Physical Sciences
-
అంతటా వ్యాపించి ఉన్నదే ఆత్మ!
ఆత్మ జన్మించడం లేదు, మరణించడం లేదు. అది సనాతనమైనదైనా నిత్యమైనది. శరీరం నశించినా, నశించనిదని కఠోపనిషత్తు కొన్ని వేలసంవత్సరాల కిందటే ఘోషించింది. ఇదే విషయాన్ని ‘శక్తి నిత్యత్వ నియమం’ ద్వారా ఆధునిక భౌతిక శాస్త్రమూ చెప్తోంది. మన ఋషులు విశేషమైన చింతన చేసి భగవంతుడు, దేవుడు, పరంధాముడు అంటూ వివిధ నామాలు సూచించకుండా సర్వాంతర్యామికి చక్కని అర్థాన్నిచ్చే ‘ఆత్మ’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ‘ఐతరేయోపనిషత్తు’ నొక్కి వక్కాణిస్తుంది. ఆత్మకు పదార్థ లక్షణాలైన ఆకారం, రంగు, రుచి, వాసనలు ఏమీ లేకపోయినా అది పదార్థంగా రూపొంది అన్ని లక్షణాలను ప్రదర్శిస్తూ, తిరిగి తనలోనే లయం చేసుకుని శక్తిగా మార్చుకుంటూ నిత్యనూతనంగా ఉంటూవస్తోంది. ‘ఈశావాస్యోపనిషత్తు’ ఆత్మనుండి అదే ఆత్మను తీసివేసినా, అంతే ఆత్మ మిగులుతుందని చెబుతూ పూర్ణమైన ఆత్మ నుండే ఆత్మ ఉద్భవించిందని అనటం గమ్మత్తుగా అనిపిస్తుంది. అంటే ఆత్మ అన్నింటికన్నా ముందే ఉన్నట్టుగా అర్థమవుతుంది. మరి ఆత్మను చూడడం సాధ్యమౌతుందా? అంటే ఆత్మను అర్థం చేసుకున్న వారికి సాధ్యమే అనిచెప్పవచ్చు. అర్థం చేసుకున్న వారు ఆచరిస్తే ఆ ఆత్మను, దాని నుండి ఉద్భవించే అనిర్వచనీయమైన అలౌకిక ఆనందాన్ని అనుభవించవచ్చు. చరాచరప్రపంచమంతా తానే అయిన ఆత్మే పదార్థమూ, ఆ పదార్థాన్ని ఆవరించిఉన్న శక్తినీ చూసే ప్రతి వస్తువు, కాంతి, ఉష్ణం, శబ్దం మొదలైనవన్నీ ఆత్మే. అంతేకాక మన మనోవాక్కాయ కర్మలు అన్నీ ఆత్మలో భాగమే. ఆత్మ నుండి పరిణామం చెంది పదార్థంగా రూపొందినవి కాబట్టి, పదార్థాలకు స్వాభావికంగా భౌతిక లక్షణాలు ఉండటం సహజం. ఈ సహజ భౌతిక లక్షణాలే ఆత్మను అర్థం చేసుకోకుండా అడ్డుపడేవి. దీనినే మాయ అన్నారు. ఈ మాయకు అతీతంగా ఆలోచిస్తేనే ఆత్మను అర్థం చేసుకోగలము. అర్థం చేసుకున్నా అది అనంతమైంది కాబట్టి, కన్నులతో సంపూర్ణంగా చూడలేము. అందుకు విశేషమైన సాధన చేయాలి. ఆ సాధనకు మనసు లోలోతుల నుండి తృష్ణ ఉద్భవించాలి. అప్పుడే ఏకాగ్రత సాధ్యమై, సాధకుడు సమాధి స్థితిని చేరుకుని తద్వారా లయ స్థితిని పొందుతాడు. అప్పుడే ఆత్మానుభవం సాకారమౌతుంది. అప్పుడు సాధకుని అరిషడ్వర్గాలు నశించి అమేయుడౌతాడు. అతని మనోవాక్కాయకర్మలన్నీ ఆనందాన్నీ, మంగళాన్నీ వెదజల్లుతాయి. అప్పుడు అతడే శివుడౌతాడు. ప్రతి ఒక్కరూ శివత్వాన్ని పొందితే ప్రకృతే పులకరించిపోతుంది. ప్రశ్నోపనిషత్తులో పిప్పలాదమహర్షి ఆత్మ గురించి ఇక ఇంతకన్నా చెప్పలేం అన్నట్టుగా, ఆ సర్వోత్కష్టమైన ఆత్మ గురించి నాకు తెలిసినంతగా, సాధ్యమైనంతగా మీ అందరితో పంచుకోవడం ఎంతో ఆనందకరం. ఈ ఆత్మానుభూతికి అవకాశం ఇచ్చిన ఆత్మస్వరూపులకు శిరసానమామి. – గిరిధర్ రావుల -
‘టీఆర్టీ’ ఫలితాల్లో గందరగోళం
సాక్షి, జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై సంబంధంలేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలంగా కష్టపడి పరీక్ష కు ప్రిపేర్ అయితే.. టీఎస్పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో అధి కారులు సాంకేతిక తప్పిదం జరిగిందని తప్పించుకుని మరోమారు నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన అనంతరం తాము చూసుకున్న ఫైనల్‌కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు కూడా వ్యత్యాసం ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు. ఫలితాల్లో తప్పులు.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్. సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీకి చెందిన మహిళ. ఈమెను బీసీ డీ పురుషుడిగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో చూపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జె. రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాలు ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థికి రంగారెడ్డి జిల్లా వ్యక్తిగా, బీసీ డీగా చూపించారు. మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలాకా లం పాటు కష్టపడి చదివి ఫలితాల కోసం ఎదురుచూస్తే తీవ్రనిరాశ కలిగించాయి. ప్రకటించిన ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు. –నోముల సాయిబాబు, జనగామ జిల్లా ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతోంది.. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్షల్లో తప్పులు దొర్లడం సర్వసాధారణమైంది. పరీక్ష రాసిన అభ్యర్థిలో ప్రతిసారి ఫలితాలు ఎలా వస్తాయో అనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రకటించిన ఫలితాల్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలి. –మారుతిరెడ్డి, కరీంనగర్ జిల్లా -
ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చే యడం ఎలా?
ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చే యడం ఎలా? -స్వాతి, ఖమ్మం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తుంది. పీహెచ్డీ కోర్సుల్లో సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ జేఆర్ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. వివరాలకు: www.iisc.ernet.in రామానుజన్ రీసెర్చ్ స్టూడెంట్‌షిప్ ఇన్ మ్యాథమెటిక్స్ వివరాలు తెలియజేయగలరు? - ప్రకాశ్, నిజామాబాద్. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ను గౌరవించే ఉద్దేశంతో ఇంగ్లండ్‌లోని ట్రినిటీ కాలేజ్ ఏటా రామానుజన్ రీసెర్చ్ స్టూడెంట్‌షిప్ ఇన్ మ్యాథమెటిక్స్ అనే స్కాలర్షిప్ను అందజేస్తోంది. ఇది ప్యూర్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు మాత్రమే పరిమితం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ స్టూడెంట్షిప్నకు అర్హులు. దీని కాల వ్యవధి: మూడేళ్లు. దీని కింద ఫీజు, తిరుగు ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చులను కూడా చెల్లిస్తారు. ఎంపికైన విద్యార్థులు మొదటి తొమ్మిది నెలల మాస్టర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ మ్యాథమెటిక్స్ అనే కోర్సులో చేరాల్సి ఉంటుంది. ఈ కోర్సును డిస్టింక్షన్లో పూర్తి చేస్తేనే పీహెచ్డీ కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: www.trin.cam.ac.uk ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సు వివరాలను తెలపండి? -అభిషేక్, వరంగల్. రోబోటిక్స్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సాఫ్ట్వేర్ బ్రాంచ్‌లకు సంబంధించిన ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్. రోబోటిక్స్‌లో ఎంఈ/ఎంటెక్ చేయాలనుకునే వారు బీటెక్ (మెకానికల్)/అనుబంధ బ్రాంచ్‌లతో పూర్తి చేయాల్సి ఉంటుంది. రోబోటిక్స్ పూర్తి చేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మైనింగ్, టూల్ డిజైన్, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి రంగాలు కెరీర్ అవెన్యూస్‌గా ఉంటాయి. ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అడ్మిషన్: గేట్ స్కోర్ ఆధారంగా. వివరాలకు: www.uohyd.ac.in యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఉస్మానియా యూనివర్సిటీ కోర్సు: ఎంఈ(ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్) అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా వివరాలకు: www.uceou.edu ఆంధ్రా యూనివ ర్సిటీ-విశాఖపట్నం కోర్సు: కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ స్పెషలైజేషన్‌గా అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా వివరాలకు: www.andhrauniversity.edu.in సిస్కో సర్టిఫికేషన్ కోర్సు వివరాలు తెలపండి? - కుమార్, మిర్యాలగూడ. ప్రస్తుతం ఐటీ జాబ్ మార్కెట్లో సిస్కో సర్టిఫికేషన్‌కు ఎంతో గుర్తింపు ఉంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ ఇలా ఏ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా దానికి సిస్కో సర్టిఫికేషన్ తోడైతే ఇటు ఇండియాలో అటు విదేశాల్లో అవకాశాల పరిధి విస్తృతమవుతుంది. కెరీర్ ఉన్నతికి మార్గం ఏర్పడుతుంది. సిస్కో సర్టిఫికేషన్ నెట్వర్క్ అసోసియేషన్ సంక్షిప్తంగా సీసీఎన్ఏగా పిలిచే సర్టిఫికేషన్.. రూటింగ్ అండ్ స్విచింగ్, సెక్యూరిటీ, సర్వీస్ ప్రొవైడర్ ఆపరేషన్స్, సర్వీస్ ప్రొవైడర్, వాయిస్ అండ్ వైర్లెస్ స్పెషలైజేషన్లలో అందుబాటులో ఉంది. ప్రతి స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి పలు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని సర్టిఫికేషన్స్ పొందాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థి అప్పటికే లోయర్ లెవల్ సిస్కో సర్టిఫికేషన్‌ను పొంది ఉండాలి. సిలబస్ తదితర వివరాలకు www.cisco.com చూడొచ్చు. ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ క్రమంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ల్యాబ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతోపాటు సిస్కో కెరీర్ సర్టిఫికేషన్స్, రహస్య ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. సిస్కోతో ఒప్పందం కుదుర్చుకున్న అధీకృత కేంద్రంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో బహుళైచ్ఛిక, డ్రాగ్ అండ్ డ్రాప్, ఖాళీల పూరణ పద్ధతుల్లో ప్రశ్నలు ఎదురవుతాయి. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థులకు తమ స్కోర్ రిపోర్ట్ అందుతుంది. ల్యాబ్ పరీక్ష విషయంలో పరీక్ష పూర్తయ్యాక 48 గంటల్లోపు స్కోర్ తెలుస్తుంది. ఒకసారి సీసీఎన్ఏ సర్టిఫికేషన్ పొందితే దానికి మూడేళ్లపాటు గుర్తింపు ఉంటుంది. కాబట్టి సర్టిఫికెట్ కాల పరిమితి పూర్తి కాకముందే వృత్తి నిపుణులు మళ్లీ సర్టిఫికేషన్ పొందాలి. ఔత్సాహిక అభ్యర్థులు అధీకృత టెస్ట్ సెంటర్లను సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవాలి. మన రాష్ట్రంలో ప్రముఖ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు సిస్కో పరీక్షకు శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆన్ లైన్లో కూడా కోచింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. -
ఫిజికల్ సెన్సైస్
1. బాలిడన్, గల్ఫ్ గురుత్వ మాపకాలను దేనికి ఉపయోగిస్తారు? ఒక ప్రాంతంలో ’g’ విలువలో కలిగే స్వల్ప మార్పులను కనుక్కోవడానికి 2. 500 గ్రాముల ద్రవ్యరాశి ఉన్న రాయి బరువు? 4.92 N 3. కెప్లర్ నియమాన్ని బట్టి గ్రహం సూర్యుడి చుట్టూ ఏ కక్ష్యలో తిరుగుతుంది? దీర్ఘవృత్తాకార కక్ష్య 4. వస్తువు గరిష్ట ఎత్తుని చేరడానికి పట్టే కాలాన్ని ఏమంటారు? ఆరోహణ కాలం 5. కోణీయ వేగానికి ప్రమాణాలు? రేడియన్లు/సెకన్లు 6. 1 రేడియన్ ఎన్ని డిగ్రీలకు సమానం? 57ని 18’ 7. ఘన పదార్థాల్లోని పరమాణువులు చేసే చలనం? డోలాయమాన చలనం 8. 100 సెం.మీ. పొడవున్న సామాన్య లోల కం ఆవర్తన కాలం? రెండు సెకన్లు 9. తక్కువ పౌనఃపున్యాలున్న విద్యుదయ స్కాంత డోలనాల నుంచి ఉత్పత్తి అయ్యే తరంగాలు? రేడియో తరంగాలు 10. రేడియో థెరపీలో ఉపయోగించే కిరణాలు? మృదు ్ఠ-కిరణాలు 11. రేడియోధార్మికత వల్ల ఉత్పత్తి అయ్యే కిరణాలు? గామా కిరణాలు 12. కాంతి తరంగాలు ఏ రకమైన తరంగాలు? తిర్యక్ తరంగాలు 13. అవరోధాల నుంచి పరావర్తనం చెందిన తరంగాల ప్రావస్థలో మార్పు? p లేదా 180ని 14. కాంతి విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? మాక్స్వెల్ 15. కాంతి వికిరణ క్వాంటాలను ఏమంటారు? ఫోటాన్లు 16. ఏ సిద్ధాంతం ప్రకారం కాంతివేగం విరళ యానకంలో కంటే సాంద్రతర యానకంలో తక్కువ? హైగెన్‌స కాంతి తరంగ సిద్ధాంతం 17. {పతిదీప్తి దీపం దీప్యత విలువ? 43 ల్యూమెన్లు/వాట్ 18. 100 వాట్ల ఉష్ణదీప్త దీపం కాంతి అభివాహం? 1400 ల్యూమెన్స 19. అయస్కాంతీకరణ తీవ్రతకు ప్రమాణం? ఆంపియర్/మీటర్ 20. ఒక వాహకంలో ఐదు నిమిషాల్లో 90 కులూంబ్ల ఆవేశం ప్రవహిస్తే ఆ వాహకంలోని విద్యుత్ ప్రవాహం? 0.3 ఆంపియర్లు 21. మాంగనీస్ తీగ విశిష్ట నిరోధం విలువ? 44´10-8 ఓమ్-మీ 22. 100W, 1W లను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం? 0.99W 23. సెకనుకు ఒక జౌల్ పని చేసే విద్యుత్ సామర్థ్య ప్రమాణం? వాట్ 24. ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధనలో మధ్య వేలు దేన్ని సూచిస్తుంది? విద్యుత్ ప్రవాహ దిశను 25. విద్యుత్ మోటార్‌లోని దీర్ఘచతురస్రాకార బంధక కవచాన్ని ఏమంటారు? ఆర్మేచర్ 26. విద్యుచ్ఛక్తిని వాణిజ్య, గృహోపయోగాలకు సరఫరా చేయడంలో అతి ముఖ్యమైన సాధనం? {sాన్సఫార్మర్ 27. గౌణ వేష్టనం చుట్ల సంఖ్య, ప్రధాన వేష్టనంలోని చుట్ల సంఖ్య కంటే తక్కువ ఉండే ట్రాన్సఫార్మర్? స్టెప్ డౌన్ ట్రాన్సఫార్మర్ 28. ఒక ప్రదేశంలో అధిక వోల్టేజీ సరఫరా చేసే విద్యుత్ వ్యవస్థను ఏమంటారు? పవర్ గ్రీడ్ 29. థామ్సన్ పరమాణు నమూనాను ఏమంటారు? పుచ్చకాయ నమూనా 30. కేథోడ్ కిరణాలను, పల్చటి ఫిల్మ్‌ల వంటి పదార్థాల ద్వారా పంపి పరమాణువులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త? లీనార్డ 31. {పోటాన్లు, న్యూట్రాన్లను కలిపి ఏమంటారు? న్యూక్లియాన్లు 32. హీలియంలో ద్రవ్యరాశి తరుగు విలువ? 0.0304 amu 33. (4n+3) శ్రేణిని ఏమంటారు? ఆక్టీనియం శ్రేణి 34. కృత్రిమ రేడియోథార్మిక శ్రేణి? 4n+1 శ్రేణి 35. ఎలక్ట్రాన్‌కు సమానమైన ద్రవ్యరాశి అంతే ధనావేశం ఉన్న మౌలిక కణం? పాజిట్రాన్ 36. కృత్రిమ రేడియోథార్మికతను ఆవిష్కరిం చిన శాస్త్రవేత్త? మేడం ఐరీన్ క్యూరీ జోలియట్, ఫెడ్రిక్ జోలియట్ 37. తక్కువ శక్తి ఉన్న న్యూట్రాన్లను ఏమంటారు? థర్మల్ న్యూట్రాన్లు 38. హైడ్రోజన్ బాంబు నియమం? అనియంత్రిత కేంద్రక సంలీనం 39. మూడు సంయోజకతలున్న మలినాలను ఏమంటారు? {Vహీత మాలిన్యాలు 40. దాత మాలిన్యాలకు ఉదాహరణ ఆర్సినిక్, ఆంటిమొని, ఫాస్పరస్ 41. {Vహమండల నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త? రూథర్‌ఫర్‌డ 42. ఫ్లాంక్ స్థిరాంకం విలువ జౌల్లో? 6.625´10-34 జౌల్ 43. హైడ్రోజన్ పరమాణువులోని ఎలక్ట్రాన్‌కు తరంగ సమీకరణం ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఇర్విన్ శ్రోడింజర్ 44. ఉపస్థిర కక్ష్య ఆకృతిని ఏ క్వాంటం సంఖ్య ఆధారంగా కనుక్కోవచ్చు? అజిముతల్ క్వాంటం సంఖ్య 45. 'd' - ఆర్బిటాల్ల ఆకృతి? డబుల్ డంబెల్ 46. ఎలక్ట్రాన్లను ఆర్బిటాల్‌లో భర్తీచేసే క్రమా న్ని పటం ద్వారా సూచించిన శాస్త్రవేత్త? మాయిలర్ 47. P&P అతిపాతం ఉన్న అణువుకు ఉదాహరణ? Br2, Cl2, O2 48. పార్శ్వ అతిపాతం వల్ల ఏర్పడే బంధం? పై (Pi) 49. s (సిగ్మా) బంధం ఉన్న అణువులకు ఉదాహరణ? H2, HCl, Cl2, BF3, BeF2 50. PCl3 అణువు ఆకృతి? పిరమిడల్ 51. ఎకా అల్యూమినియం అని ఏ మూలకానికి పేరు? గాలియం 52. అత్యధిక క్షయకరణ సామర్థ్యం ఉన్న మూలకం? సీజియం 53. 