భౌతిక శాస్త్రాలు | Physical Sciences | Sakshi
Sakshi News home page

భౌతిక శాస్త్రాలు

Published Thu, Jan 30 2014 12:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

భౌతిక శాస్త్రాలు - Sakshi

భౌతిక శాస్త్రాలు

 1.    సామాన్య లోలకం పొడవు?
     100 సెం.మీ.
 2.    పెరిస్కోపులో రెండు దర్పణాల మధ్య కోణం?
     45ని
 3.    ఉష్ణాన్ని ఇవ్వని కాంతి జనకం?
     మిణుగురు పురుగు
 4.    {పమాణాలు లేని అయస్కాంత ధర్మం?
     ససెప్టిబిలిటీ
 5.    పరారుణ వికిరణాల ఉనికిని దేనితో పరిశీలించవచ్చు?
     థర్మోఫైల్స్, బోలోమీటర్‌‌స
 6.    శృంగాలు, ద్రోణులు ఏ తరంగాల్లో ఏర్పడుతాయి?
     తిర్యక్ తరంగాలు
 7.    థర్మాస్ ఫ్లాస్క్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త?
     దీవార్
 8.    కంప్యూటర్ పితామహుడు?
     చార్లెస్ బాబేజ్
 9.    పరమాణు బాంబు నిర్మాణంలో ఇమిడి ఉన్న సూత్రం?
     కేంద్రక విచ్ఛితి
 10.    సోడియం (Na+) లవణం ఉపయోగం?
     దుస్తులు ఉతికే సబ్బు తయారీ
 11.    నీటిలో తడవని దుస్తుల తయారీకి ఉపయోగించే లవణాలు?
     Ca2+, Al3+
 12.    కజ2+(మెగ్నీషియం) లవణాన్ని దేనికి ఉపయోగిస్తారు?
     ముఖానికి వాడే పౌడర్
 13.    డ్రైక్లీనింగ్, అలంకరణ సామగ్రికి ఉపయోగించే ఫాటీఆమ్ల లవణం?
     ట్రే ఇథనాల్ అమ్మోనియా
 14.    శరీర శుభ్రతకు వాడే సబ్బులోని స్వేచ్ఛా ఫాటీ ఆమ్ల శాతం?
     7-10 శాతం
 15.    దుర్వాసన తొలగించే సబ్బులు దేన్ని కలిగి ఉంటాయి?
     3, 4, 5 - ట్రై బ్రోమో సాలిసిలేనిలైడ్
 16.    గడ్డం చేసుకొనే సబ్బులో ఎక్కువ మోతాదులో ఉండేది?
     స్వేచ్ఛా స్టియరిక్ ఆమ్లం
 17.    పారదర్శక సబ్బులు దేన్ని కలిగి ఉంటాయి?
     గ్లిసరాల్
 18.    ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ (లేదా) ఫాటీ ఆల్కహాల్ సల్ఫేట్‌ల లవణాలను ఏమంటారు?
     డిటర్జెంట్లు (లేదా) కల్మషహారులు
 19.    ముడి స్లర్రీలోని నీటి శాతం?
     40 శాతం
 20.    సిమెంట్‌ను కనిపెట్టిన వ్యక్తి?
     జె. ఏస్పిరిన్
 21.    సిమెంట్ రసాయన నామం?
     కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్
 22.    సిమెంట్ తయారీకి కావల్సిన ఉష్ణోగ్రత?
     1700-1900 c
 23.    బూడిద రంగు ఉన్న సిమెంట్ బంతులను ఏమంటారు?
     క్లింకర్ సిమెంట్
 24.    గాజు రసాయన నామం?
     సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా
 25.    పగిలిన గాజు ముక్కలను ఏమంటారు?
     కల్లెట్
 26.    బాచ్ ద్రవీభవన స్థానాన్ని తగ్గించేది?
     కల్లెట్
 27.    గాజుపై తేలియాడే మలినాలను తొలిగించే విధానాన్ని ఏమంటారు?
     గాజు గాల్
 28.    గాజును ప్రత్యేక పద్ధతిలో చల్లార్చడాన్ని ఏమంటారు?
     మందశీతలీకరణం
 29.    సోడా గాజు ఉపయోగం?
     కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీ
 30.    {పయోగశాలలోని గాజు పరికరాల తయారీకి ఉపయోగించే గాజు?
     పెరైక్స్
 31.    విద్యుత్ బల్బులు, దృశ్య పరికరాల తయారీకి ఉపయోగించే గాజు?
     క్వార్ట్జ్ గాజు
 32.    ఫ్లింట్ గాజును దేనికి ఉపయోగిస్తారు?
     దృశ్య పరికరాల తయారీకి
 33.    అల్పవ్యాకోచం, కుదుపు, రసాయనాలను తట్టుకునే గాజు?
     బోరో సిలికేట్
 34.    ఆకుపచ్చ రంగు గాజు పొందడానికి కలపాల్సిన లోహ ఆక్సైడ్?
     Cr2O3
 35.    కై2 లోహ లవణం కలిపితే వచ్చే గాజు రంగు?
     ఊదా రంగు
 36.    నీలం రంగు గాజు పొందడానికి కావల్సిన లోహ ఆక్సైడ్?
     Cuso4
 37.    అఠఇ3 లోహ లవణం కలిపితే వచ్చే గాజు రంగు?
     కెంపు రంగు
 38.    ఎరుపు రంగు గాజు పొందడానికి కావల్సిన లోహ ఆక్సైడ్?
     Cu2O
 39.    కోరిన ఆకృతి ఉన్న గాజు వస్తువులను తయారుచేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు?
     గ్లాస్ బ్లోయింగ్
 40.    గ్లాస్ బ్లోయింగ్‌కు ఉపయోగించే గాజు?
     పెరైక్స్, బోరోసిలికేట్
 41.    ‘సిరామిక్స్’ అనేది ఏ పదం నుంచి వచ్చింది?
     కేరామోస్
 42.    కేరామోస్ ఏ భాషకు చెందింది?
          గ్రీకు
 43.    సాధారణ కుండ పాత్రలను ఏమంటారు?
     టెర్రాకోట (లేదా) పోటరీ
 44.    మృత్తికా పాత్రల తయారీకి కావల్సిన ఉష్ణోగ్రత?
     1450-1800 c
 45.    కర్బన పదార్థాల పాలిమర్‌లను ఏమంటారు?
     ప్లాస్టిక్స్ (లేదా) రెసిన్‌‌స
 46.    థర్మా సెట్టింగ్ ప్లాస్టిక్స్‌కు ఉదాహరణ?
     ఫినాల్ - ఫార్మాల్డీహైడ్, యూరియా - ఫార్మాల్డీహైడ్
 47.    థర్మా ఎలాస్టిక్ ప్లాస్టిక్స్‌కు ఉదాహరణ?
     పాలీ వినైల్ క్లోరైడ్, పాలీస్టెరీన్ - నైలాన్ 6, 6’
 48.    పాలీప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్ల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్?
     పాలిథీన్ (అల్ప సాంద్రత)
 49.    బొమ్మలు, విద్యుత్ బంధకాలు, ప్లాస్టిక్ పాత్రల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్?
     పాలిథీన్ (అధిక సాంద్రత)
 50.    విద్యుత్ బంధకాలు, దువ్వెనలు, టీవీ, రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే ప్లాస్టిక్?
     పాలీస్టెరీన్
 51.    పాలీ వినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్ ఉపయోగం?
 
