
యూఎస్ v/s ఆస్ట్రేలియా
స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల్లో అత్యధిక మంది లక్ష్యం.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)! దీని కోసం యూఎస్, ఆస్ట్రేలియా
ఎంబీఏకు ఏది బెస్ట్
స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల్లో అత్యధిక మంది లక్ష్యం.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)! దీని కోసం యూఎస్, ఆస్ట్రేలియా దిశగా అడుగులేస్తుంటారు. ఈ క్రమంలో కొంత సందిగ్ధత! ఎక్కడ చదివితే బాగుంటుంది? కోర్సు పూర్తై వెంటనే ఉద్యోగావకాశాల పరంగా ఏ దేశం బెస్ట్? ఇలా ఎన్నో సందేహాలు.. ఫాల్ సెషన్ ప్రవేశాలు నడుస్తున్న నేపథ్యంలో యూఎస్, ఆస్ట్రేలియాల్లో ఎంబీఏ కోర్సు విధివిధానాలపై ప్రత్యేక కథనం..
విదేశాల్లో చదువులకు..ఆర్థిక చిట్కాలు
అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని వివిధ యూనివర్సిటీల్లో చేరేందుకు ప్రస్తుతం స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులు ప్రయత్నిస్తున్నారు. విదేశీయానానికి, అక్కడ విద్యాభ్యాసానికి ఆర్థికంగా సంసిద్ధులవుతున్నారు. ఈ క్రమంలో విదేశాల్లో ఆర్థిక నిర్వహణ పరంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సలహాలు...
విదేశాలకు వెళ్లే విద్యార్థి పేరిట భారత్‌లో
బ్యాంకు ఖాతా ప్రారంభించాలి. కాలేజీ/ట్యూ
షన్ ఫీజులు భారీ మొత్తంలో ఉంటాయి.
వాటిని తల్లిదండ్రులు భారత్ నుంచి నేరుగా
ఆయా సంస్థలకు బదిలీ చేస్తారు. రోజువారీ
ఖర్చులకు డబ్బు మాత్రం విద్యార్థులే చేతి
నుంచి చెల్లించాల్సి ఉంటుంది. జీవన వ్యయం..
బడ్జెట్‌కు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
సంబంధిత దేశంలో బ్యాంకులో అకౌంట్‌కు, డెబిట్ కార్డు పొందడానికి రెండు మూడు వారాలు పడుతుంది. అప్పటివరకు ఖర్చుల కోసం కొంత నగదును, ఫారెక్స్ కార్డును తీసుకెళ్లాలి. స్థానిక ప్రయాణాలు, భోజనం, వసతి దొరికే వరకు నగదును ఉంచుకోవాలి. నెల రోజులకు సరిపడా డబ్బులు చేతిలో ఉంటే మంచిది.
క్యాంపస్ హాస్టల్లో చేరాలన్నా, ఆఫ్ క్యాంపస్ వసతి పొందాలన్నా ముందస్తు ప్రణాళిక అవసరం. ప్రీపెయిడ్ పేమెంట్ చేయాలి. అన్ని ఖర్చులకూ అవసరమైన డబ్బులో 25-33 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని చేతిలో ఉంచుకోవడం మంచిది కాదు. సాధ్యమైనంత త్వరగా బ్యాంక్ అకౌంట్ తెరిచి డిపాజిట్ చేయాలి.
విదేశాల్లో అడుగుపెట్టిన తర్వాత సంబంధిత యూనివర్సిటీలో రిపోర్ట్ చేయాలి. పెండింగ్ పేపర్ వర్క్ ఏమైనా ఉంటే పూర్తిచేయాలి. తర్వాత కోర్సు కోఆర్డినేటర్‌ను కలిసి.. బ్యాంక్ అకౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి.
పార్ట్‌టైమ్ జాబ్ చేయాలనుకుంటే నియమనిబంధనల గురించి తెలుసుకునేందుకు వర్సిటీ అధికారులను సంప్రదించాలి. స్టైఫండ్ కోసం ప్రొఫెసర్‌కు అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్‌గానో ఆన్ క్యాంపస్ వర్క్ చేయాలనుకుంటున్నట్లు ఉన్నతాధికారులకు మెయిల్స్ ద్వారా తెలియజేయొచ్చు. తద్వారా తాత్కాలిక నియామకాల్లో అవకాశాలు పొందొచ్చు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్య సంరక్షణ ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీపై జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సిటీ కల్పించే సాధారణ ఆరోగ్య బీమాతోపాటు ప్రత్యేక వైద్య చికిత్స కోసం అదనపు ప్యాకేజీలు తీసుకుంటే మంచిది.
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సు ఎంబీఏ. అందుకే బ్యాచిలర్ డిగ్రీ తర్వాత అధిక శాతం మంది ఈ కోర్సు వైపు మొగ్గుచూపుతారు. విదేశాల్లో చదవాలనుకునే వారిలో దాదాపు 40 శాతం మంది ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరికి టాప్ గమ్యాలుగా అమెరికా, ఆస్ట్రేలియా నిలుస్తున్నాయి. ఈ దేశాల్లోని విద్యా సంస్థలు అందించే సర్టిఫికెట్లకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. కంపెనీలు సైతం అమెరికా, ఆస్ట్రేలియా చదివిన ఎంబీఏ ఉత్తీర్ణులకు పెద్దపీట వేస్తున్నాయి. ఒకవేళ రెండు దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారైతే ఎటు వెళ్లాలి? అనే సందిగ్ధత ఉంటే విద్యా సంస్థ, కోర్సు తీరుతెన్నులను క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాలంటే 10+2+4 విధానంలో 16 ఏళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)లో కనీసం 700 స్కోర్ సాధించాలి. ఇవి ఉంటేనే ప్రవేశం లభించే అవకాశాలుంటాయి. కొన్ని ప్రముఖ యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్‌తోపాటు పని అనుభవం కూడా అడుగుతున్నాయి.
యూనివర్సిటీల్లో ఎంబీఏ కోర్సు దరఖాస్తుకు 10+2 తర్వాత మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ అర్హత సరిపోతుంది. అయితే యూనివర్సిటీలు ఔత్సాహికుల పని అనుభవంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. కనీసం 2-4 ఏళ్ల వర్‌క ఎక్స్‌పీరియన్‌స ఉన్న వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యమిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పరంగా విద్యార్థులకు కలిసొచ్చే అంశం.. జీమ్యాట్ స్కోర్ నిబంధన నుంచి మినహాయింపు. 70 శాతం యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు జీమ్యాట్ స్కోర్ లేకపోయినా అకడమిక్ రికార్డ్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు జీమ్యాట్ స్కోర్‌ను తప్పనిచేరి చేసినా, స్కోర్ 600-650 ఉంటే సరిపోతుంది.
అమెరికా: కోర్సు వ్యవధి కొంత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో దాదాపు రెండేళ్లు ఉంటోంది. కొన్ని యూనివర్సిటీలు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పేరుతో ఏడాది వ్యవధితో మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. అయితే అవి పూర్తిగా పని అనుభవం ఉన్నవారికే పరిమితమవుతున్నాయి.
ఆస్ట్రేలియా: అధిక శాతం యూనివర్సిటీల్లో ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో ఎంబీఏ కోర్సు పూర్తిచేసే అవకాశం ఉంది. ఎక్కువ మందికి సుపరిచితమైన మెల్‌బోర్న్ యూనివర్సిటీలో సైతం ఏడాది వ్యవధిలో ఎంబీఏను పూర్తిచేయొచ్చు. ఇది విద్యార్థులను ఆర్థిక భారం నుంచి తప్పిస్తోంది.
అమెరికా: విదేశీ విద్య పరంగా కోర్సు ఏదైనప్పటికీ విద్యార్థుల దృష్టిలో మరో ప్రధాన అంశం కోర్సు ఫీజు. అమెరికాలో ఫీజులు కొంత ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ సగటున ఎంబీఏ ప్రోగ్రామ్ ఫీజు 65 వేల నుంచి 68 వేల డాలర్లు ఉంటోంది.