6వ పీరియడ్‌లోని మూలకాల సంఖ్య? 32 54. బెరిల్ ఖనిజం ఫార్మూలా? Be3Al2(SiO3)6 55. ఒక సమ్మేళనానికి హైడ్రోజన్‌ను కలపడాన్ని ఏమంటారు? క్షయకరణం 56. ఘన పరిమాణ శాతానికి ప్రమాణాలు? {పమాణాలు లేవు. 57. బలహీన విద్యుత్ విశ్లేష్యాలకు ఉదాహరణ? CH3COOH, NH4OH 58. ఉష్ణోగ్రతను పెంచితే NaC ద్రావణీయత ఏమవుతుంది? మారదు 59. క్షారాలు మిథైల్ ఆరంజ్ సూచికను ఏ రంగునకు మారుస్తాయి? పసుపు 60. స్వచ్ఛమైన నీటి PH విలువ? 7 61. బలహీన ఆమ్ల క్షారాల అయనీకరణ శాతం దేనితో పెరుగుతుంది? విలీనంతోపాటు 62. నీటి అయానిక లబ్ధాన్ని మార్పు చెందించే అంశం? ఉష్ణోగ్రత 63. బక్మినిస్టర్ పుల్లరిన్లోని కార్బన్ - కార్బ న్ పరమాణువుల మధ్య బంధ దూరం? 1.4 అని 64. కార్బన్ తర్వాత అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్న మూలకం? సిలికాన్ 65. పశ్చిమ బెంగాల్లో బొగ్గు నిక్షేపాలున్న ప్రదేశం? రాణిగంజ్ 66. లిగ్నైట్‌లోని కార్బన్ శాతం? 70 శాతం 67. అల్యూమినియం కార్బైడ్ జల విశ్లేషణంలో వెలువడే వాయువు? మీథేన్ 68. ఆల్కహాల్ ప్రమేయ సమూహ పరీక్షకు ఉపయోగించే మూలకం? సోడియం 69. ఇథైన్ సాధారణ నామం? ఎసిటిలీన్ 70. మానవ నిర్మిత దారాలకు ఉదాహరణ? నైలాన్, డెక్రాన్, ఓరియాన్ 71. పాలీ హైడ్రాక్సీ ఆల్డిహైడ్లను లేదా కీటోన్లను ఏమంటారు? కార్బోహైడ్రేట్స్ 72. గలాక్టోజ్ సాపేక్ష తియ్యదనం? 32 73. రెండు చాక్లెట్ బాల్ల కెలోరిఫిన్ విలువ? 545 కి. కెలరీ 74. టెన్నిస్ ఆట ప్రక్రియకు ఒక గంటకు అవసరమయ్యే ఆహార కేలరీలు? 426 కేలరీలు 75. క్షయీకరణ కార్బోహైడ్రేట్కు ఉదాహరణ? గ్లూకోజ్ 76. 15-20 శాతం ఆల్కహాల్ ద్రావణాన్ని ఏమంటారు? వాష్ 77. బెల్లం నుంచి తయారు చేసే ఆల్కహాల్‌ను ఏమంటారు? గుడుంబా 78. మధులికా ఇండికా అనే చెట్ల పూల నుంచి తయారు చేసే ఆల్కహాల్? ఇప్పసారా 79. అసహజ పర్చిన ఆల్కహాల్ తాగితే వెంటనే కలిగే దుష్ఫలితం? అంధత్వం 80. రెక్టిఫైడ్ స్పిరిట్ నుంచి ఆబ్సల్యూట్ ఆల్క హాల్ పొందడానికి కలిపే పదార్థం? CaO 81. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలియం శుద్ధి కర్మాగారం ఉన్న ప్రదేశం? విశాఖపట్నం 82. హాల్డియా పెట్రోలియం శుద్ధి కర్మాగారం ఏ రాష్ర్టంలో ఉంది? పశ్చిమ బెంగాల్ 83. ముడి పెట్రోలియంలో సరళ లభ్య పెట్రోల్ శాతం? 20 శాతం 84. గాజు తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు సొడాయాష్, సున్నపురాయి, ఇసుక 85. అత్యంత తియ్యనైన చక్కెర? {ఫక్టోజ్ 86. పాలలో ఉండే కార్బోహైడ్రేట్ లాక్టోజ్ 87. CO-NH బంధాన్ని ఏమంటారు? పెప్టైడ్ బంధం 88. గాజును చల్లబరిచే ప్రక్రియను ఏమంటారు? మందశీతలీకరణం 89. చాల్కోజన్స అని ఏ గ్రూపు మూలకాలను అంటారు? VI A గ్రూపు మూలకాలు 90. మహత్తర హాలోజన్ అని ఏ మూలకాన్ని పిలుస్తారు? ఫ్లోరిన్ 91. అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటి గల మూలకం? క్లోరిన్ 92. బొగ్గు పులుసు వాయువు అని దేన్నంటారు? కార్బన్ డై ఆక్సైడ్ 93. అత్యంత శ్రేష్ఠమైన బొగ్గు? ఆంథ్రసైట్ 94. బక్ మినిష్టర్ పుల్లరిన్ ఏ ఆకృతిలో ఉంటుంది? ఫుట్‌బాల్ 95. కాయలను కృత్రిమంగా పండించేందుకు వాడే వాయువు? ఎసిటిలీన్ 96. మిశ్రమ ఎరువుకు ఉదాహరణ నైట్రోఫాస్క్ 97. ఘన ఇై2ను ఏమంటారు? పొడిమంచు 98. తినే సోడా రసాయన ఫార్మూలా? NaHCO3 99. ఆక్సిజన్‌కు పేరు పెట్టిన శాస్త్రవేత్త? లెవోయిజర్ 100. ఆక్సీ-ఎసిటిలీన్ జ్వాల ఉష్ణోగ్రత? 3200°C 101. గాలిలో ఆక్సిజన్, నత్రజనిల నిష్పత్తి? 