     గొట్టాలు, చేతి సంచులు
 52.    ఫిల్ములు, టేపుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్?
     పాలీ ఎస్టర్‌‌స
 53.    బ్రష్‌లు, బ్రష్‌ల ముళ్లు, తీవాచీల తయారీకి ఉపయోగించేవి?
     నైలాన్ 6, 6’
 54.    కృత్రిమ జిగుర్లకు ఉదాహరణ?
     ఫినాల్ - యూరియా - ఫార్మాల్డీహైడ్
 55.    నైలాన్, డెక్రాన్ దారాలను ఏ పద్ధతిలో తయారుచేస్తారు?
     గలన పద్ధతి
 56.    పొడి పద్ధతి ద్వారా ఏ దారాలను తయారుచేస్తారు?
     సెల్యులోజ్ ఎసిటేట్, ఓర్లాన్
 57.    నైట్రో సెల్యులోజ్ (లేదా) డై నైట్రో సెల్యులోజ్ అన్‌రెసిన్‌‌సను ఏ పేరుతో వాడతారు?
     పైరోక్సిలిన్
 58.    టాల్క్ అంటే ఏమిటి?
     మెగ్నీషియం సిలికేట్
 59.    నీలం రంగు అద్దకాన్ని ఎక్కడి నుంచి సేకరించేవారు?
     ఇండిగో మొక్కలు
 60.    మేడర్ మొక్క వేళ్ల నుంచి ఏ రంగును సేకరిస్తారు?
     టర్కీ ఎరుపు
 61.    కృత్రిమ రంజనాన్ని తయారుచేసిన శాస్త్రవేత్త?
     హెన్రీ పెర్కిన్
        
