
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1.2017, అక్టోబర్ 28న ఫిఫా అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్ పోటీని ఎక్కడ నిర్వహిస్తారు?
– కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో
2.2017, మార్చి 18న ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
త్రివేంద్ర సింగ్ రావత్
3.2017 జనవరిలో మారిషస్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
– ప్రవింద్ జగన్నాథ్
4. 2017, జనవరి 17న యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
– ఆంటోనియో టజానీ (ఇటలీ)
5. 2017, జనవరి 7న ఘనా అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
– నానా అకుఫో అడ్డో
6. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) చైర్మన్‌గా 2016 డిసెంబర్‌లో ఎవరు నియమితులయ్యారు?
– వి.కె.శర్మ
7. భారత్, రష్యా నౌకాదళాల సంయుక్త విన్యాసం పేరు?
– ఇంద్ర నేవీ
8. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)–2016 విజేత?
– సింగపూర్ స్లామర్స్
9. ఆంథోనీ లేక్ ఏ అంతర్జాతీయ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్?
– అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్)
10. పౌలో జెంటిలోని ఏ దేశానికి ప్రధానమంత్రి?
–ఇటలీ
11. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడిగా మూడోసారి ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?
– ప్రఫుల్ పటేల్
12. బిల్ ఇంగ్లిష్ ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు
స్వీకరించారు? – న్యూజిలాండ్
13. 2016, డిసెంబర్ 14న ఉజ్బెకిస్తాన్ రెండో అధ్యక్షుడిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు?
– షవ్‌కత్ మిర్జియోయేవ్
14. పాకిస్తాన్ ప్రస్తుత సైన్యాధిపతి ఎవరు?
– ఖమర్ జావేద్ బజ్వా
15. 2016 సంవత్సరానికి మూర్తీదేవి పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు?
– ఎం.పి.వీరేంద్రకుమార్
16. 2016 సంవత్సరానికి ప్రపంచ సంస్కృత అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
– జార్జి కార్డోనా (అమెరికా)
17. 2016, డిసెంబర్ 13న మరణించినlథామస్ షెల్లింగ్ ఏ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త?
– అమెరికా
18. ఇటీవల మరణించిన హాఫ్‌డన్ మాహ్లర్ 1973 నుంచి 1988 వరకు ఏ సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు?
– ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌వో)
19. 2016 సంవత్సరానికి ఐసీసీ మహిళా ఓడీఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది?
– సుడీ బేట్స్ (న్యూజిలాండ్)
20. 2016, డిసెంబర్ 31న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
– అనిల్ బైజాల్
21. 2017, జనవరి 25న పద్మశ్రీ పురస్కారాలను ఎంతమందికి ప్రకటించారు?
– 75
22. 2017 సంవత్సరానికి మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం పొందిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి?
– సుందర్‌లాల్ పట్వా
23. 2017 జనవరిలో నలంద విశ్వవిద్యాలయం నూతన ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు?
– విజయ్ భట్కర్
24. భారత విదేశాంగ కార్యదర్శిగా మరో ఏడాదిపాటు ఎవరు కొనసాగనున్నారు?
– ఎస్. జైశంకర్
25. 2017 జనవరిలో చెన్నై ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
– రాబర్టో బతిస్తా అగత్ (స్పెయిన్)
26. చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతలు?
– రోహన్ బొపన్న, జీవన్ నెడుంచెజియన్
27. 2017 జనవరిలో బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ మహిళల డబుల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
– సానియా మీర్జా (భారత్), బెథాని మాటెక్ శాండ్స్ (అమెరికా)
28. 2016 డిసెంబర్‌లో బెయిటన్ కప్ హాకీ టోర్నమెంటును గెలుచుకున్న జట్టు?
– ఇండియన్ ఆయిల్
29. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన బ్రాడ్‌లే విగ్గిన్స్ ఏ క్రీడలో ఐదు ఒలింపిక్ బంగారు పతకాలు సాధించాడు?
– సైక్లింగ్
30. ఇటీవల టెన్నిస్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించిన అనా ఇవనోవిచ్ ఏ దేశ క్రీడాకారిణి?
– సెర్బియా
31. తిరుపతిలో తొలిసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏ సంవత్సరంలో జరిగాయి?
– 1983
32. 2016, డిసెంబర్ 27న మరణించిన శ్రీలంక మాజీ ప్రధానమంత్రి ఎవరు?
– రత్నసిరి విక్రమనాయకే
33. థాయ్‌లాండ్ ప్రస్తుత రాజు ఎవరు?
– మహా వజ్రలాంగ్‌కార్న్
34. స్ట్రెయిట్స్ టైమ్స్ పత్రిక ‘2016 ఏషియన్ ఆఫ్ ది ఇయర్’గా ఎవరిని ఎంపిక చేసింది?
– ఫ్లిప్‌కార్ట్ సంస్థ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్
35. మెర్కోసర్ కూటమి 2016, డిసెంబర్ 1న ఏ దేశాన్ని బహిష్కరించింది?
– వెనెజువెలా
36. మెర్కోసర్ కూటమిలోని ప్రస్తుత నాలుగు సభ్యదేశాలేవి?
– అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే
37. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) 2016 సంవత్సరానికి ఉత్తమ పురుష అథ్లెట్‌గా ఎవరిని ప్రకటించింది?
– ఉసేన్ బోల్ట్ (జమైకా)
38. ఐఏఏఎఫ్ ఉత్తమ మహిళా అథ్లెట్ అల్మాజ్ అయనా ఏ దేశానికి చెందిన క్రీడాకారిణి?
– ఇథియోపియా
39. 2016 రియో ఒలింపిక్స్‌లో అల్మాజ్ అయనా ఏ క్రీడాంశంలో బంగారు పతకం సాధించింది?
– మహిళల 10,000 మీటర్ల పరుగు పందెంలో.
40. ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రి ఎవరు?
– బెర్నార్డ్ కజెనేవ్
41. 2016 సంవత్సరానికి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి విజేత ఎవరు?
– కెకాషన్ బసు
42. 2016 ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత?
–అట్లెటికో డి కోల్‌కతా
43. 2016 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 199 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగిన భారత బ్యాట్స్‌మన్?
– కె.ఎల్.రాహుల్
44. ప్రస్తుత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్ ఎవరు?
– రాజీవ్ జైన్
45. ఇటీవల భారత్‌లో పర్యటించిన తజకిస్తాన్ దేశాధ్యక్షుడు ఎవరు?
– ఎమోమలి రహమాన్
46. ‘మిస్ వరల్డ్ 2016’ విజేత?
– స్టెఫాని డెల్ వాలె (పోర్టోరికో)
47. ప్రియాంక చోప్రా ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటక ప్రచారకర్తగా ఎంపికయ్యారు?
– అసోం
48. భారత్ ఏ దేశంతో కలిసి సంయుక్తంగా ‘ఎకువెరిన్’ సైనిక విన్యాసం నిర్వహించింది?
– మాల్దీవులు
49. ‘లెజెండ్’ పురస్కారాన్ని పొందిన భారత మహిళా బాక్సర్?
– మేరీకోమ్
50. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ బ్యాట్స్‌మన్?
– కరుణ్ నాయర్
51. 2016 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
పాపినేని శివశంకర్‌కు ఏ పుస్తకానికి లభించింది?
– రజనీ గంధ
52. 2016 లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ విజేత?
– వెస్లీ సో (అమెరికా)
53. 2016 జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత?
– శంఖ ఘోష్
54. నాగళ్ల గురుప్రసాదరావుకు ఇటీవల ఏ అవార్డు లభించింది?
– భాషా సమ్మాన్ పురస్కారం
55. 2016 సంవత్సరానికి ‘బాలన్ డి ఓర్’ అవార్డు గెలుచుకున్న ఫుట్‌బాల్ క్రీడాకారుడు?
– క్రిస్టియానో రొనాల్డో