధికి అనివార్యం.
రాజకీయ సాధికారత: పరిపాలనలో, రాజకీయ అధికారంలో స్త్రీలకు సమాన అవకాశాలు ఉండాలి. తద్వారా రాజకీయ నిర్ణయీకరణ అంశాల్లో వారి పాత్రకు గుర్తింపు లభిస్తుంది. తద్వారా వారు తమ సమస్యలను ప్రస్ఫుటంగా వ్యక్తీకరించడానికి అవకాశం కలుగుతుంది. రాజకీయ సాధికారత లభిస్తే ఇతర సాధికారతలపైనా గణనీయ ప్రభావం ఉంటుంది.
చట్టపర సాధికారత: సమాజంలో ప్రభావవంతమైన, చట్టపరమైన నిర్మితి ఉండాలి. చట్టపరంగా ఎలాంటి వివక్షలూ ఉండకూడదు. చట్టంలో పేర్కొన్నదానికి వాస్తవంగా జరుగుతున్నదానికి మధ్య తేడా ఉండరాదు.
సాధికారత సాధన – రాజ్యాంగ, చట్టపర అంశాలు
ప్రకరణ 14 ప్రకారం.. చట్టం ముందు అందరూ సమానులే.
ప్రకరణ 15 ప్రకారం.. స్త్రీ, పురుష వివక్ష చూపరాదు.
ప్రకరణ 15(3) ప్రకారం.. మహిళలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలి.
ప్రకరణ 16 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో లింగ వివక్ష చూపరాదు.
ప్రకరణ 23 ప్రకారం.. స్త్రీలను అసభ్య, అశ్లీల, అవినీతి కార్యకలాపాలకు వినియోగించకూడదు.
lప్రకరణ 39(ఎ) ప్రకారం.. మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలి.
ప్రకరణ 39(డి) ప్రకారం.. స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
lప్రకరణ 42 ప్రకారం.. మహిళలకు ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి.
ప్రకరణ 47 ప్రకారం.. జీవన ప్రమాణాలు పెంచాలి. పౌష్టికాహారం అందించాలి. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలి
ప్రకరణ 51–ఎ(ఇ) ప్రకారం.. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతులను విడనాడాలి.
ప్రకరణ 243(డి) ప్రకారం.. పంచాయతీ సంస్థల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్వు చేయాలి.
lప్రకరణ 243(టి) ప్రకారం.. మునిసిపాలిటీల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలను రిజర్వు చేయాలి.
మహిళా హక్కులు, చట్ట రక్షణలు
మహిళలను పలు రకాల హింసల నుంచి రక్షించడానికి పార్లమెంట్ అనేక చట్టాలు రూపొందించింది. అవి..
సతీసహగమన నిషేధ చట్టం – 1829
వితంతు పునర్వివాహ చట్టం – 1856
బాల్య వివాహ నిరోధక చట్టం – 1952
హిందూ వివాహ చట్టం – 1955
హిందూ వారసత్వ చట్టం – 1956
అశ్లీల, అవినీతి వ్యాపార నిరోధక చట్టం – 1956
వరకట్న నిషేధ చట్టం – 1961
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ – 1971
మెటర్నిటీ రిలీఫ్ చట్టం – 1976
సమాన వేతన చట్టం – 1976
ల ప్రదర్శన నిషేధ చట్టం – 1986
మహిళా సాధికారత ఉద్యమాలు – 1990
జాతీయ మహిళా కమిషన్ చట్టం – 1991
గృహ హింస నిరోధక చట్టం – 2005
పని ప్రదేశాల్లో వేధింపులకు వ్యతిరేకంగా రక్షణ చట్టం – 2013
నిర్భయ చట్టం (క్రిమినల్ ప్రొసీజర్స్ సవరణ) – 2013
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు (108 రాజ్యాంగ సవరణ ప్రతిపాదిత బిల్లు)
మహిళా సాధికారత – పథకాలు
ఇందిరా మహిళా యోజన
దీన్ని 1975, ఆగస్టు 20న ప్రారంభించారు.
ఇది మహిళల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పథకం.
ఇందులో భాగంగా వివిధ పథకాల సమన్వయానికి సమగ్ర యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తారు.
సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీం– ఐసీడీఎస్)
1975, అక్టోబర్ 2 ప్రారంభించారు.
గర్భిణిలు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలు ఈ పథకం లబ్ధిదారులు.
గ్రామీణ ప్రాంత మహిళా, శిశు అభివృద్ధి పథకం (ఈగిఅఇఖఅ–ఈ్ఛఠ్ఛిlౌpఝ్ఛn్ట ౌజ గిౌఝ్ఛn ్చnఛీ ఇజిజీlఛీట్ఛn జీn ఖuట్చ∙అట్ఛ్చ)
1982 సెప్టెంబర్‌లో ప్రారంభించారు.
మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం
మహిళా సమృద్ధి యోజన(ఎంఎస్‌వై)–1993
గ్రామీణ మహిళల్లో పొదుపును పెంచి, ఆర్థిక భద్రతను కల్పించడం ద్వారా వారిని అభివృద్ధి పరిచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు.
రాష్ట్రీయ మహిళా కోష్–1993
1993లో పేద మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రారంభించారు.
బాలికా సమృద్ధి యోజన(బీఎస్‌వై)–1997
స్త్రీ, శిశు జననం పట్ల సమాజ దృక్పథంలో మార్పు తెచ్చేందుకు ప్రారంభించారు.
దీపం(1999, అక్టోబర్ 2)
గ్రామీణ ప్రాంత మహిళలు కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగను పీల్చి ఉబ్బసం, ఆస్తమా వ్యాధుల బారినపడకుండా వారికి గ్యాస్ సిలిండర్లు అందించడానికి, తద్వారా ఆయా వ్యాధుల నివారణకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది.
స్వశక్తి(1999 అక్టోబర్)
స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ రుణాలు అందజేస్తూ మహిళలకు సాధికారతను సాధించడం.
కిశోర శక్తి యోజన(1997, జనవరి 1)
బాలికల్లో బాల్య వివాహాలను అరికట్టి సామాజిక దృక్పథాల్లో మార్పు తేవడం, నూటికి నూరు శాతం బాలికలకు ప్రాథమిక విద్య అందేట్లు చేయడం ఈ పథకం ఉద్దేశం.
స్వధార్ (Sగిఅఈఏఅఖ) 2001–02
స్త్రీలకు ఆలోచన, క్రియాత్మక జీవన విధానం కల్పించడం.
పావలా వడ్డీ (2004–05)
స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలపై పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు.
జననీ సురక్ష యోజన(2005–06)
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో కాన్పులు జరిగేట్లు గర్భిణులను ప్రోత్సహించి ప్రసూతి, శిశుమరణాల రేటును తగ్గించడం .
మాతా ఆరోగ్య రక్షణ సేవలు (ఏఎస్‌హెచ్‌ఏ–ఆశ: అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్: 2005–06)
ఈ పథకంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లో 70,700 మంది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి; గ్రామీణ, పట్టణ గిరిజన ప్రాంతాల్లో నియమించి; స్త్రీ, శిశు ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించారు.
24/7 మహిళల హెల్ప్‌లైన్ (181)
రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి సమస్యల పరిష్కారానికి రోజుకు 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ డెస్క్
(181) ఏర్పాటుచేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
షీ టీమ్స్
మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ తొలిసారిగా హైదరాబాద్‌లో షీ టీమ్స్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన–2010
మాతాశిశు ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, నల్గొండ జిల్లాల్లో ప్రారంభించారు.
సబల(-2-0-11, (RGSEAG &-Rajiv Gandhi Scheme for Empowerment of Adolescent Girls)
11–18 ఏళ్ల బాలికలకు పౌష్టికాహార, ఆరోగ్య స్థాయిని మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం.
స్త్రీనిధి పథకం (2011, సెప్టెంబర్ 15)
బ్యాంకింగ్ రంగం నుంచి పేదలకు పరపతి లభించే రాయితీ వడ్డీ పథకం. దీనికి రూ.వేయి కోట్లు కేటాయించారు.
భారతీయ మహిళా బ్యాంక్–2013
దేశంలోని మహిళల ఆర్థికాభివృద్ధికి, అభ్యున్నతికి కేంద్రం ప్రత్యేకంగా మహిళా బ్యాంకులను స్థాపించింది. వీటి నిర్వహణను పూర్తిగా మహిళలకే అప్పగించి, హక్కులు ప్రకటించారు. దీని నినాదం మహిళా సాధికారతే భారతదేశ సాధికారత.
మహిళా సాధికారత
Published Wed, Mar 8 2017 3:49 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement
Advertisement