 63.    ఆక్సోక్రోమ్‌కు ఉదాహరణ?
      –OH, –COOH, –SO3H, –NH2,
 64.    {పోటోజోవా, బ్యాక్టీరియా, ఫంజి, ఏలికపాముల వంటి ఇతర జీవులపై పనిచేసే మందులు?
     రసాయన చికిత్స మందులు
 65.    హార్మోన్‌లకు ఉదాహరణ?
     ఇన్సులిన్, కార్టిసోన్
 66.    పెట్రోలియం నుంచి పెట్రోల్‌ను ప్రత్యక్షంగా పొందడాన్ని ఏమంటారు?
     సరళ లభ్య పెట్రోల్
 67.    మిశ్రమ ఎరువుకు ఉదాహరణ?
     నైట్రోఫాస్క్
 68.    గాజు తయారీకి వినియోగించే ఉష్ణోగ్రత?
     1000 నిఇ
 69.    వంటగ్యాస్‌లో ముఖ్య సంఘననం?
     బ్యూటేన్
 70.    పెట్రోలియం ఉత్పన్నాల నుంచి తయారుచేసే కర్బన పదార్థాలు ?
     పెట్రో కెమికల్స్
 71.    ద్విమాత్ర ఎరువునకు ఉదాహరణ?
     KNO3, NH4H2PO4,
     (NH4)2 HPO4, (NH4)3PO4
 72.    {Oyెక్లీనింగ్‌లో ద్రావణిగా దేన్ని ఉపయో గిస్తారు?
     పెట్రోల్
 73.    {పాథమిక పోషకాలకు ఉదాహరణ?
     నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం
 74.    సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ?
     కాపర్, మాలిబ్డినం, బోరాన్, ఇనుము
 75.    సోడాయాష్, సున్నపురాయి, ఇసుక పొడి మిశ్రమాన్ని ఏమంటారు?
     బాచ్
 76. 4+2 శ్రేణిని ఏమంటారు?
     యురేనియం శ్రేణి
 77.    హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి?
     పాస్కల్ నియమం
 78.    మానవ శరీరం ఏ రకమైన ఉష్ణవాహకం?
     అధమ ఉష్ణవాహకం
 79.    లేజర్‌లను ఏ ప్రత్యేక త్రిమితీయ ఫొటోగ్రఫీలో ఉపయోగిస్తారు?
     హాలోగ్రఫీ
 80.    మోర్‌‌సకోడ్‌ను ఎక్కడ ఉపయోగిస్తారు?
     టెలిగ్రాఫ్
 81.    బల్బుల్లో ఫిలమెంట్‌గా దేన్ని ఉపయోగిస్తారు?
     టంగ్‌స్టన్
 82.    ఇళ్లల్లో బల్బులను ఏ పద్ధతిలో అమర్చుతారు?
     సమాంతర పద్ధతి
 83.    టార్చిలైట్లలో వాడే ఘటాన్ని ఏమంటారు?
     నిర్జల ఘటం
 84.    రేడియోను కనిపెట్టిన శాస్త్రవేత్త?
     మార్కోని
 85.    ఒక టెస్లా ఎన్ని గాస్‌లకు సమానం?
     104
 86.    ఓడలను ఏ నియమం ఆధారంగా నిర్మిస్తారు?
     స్థిరత్వ నియమాలు
 87.    రేఖీయ చలనానికి మరో పేరు?
     స్థానాంతర చలనం
 88.    గడియారంలో తిరిగే ముల్లు చలనం?
     ఆవర్తన చలనం
 89.    న్యూక్లియర్ రియాక్టర్‌లో దేన్ని మితకారిగా ఉపయోగిస్తారు?
     భారజలం
 90.    న్యూక్లియర్ రియాక్టర్‌లో కంట్రోల్ రాడ్‌‌సగా ఉపయోగించేవి?
     బోరాన్, కాడ్మియం కడ్డీలు
 91.    ఒక పార్‌సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం?
     3.26
 92.    అత్యంత కచ్చితంగా కాలాన్ని కొలిచే సాధనాలు?
     పరమాణు గడియారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement