ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా? | How yadam by aiaiessi PhD from? | Sakshi
Sakshi News home page

ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా?

Published Thu, Nov 6 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా?

ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా?

ఐఐఎస్సీ నుంచి పీహెచ్‌డీ చే యడం ఎలా?
 -స్వాతి, ఖమ్మం.
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తుంది. పీహెచ్‌డీ కోర్సుల్లో సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/యూజీసీ నెట్ జేఆర్‌ఎఫ్/ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ జేఆర్‌ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్‌ఎఫ్; జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్‌లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
 వివరాలకు: www.iisc.ernet.in
 
 రామానుజన్ రీసెర్చ్ స్టూడెంట్‌షిప్ ఇన్ మ్యాథమెటిక్స్ వివరాలు తెలియజేయగలరు?
 - ప్రకాశ్, నిజామాబాద్.
 ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ను గౌరవించే ఉద్దేశంతో ఇంగ్లండ్‌లోని ట్రినిటీ కాలేజ్   ఏటా రామానుజన్ రీసెర్చ్ స్టూడెంట్‌షిప్ ఇన్ మ్యాథమెటిక్స్ అనే స్కాలర్‌షిప్‌ను అందజేస్తోంది. ఇది ప్యూర్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు మాత్రమే పరిమితం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ స్టూడెంట్‌షిప్‌నకు అర్హులు. దీని కాల వ్యవధి: మూడేళ్లు. దీని కింద ఫీజు, తిరుగు ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చులను కూడా చెల్లిస్తారు. ఎంపికైన విద్యార్థులు మొదటి తొమ్మిది నెలల మాస్టర్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ మ్యాథమెటిక్స్ అనే కోర్సులో చేరాల్సి ఉంటుంది. ఈ కోర్సును డిస్టింక్షన్‌లో పూర్తి చేస్తేనే పీహెచ్‌డీ కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
 వెబ్‌సైట్: www.trin.cam.ac.uk
 
 ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సు వివరాలను తెలపండి?

 -అభిషేక్, వరంగల్.
 రోబోటిక్స్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సాఫ్ట్‌వేర్ బ్రాంచ్‌లకు సంబంధించిన ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్. రోబోటిక్స్‌లో ఎంఈ/ఎంటెక్ చేయాలనుకునే వారు బీటెక్ (మెకానికల్)/అనుబంధ బ్రాంచ్‌లతో పూర్తి చేయాల్సి ఉంటుంది. రోబోటిక్స్ పూర్తి చేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మైనింగ్, టూల్ డిజైన్, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి రంగాలు కెరీర్ అవెన్యూస్‌గా ఉంటాయి.
 
 ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
 కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
 అడ్మిషన్: గేట్ స్కోర్ ఆధారంగా.
 వివరాలకు: www.uohyd.ac.in
 
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఉస్మానియా యూనివర్సిటీ
 కోర్సు: ఎంఈ(ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్)
 అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా
 వివరాలకు: www.uceou.edu
 
 ఆంధ్రా యూనివ ర్సిటీ-విశాఖపట్నం
 కోర్సు: కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ స్పెషలైజేషన్‌గా
     
 అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా
     
 వివరాలకు: www.andhrauniversity.edu.in
 
 సిస్కో సర్టిఫికేషన్ కోర్సు వివరాలు తెలపండి?
 - కుమార్, మిర్యాలగూడ.
 ప్రస్తుతం ఐటీ జాబ్ మార్కెట్‌లో సిస్కో సర్టిఫికేషన్‌కు ఎంతో గుర్తింపు ఉంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ ఇలా ఏ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా దానికి సిస్కో సర్టిఫికేషన్ తోడైతే ఇటు ఇండియాలో అటు విదేశాల్లో అవకాశాల పరిధి విస్తృతమవుతుంది. కెరీర్ ఉన్నతికి మార్గం ఏర్పడుతుంది. సిస్కో సర్టిఫికేషన్ నెట్‌వర్క్ అసోసియేషన్ సంక్షిప్తంగా సీసీఎన్‌ఏగా పిలిచే సర్టిఫికేషన్.. రూటింగ్ అండ్ స్విచింగ్, సెక్యూరిటీ, సర్వీస్ ప్రొవైడర్ ఆపరేషన్స్, సర్వీస్ ప్రొవైడర్, వాయిస్ అండ్ వైర్‌లెస్ స్పెషలైజేషన్లలో అందుబాటులో ఉంది. ప్రతి స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి పలు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని సర్టిఫికేషన్స్ పొందాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థి అప్పటికే లోయర్ లెవల్ సిస్కో సర్టిఫికేషన్‌ను పొంది ఉండాలి. సిలబస్ తదితర వివరాలకు www.cisco.com చూడొచ్చు. ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ క్రమంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ల్యాబ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతోపాటు సిస్కో కెరీర్ సర్టిఫికేషన్స్, రహస్య ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. సిస్కోతో ఒప్పందం కుదుర్చుకున్న అధీకృత కేంద్రంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో బహుళైచ్ఛిక, డ్రాగ్ అండ్ డ్రాప్, ఖాళీల పూరణ పద్ధతుల్లో ప్రశ్నలు ఎదురవుతాయి. కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థులకు తమ స్కోర్ రిపోర్ట్ అందుతుంది. ల్యాబ్ పరీక్ష విషయంలో పరీక్ష పూర్తయ్యాక 48 గంటల్లోపు స్కోర్ తెలుస్తుంది. ఒకసారి సీసీఎన్‌ఏ సర్టిఫికేషన్ పొందితే దానికి మూడేళ్లపాటు గుర్తింపు ఉంటుంది. కాబట్టి సర్టిఫికెట్ కాల పరిమితి పూర్తి కాకముందే వృత్తి నిపుణులు మళ్లీ సర్టిఫికేషన్ పొందాలి. ఔత్సాహిక అభ్యర్థులు అధీకృత టెస్ట్ సెంటర్లను సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవాలి. మన రాష్ట్రంలో ప్రముఖ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లు సిస్కో పరీక్షకు శిక్షణ  ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆన్ లైన్‌లో కూడా కోచింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement