క్షిపణి విధ్వంసక నౌక మోర్ముగావో జలప్రవేశం
క్షిపణి విధ్వంసక నౌక మోర్ముగావో ప్రారంభం
భారత నౌకా దళానికి చెందిన అధునాతన క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక మోర్ముగావోను నేవీ ఛీప్ అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా సెప్టెంబర్ 17న ముంబైలో ప్రారంభించారు. దీన్ని ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) అభివృద్ధి చేసింది. మోర్ముగావో నుంచి ఉపరితలం నుంచి ఉపరిత లానికి, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను, జలాంతర్గామి విధ్వంసక రాకె ట్లను ప్రయోగించవచ్చు. ఇది 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్టంగా గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
గస్తీ నౌక రాణి గెయిడిన్‌లీ.. తీర గస్తీ దళానికి అప్పగింత
భారత తీర గస్తీ దళం కోసం విశాఖ షిప్‌యార్డ్ రూపొందించిన గస్తీ నౌక రాణి గెయిడిన్‌లీని సెప్టెంబర్ 14న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించారు. ఈ నౌక పొడవు 51.5 మీటర్లు, వెడల్పు 8.3 మీటర్లు.
స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను ప్రయోగించిన చైనా
అంతరిక్ష కేంద్రానికి అవసరమైన స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను చైనా సెప్టెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించింది. 2022 నాటికి మానవ సహిత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ల్యాబ్‌ను పంపింది. దీన్ని గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి ప్రయోగించారు.
అవార్డులు
ఆర్థిక స్వేచ్ఛలో భారత్‌కు 112వ స్థానం
ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించి భారత్ ప్రపంచంలో 112వ స్థానంలో నిలిచింది. ఎకనమిక్ ఫ్రీడం ఆఫ్ ది వరల్డ్-2016 వార్షిక నివేదిక.. 159 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో హాంకాంగ్ మొదటి స్థానంలో, సింగపూర్, న్యూజిలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
పప్పుల మద్దతు ధర పెంపునకు కమిటీ సిఫార్సు
దేశంలో పప్పుల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.1,000 చొప్పున పెంచాలని, ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సెప్టెంబర్ 16న నివేదికను సమర్పించిన కమిటీ.. దానిలో సాగు పెంపు, ధరల అదుపు దిశగా పలు సంస్కరణలను సూచించింది. యుద్ధ ప్రాతిపదిక న పప్పుల కొనుగోలుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని కోరింది.
ఆగస్టులో 3.74 శాతానికి డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఆగస్టు నెలలో 3.74 శాతానికి చేరుకుంది. ఇది జూలైలో 3.55 శాతంగా ఉంది. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న విడుదల చేసింది. జూలైలో 11.82 శాతంగా ఉన్న ఆహార ధరల సూచీ ఆగస్టులో 8.23 శాతంగా నమోదైంది.
సదస్సులు
బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం
ద క్షిణ గోవాలో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సమావేశం సెప్టెంబర్ 16న ముగిసింది. ఈ సమావేశంలో హరిత సంబంధిత అంశాలపై పరస్పర సహకారానికి సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పారిస్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు, సమావేశంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ (ఇండిపెండెంట్ చార్‌జ) మంత్రి అనిల్ దవే తెలిపారు.
వైజాగ్‌లో పట్టణీకరణపై బ్రిక్స్ సదస్సు
విశాఖపట్నంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు పట్టణీకరణపై బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పట్టణీకరణ ఆవశ్యతక, దాని వల్ల తలెత్తే సమస్యలపై ప్రధానంగా చర్చించారు. పట్టణీకరణ సమస్యలపై ప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి మంత్రులు, అధికారులు, ప్రతినిధులు హాజరయ్యారు.
కాలుష్య తగ్గింపుపై బ్రిక్స్- భారత్ ఒప్పందం
వాయు, జల కాలుష్య నియంత్రణకు సంబంధించి బ్రిక్స్ దేశాలతో కలిసి భారత్ అవగాహన పత్రంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల సమర్థ నిర్వ హణ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలున్నాయి.
వార్తల్లో వ్యక్తులు
యూపీఎస్‌సీ చైర్మన్‌గా అల్కా సిరోహి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నూతన ైచైర్మన్‌గా అల్కా సిరోహి సెప్టెంబర్ 18న నియమితులయ్యారు.
ఆర్‌సీఐ డెరైక్టర్‌గా నారాయణ మూర్తి: ప్రముఖ శాస్త్రవేత్త బీహెచ్‌వీఎస్ నారాయణమూర్తి సెప్టెంబర్ 14న డీఆర్‌డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
పౌర హక్కుల నేత బొజ్జా తారకం మృతి: పౌర హక్కుల నేత, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం (77) సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనపై దళితుల పక్షాన సుప్రీంకోర్టులో పోరాడి దోషులకు శిక్ష పడేలా చేశారు.
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు,
ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్