ఆస్ట్రేలియా: ఫీజుల పరంగా ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీలు విద్యార్థులకు కొంత ఉపశమనం కల్పిస్తున్నాయి. సగటున 60 వేల లోపు డాలర్లతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో
అందుబాటులో ఉంది.
అమెరికా: విదేశీ విద్య - ఆర్థిక వ్యయానికి సంబంధించి మరో ప్రధాన అంశం నివాస ఖర్చులు. ఈ విషయంలో ఆస్ట్రేలియాతో పోల్చితే అమెరికాలో ఒక విద్యార్థికి ఏడాదికి అయ్యే నివాస ఖర్చులు కొంత తక్కువగా ఉంటున్నాయి. అమెరికాలో ఏడాదికి దాదాపు 11 వేల డాలర్లు సరిపోతాయి.
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో మాత్రం ఏడాదికి సగటు జీవన వ్యయం 18 వేల డాలర్లుగా ఉంటోంది.
అమెరికా: బోధన విధానం సరళంగా ఉంటుంది. కోర్సులో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు మైనర్ కోర్సులుగా ఇతర విభాగాలకు సంబంధించిన అంశాలను నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. థియరీ, ప్రాక్టికల్ పరిజ్ఞానానికి సమ ప్రాధాన్యం ఉంటుంది.
ఆస్ట్రేలియా: థియరీ కంటే ప్రాక్టికాలిటీకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ కారణంగానే ప్రవేశ సమయంలో వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్‌కు ప్రాధాన్యమిస్తారు. అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కార్యక్రమం విస్తృతంగా అమలవుతోంది. అభ్యర్థులు అన్ని స్పెషలైజేషన్లలో రాణించేలా కోర్సు విధానం ఉంటోంది.
రెండు దేశాల్లో కోర్సు పూర్తిచేసిన వారికి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. వార్షిక వేతనాల పరంగానూ ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లు అందుతున్నాయి. అయితే అమెరికా నుంచి పట్టా పొందిన వారితో పోల్చితే, ఆస్ట్రేలియాలో కోర్సు పూర్తిచేసిన వారికి లభించే వేతనాలు కొంత తక్కువగా ఉంటున్నాయి.
అమెరికాలో టాప్ యూనివర్సిటీల నుంచి ఎంబీఏ పట్టాతో సగటున 1.30 లక్షల డాలర్ల నుంచి 1.5 లక్షల డాలర్ల మేర వార్షిక వేతనం లభిస్తోంది.
ఆస్ట్రేలియాలో సగటున 90 వేల డాలర్ల నుంచి 1.20 డాలర్ల మధ్యలో ఉంటుంది.
విద్యార్థులు.. కోర్సు పూర్తి చేసిన దేశంలోనే ఉద్యోగం కోరుకోవడం సహజం. ఈ విషయంలో అమెరికా, ఆస్ట్రేలియాలకు సంబంధించిన నిబంధనలు..
అమెరికా: అమెరికాలో కోర్సు పూర్తిచేశాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరుతో 12 నెలలు పనిచేసే అవకాశం ఉంది. ఈ సమయంలో సంబంధిత సంస్థ.. అభ్యర్థిని పూర్తిస్థాయి ఉద్యోగిగా నియమించుకునేందుకు అంగీకరిస్తే.. సంస్థ.. హెచ్-1బీ దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా: కోర్సు పూర్తయ్యాక టెంపరరీ గ్రాడ్యుయేట్ వీసాకు దరఖాస్తు చేసుకొని అక్కడే ఉద్యోగం చేయొచ్చు. అయితే వీసాకు దరఖాస్తు చేసుకునే ముందే అభ్యర్థి నియామకాన్ని ఖరారు చేస్తున్నట్లు సంబంధిత సంస్థ.. స్పాన్సర్‌షిప్ లెటర్ (ఎంప్లాయ్‌మెంట్ ఆఫర్) చేతిలో ఉండాలి.