1:4 102. సుక్రోజ్ రసాయన ఫార్ములా? C12H22O11 103. ఉత్పతనం చెందే పదార్థాలకు ఉదాహరణ? I2, NH4Cl, కర్పూరం 104. ఆర్ధ కాపర్ సల్ఫేట్ రంగు? నీలిరంగు 105. వేడిచేసినప్పుడు జింక్ ఆక్సైడ్ పొందే రంగు? పసుపు 106. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయో గించే ఉత్ప్రేరకం? నికెల్ 107. ప్రొడ్యూసర్ వాయువు సంఘటనం? CO+N2+H2 108. విరంజనకారికి ఉదాహరణ? ై2 (తేమ సమక్షంలో) 109. నిర్జలీకరణులకు ఉదాహరణ? P2O5, H2SO4 110. ఖీూఖీ సంపూర్ణ నామం? {Osె నైట్రో టోలీన్ 111. అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని ఏమంటారు? టోలెన్స కారకం 112. రబ్బరు వల్కనీకరణంలో ఉపయోగించే మూలకం? గంధకం (సల్ఫర్) 113. అమ్మోనాల్ సంఘటనం? NH4NO3+Al పొడి 114. ఈఈఖీ సంపూర్ణ నామం? డైక్లోరో డై ఫినైల్ ట్రై క్లోరో ఈథేన్ 115. గ్లూకోజ్‌ను ఇథైల్ ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్‌గా విడగొట్టే ఎంజైమ్? జైమేజ్ 116. శాశ్వత అయస్కాంతం తయారీకి ఉపయోగించే మిశ్రమ లోహం? అల్నికో 117. త్రిక్షార ఆమ్లానికి ఉదాహరణ? H3PO4 118. ద్విమాత్ర ఎరువునకు ఉదాహరణ? KNO3. (NH4)3PO4 119. కృత్రిమ రంజనాన్ని తయారు చేసిన శాస్త్ర వేత్త? హెన్రీ పెర్కిన్ 120. పెట్రోలియంను ఆంశిక స్వేదనం చేసిన ప్పుడు ఏర్పడే ఉత్పన్నాలు? పెట్రో కెమికల్స్ 121. పాలలో ఉండే ఆమ్లం? లాక్టిక్ ఆమ్లం 122. పాలిశాఖరైడ్లకు ఉదాహరణలు? సెల్యులోజ్, స్టార్‌చ 123. గ్లూకోజ్ కెలోరిఫిక్ విలువ? 3.81 కెలోరీ/గ్రామ్ 686 కి.కెలోరి/మోల్ 124. సుక్రోజ్‌ను గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లుగా విడగొట్టే ఎంజైమ్? ఇన్వర్టేజ్ -
భౌతిక శాస్త్రాలు
1. సామాన్య లోలకం పొడవు? 100 సెం.మీ. 2. పెరిస్కోపులో రెండు దర్పణాల మధ్య కోణం? 45ని 3. ఉష్ణాన్ని ఇవ్వని కాంతి జనకం? మిణుగురు పురుగు 4. {పమాణాలు లేని అయస్కాంత ధర్మం? ససెప్టిబిలిటీ 5. పరారుణ వికిరణాల ఉనికిని దేనితో పరిశీలించవచ్చు? థర్మోఫైల్స్, బోలోమీటర్స 6. శృంగాలు, ద్రోణులు ఏ తరంగాల్లో ఏర్పడుతాయి? తిర్యక్ తరంగాలు 7. థర్మాస్ ఫ్లాస్క్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త? దీవార్ 8. కంప్యూటర్ పితామహుడు? చార్లెస్ బాబేజ్ 9. పరమాణు బాంబు నిర్మాణంలో ఇమిడి ఉన్న సూత్రం? కేంద్రక విచ్ఛితి 10. సోడియం (Na+) లవణం ఉపయోగం? దుస్తులు ఉతికే సబ్బు తయారీ 11. నీటిలో తడవని దుస్తుల తయారీకి ఉపయోగించే లవణాలు? Ca2+, Al3+ 12. కజ2+(మెగ్నీషియం) లవణాన్ని దేనికి ఉపయోగిస్తారు? ముఖానికి వాడే పౌడర్ 13. డ్రైక్లీనింగ్, అలంకరణ సామగ్రికి ఉపయోగించే ఫాటీఆమ్ల లవణం? ట్రే ఇథనాల్ అమ్మోనియా 14. శరీర శుభ్రతకు వాడే సబ్బులోని స్వేచ్ఛా ఫాటీ ఆమ్ల శాతం? 7-10 శాతం 15. దుర్వాసన తొలగించే సబ్బులు దేన్ని కలిగి ఉంటాయి? 