
సంక్షేమ రాజ్య నిర్మాణానికి తోడ్పడేవి?
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏ చట్టం ద్వారా కేటాయించారు? 1909 మింటోమార్లే సంస్కరణల చట్టం
ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏ చట్టం ద్వారా కేటాయించారు?
1909 మింటోమార్లే సంస్కరణల చట్టం
రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది?
26-11-1949
ఉమ్మడి జాబితాను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ఠ ఆస్ట్రేలియా
రాజ్యాంగ పీఠికలో 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా చేర్చిన పదాలు?
సామ్యవాద, లౌకిక, సమగ్రత
ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ సంస్థ తన విధిని నిర్వర్తించాలంటూ జారీచేసే ఆజ్ఞ ఏది? మాండమస్
సంక్షేమ రాజ్య నిర్మాణానికి తోడ్పడేవి ఏవి?
నిర్దేశక నియమాలు
‘మిషన్ కాకతీయ’ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి తోడ్పడిన అధికరణం? ఠి అధికరణం-48
ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న విధుల సంఖ్య? ఠి 11
రాష్ట్రపతి రాజీనామా లేఖను ఎవరికి పంపిస్తారు? ఠి ఉప రాష్ట్రపతికి
రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ఆర్టికల్? 356
ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఎన్నో ఉప రాష్ట్రపతి? 12వ
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్
భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి?
అటార్నీజనరల్
కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య?
లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకూడదు
మంత్రి మండలి సమష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్‌సభకు
లోక్‌సభ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఎన్ని స్థానాలు కేటాయించారు?
84, 47
పార్లమెంటు ఉమ్మడి సభ సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవ రు? స్పీకర్
సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఎవరికి ఉంటుంది?
రాజ్యసభ చైర్మన్
పార్లమెంటులో అతి ప్రాచీన కమిటీ ఏది?
ప్రభుత్వ ఖాతాల సంఘం
రాష్ట్రపతితో ఎంత మంది సభ్యులు రాజ్యసభకు ఎంపికవుతారు? ఠి 12
రాజ్యసభ ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు?
పీజే కురియన్
న్యాయ శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు?
రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం
న్యాయ సమీక్ష విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు? ఠి అమెరికా
భారత సుప్రీంకోర్టు స్థాపించినప్పుడు న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 5 ఏళ్లు
ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ పరమైన సమస్య ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు? 143
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను అవసరాన్ని బట్టి పెంచే అధికారం ఎవరికి ఉంది? ఠి పార్లమెంటు
న్యాయ సమీక్ష ద్వారా?
ప్రాథమిక హక్కులను కాపాడవచ్చు, రాజ్యాంగ ఆధిక్యతను పరిరక్షించవచ్చు, శాసన, కార్యనిర్వాహక శాఖల ఆధిపత్యాన్ని నియంత్రించవచ్చు
గవర్నర్ పదవీ కాలం ఎంత?
రాష్ర్టపతి విశ్వాసం ఉన్నంత వరకు
గవర్నర్‌గా నియమించేందుకు ఉండాల్సిన కనీస వయసు ఎంత? 35 ఏళ్లు
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి మహిళ ఎవరు? సుచేతా కృపలాని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు? కె.వి.రంగారెడ్డి
మోడల్ ప్రశ్నలు
1. సరైనది ఏది?
1) రాజ్యాంగ రచనా సంఘం-బి.ఆర్ అంబేద్కర్
2) ప్రాథమిక హక్కుల సంఘం
-సర్దార్ పటేల్
3) కేంద్ర వ్యవహారాల సంఘం-నెహ్రూ
4) పైవన్నీ
2. సరికానిది ఏది?
1) ప్రకరణ-17: అంటరానితనం నిషేధం
2) ప్రకరణ-24: బాలకార్మిక వ్యవస్థ నిషేధం
3) ప్రకరణ-25: మత స్వేచ్ఛ
4) ప్రకరణ-22: వెట్టి చాకిరి నిషేధం
3. కింది వారిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు?
1) రాష్ట్ర గవర్నర్లు
2) త్రివిధ దళాధిపతులు
3) ఎన్నికల కమిషనర్లు
4) భారతదేశంలో పనిచేసే విదేశీ
రాయబారులు
4. సరికానిది ఏది?
1) సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి -హెచ్.జె కానియా
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగు వ్యక్తి- కె.సుబ్బారావు
3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పని చేసిన వారు-నాగేంద్ర సింగ్
4) సుప్రీంకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-ఫాతిమా
సమాధానాలు: 1) 4 2) 4 3) 4 4) 4