3, 4, 5 - ట్రై బ్రోమో సాలిసిలేనిలైడ్ 16. గడ్డం చేసుకొనే సబ్బులో ఎక్కువ మోతాదులో ఉండేది? స్వేచ్ఛా స్టియరిక్ ఆమ్లం 17. పారదర్శక సబ్బులు దేన్ని కలిగి ఉంటాయి? గ్లిసరాల్ 18. ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ (లేదా) ఫాటీ ఆల్కహాల్ సల్ఫేట్ల లవణాలను ఏమంటారు? డిటర్జెంట్లు (లేదా) కల్మషహారులు 19. ముడి స్లర్రీలోని నీటి శాతం? 40 శాతం 20. సిమెంట్‌ను కనిపెట్టిన వ్యక్తి? జె. ఏస్పిరిన్ 21. సిమెంట్ రసాయన నామం? కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ 22. సిమెంట్ తయారీకి కావల్సిన ఉష్ణోగ్రత? 1700-1900 c 23. బూడిద రంగు ఉన్న సిమెంట్ బంతులను ఏమంటారు? క్లింకర్ సిమెంట్ 24. గాజు రసాయన నామం? సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా 25. పగిలిన గాజు ముక్కలను ఏమంటారు? కల్లెట్ 26. బాచ్ ద్రవీభవన స్థానాన్ని తగ్గించేది? కల్లెట్ 27. గాజుపై తేలియాడే మలినాలను తొలిగించే విధానాన్ని ఏమంటారు? గాజు గాల్ 28. గాజును ప్రత్యేక పద్ధతిలో చల్లార్చడాన్ని ఏమంటారు? మందశీతలీకరణం 29. సోడా గాజు ఉపయోగం? కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీ 30. {పయోగశాలలోని గాజు పరికరాల తయారీకి ఉపయోగించే గాజు? పెరైక్స్ 31. విద్యుత్ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి ఉపయోగించే గాజు? క్వార్ట్జ్ గాజు 32. ఫ్లింట్ గాజును దేనికి ఉపయోగిస్తారు? దృశ్య పరికరాల తయారీకి 33. అల్పవ్యాకోచం, కుదుపు, రసాయనాలను తట్టుకునే గాజు? బోరో సిలికేట్ 34. ఆకుపచ్చ రంగు గాజు పొందడానికి కలపాల్సిన లోహ ఆక్సైడ్? Cr2O3 35. కై2 లోహ లవణం కలిపితే వచ్చే గాజు రంగు? ఊదా రంగు 36. నీలం రంగు గాజు పొందడానికి కావల్సిన లోహ ఆక్సైడ్? Cuso4 37. అఠఇ3 లోహ లవణం కలిపితే వచ్చే గాజు రంగు? కెంపు రంగు 38. ఎరుపు రంగు గాజు పొందడానికి కావల్సిన లోహ ఆక్సైడ్? Cu2O 39. కోరిన ఆకృతి ఉన్న గాజు వస్తువులను తయారుచేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు? గ్లాస్ బ్లోయింగ్ 40. గ్లాస్ బ్లోయింగ్‌కు ఉపయోగించే గాజు? పెరైక్స్, బోరోసిలికేట్ 41. ‘సిరామిక్స్’ అనేది ఏ పదం నుంచి వచ్చింది? కేరామోస్ 42. కేరామోస్ ఏ భాషకు చెందింది? గ్రీకు 43. సాధారణ కుండ పాత్రలను ఏమంటారు? టెర్రాకోట (లేదా) పోటరీ 44. మృత్తికా పాత్రల తయారీకి కావల్సిన ఉష్ణోగ్రత? 1450-1800 c 45. కర్బన పదార్థాల పాలిమర్లను ఏమంటారు? ప్లాస్టిక్స్ (లేదా) రెసిన్స 46. థర్మా సెట్టింగ్ ప్లాస్టిక్స్‌కు ఉదాహరణ? ఫినాల్ - ఫార్మాల్డీహైడ్, యూరియా - ఫార్మాల్డీహైడ్ 47. థర్మా ఎలాస్టిక్ ప్లాస్టిక్స్‌కు ఉదాహరణ? పాలీ వినైల్ క్లోరైడ్, పాలీస్టెరీన్ - నైలాన్ 6, 6’ 48. పాలీప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్ల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్? పాలిథీన్ (అల్ప సాంద్రత) 49. బొమ్మలు, విద్యుత్ బంధకాలు, ప్లాస్టిక్ పాత్రల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్? పాలిథీన్ (అధిక సాంద్రత) 50. విద్యుత్ బంధకాలు, దువ్వెనలు, టీవీ, రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే ప్లాస్టిక్? పాలీస్టెరీన్ 51. పాలీ వినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్ ఉపయోగం? గొట్టాలు, చేతి సంచులు 52. ఫిల్ములు, టేపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్? పాలీ ఎస్టర్స 53. బ్రష్‌లు, బ్రష్‌ల ముళ్లు, తీవాచీల తయారీకి ఉపయోగించేవి? నైలాన్ 6, 6’ 54. కృత్రిమ జిగుర్లకు ఉదాహరణ? ఫినాల్ - యూరియా - ఫార్మాల్డీహైడ్ 55. నైలాన్, డెక్రాన్ దారాలను ఏ పద్ధతిలో తయారుచేస్తారు? గలన పద్ధతి 56. పొడి పద్ధతి ద్వారా ఏ దారాలను తయారుచేస్తారు? సెల్యులోజ్ ఎసిటేట్, ఓర్లాన్ 57. నైట్రో సెల్యులోజ్ (లేదా) డై నైట్రో సెల్యులోజ్ అన్రెసిన్సను ఏ పేరుతో వాడతారు? పైరోక్సిలిన్ 58. టాల్క్ అంటే ఏమిటి? మెగ్నీషియం సిలికేట్ 59. నీలం రంగు అద్దకాన్ని ఎక్కడి నుంచి సేకరించేవారు? ఇండిగో మొక్కలు 60. మేడర్ మొక్క వేళ్ల నుంచి ఏ రంగును సేకరిస్తారు? టర్కీ ఎరుపు 61. కృత్రిమ రంజనాన్ని తయారుచేసిన శాస్త్రవేత్త? హెన్రీ పెర్కిన్ 63. ఆక్సోక్రోమ్కు ఉదాహరణ? –OH, –COOH, –SO3H, –NH2, 64. {పోటోజోవా, బ్యాక్టీరియా, ఫంజి, ఏలికపాముల వంటి ఇతర జీవులపై పనిచేసే మందులు? రసాయన చికిత్స మందులు 65. హార్మోన్లకు ఉదాహరణ? ఇన్సులిన్, కార్టిసోన్ 66. పెట్రోలియం నుంచి పెట్రోల్‌ను ప్రత్యక్షంగా పొందడాన్ని ఏమంటారు? సరళ లభ్య పెట్రోల్ 67. మిశ్రమ ఎరువుకు ఉదాహరణ? నైట్రోఫాస్క్ 68. గాజు తయారీకి వినియోగించే ఉష్ణోగ్రత? 1000 నిఇ 69. వంటగ్యాస్‌లో ముఖ్య సంఘననం? బ్యూటేన్ 70. పెట్రోలియం ఉత్పన్నాల నుంచి తయారుచేసే కర్బన పదార్థాలు ? పెట్రో కెమికల్స్ 71. ద్విమాత్ర ఎరువునకు ఉదాహరణ? KNO3, NH4H2PO4, (NH4)2 HPO4, (NH4)3PO4 72. {Oyెక్లీనింగ్లో ద్రావణిగా దేన్ని ఉపయో గిస్తారు? పెట్రోల్ 73. {పాథమిక పోషకాలకు ఉదాహరణ? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 74. సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ? కాపర్, మాలిబ్డినం, బోరాన్, ఇనుము 75. సోడాయాష్, సున్నపురాయి, ఇసుక పొడి మిశ్రమాన్ని ఏమంటారు? బాచ్ 76. 4+2 శ్రేణిని ఏమంటారు? యురేనియం శ్రేణి 77. హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి? పాస్కల్ నియమం 78. మానవ శరీరం ఏ రకమైన ఉష్ణవాహకం? అధమ ఉష్ణవాహకం 79. లేజర్లను ఏ ప్రత్యేక త్రిమితీయ ఫొటోగ్రఫీలో ఉపయోగిస్తారు? హాలోగ్రఫీ 80. మోర్సకోడ్ను ఎక్కడ ఉపయోగిస్తారు? టెలిగ్రాఫ్ 81. బల్బుల్లో ఫిలమెంట్‌గా దేన్ని ఉపయోగిస్తారు? టంగ్స్టన్ 82. ఇళ్లల్లో బల్బులను ఏ పద్ధతిలో అమర్చుతారు? సమాంతర పద్ధతి 83. టార్చిలైట్లలో వాడే ఘటాన్ని ఏమంటారు? నిర్జల ఘటం 84. రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త? మార్కోని 85. ఒక టెస్లా ఎన్ని గాస్లకు సమానం? 104 86. ఓడలను ఏ నియమం ఆధారంగా నిర్మిస్తారు? స్థిరత్వ నియమాలు 87. రేఖీయ చలనానికి మరో పేరు? స్థానాంతర చలనం 88. గడియారంలో తిరిగే ముల్లు చలనం? ఆవర్తన చలనం 89. న్యూక్లియర్ రియాక్టర్లో దేన్ని మితకారిగా ఉపయోగిస్తారు? భారజలం 90. న్యూక్లియర్ రియాక్టర్లో కంట్రోల్ రాడ్సగా ఉపయోగించేవి? బోరాన్, కాడ్మియం కడ్డీలు 91. ఒక పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం? 3.26 92. అత్యంత కచ్చితంగా కాలాన్ని కొలిచే సాధనాలు? పరమాణు గడియారం