
దేశానికే విత్తన భాండాగారం తెలంగాణ
ప్రపంచంలో రెండే రెండు రాష్ట్రాలు పూర్తిగా విత్తనో త్పత్తికి అనుకూలంగా ఉంటున్నాయని అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకటి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం. రెండోది భారత్‌లోని తెలంగాణ రాష్ట్రం. పుష్కలమైన సూర్య రశ్మి, పొడి వాతావరణం, గాలిలో తక్కువ తేమ, అనువైన నేలల వల్ల విత్తన పంటల సాగుకు తెలం గాణ అత్యంత అనుకూలం. రాష్ట్రంలో 84 శాతం పైగా ఉన్న సన్న, చిన్న కారు రైతుల పంటలసాగు లాభసాటిగా ఉండాలంటే ఉత్పత్తి పెంపుదల ముఖ్యం.
నాణ్యమైన విత్తనం నాటితే రైతు దాదాపు సగం దిగుబడి పొందినట్లే. దేశ విత్తన అవసరాలలో 60 శాతం తెలంగాణ రాష్ట్రమే తీరుస్తోంది. ఎందు కంటే 370కిపైగా జాతీయ, అంతర్జ్జాతీయ విత్తనో త్పత్తి సంస్థల పరిశోధన కేంద్రాలు, విత్తనోత్పత్తి క్షేత్రాలు తెలంగాణలోనే ఉన్నాయి. అందుకే తెలం గాణ భారత విత్తన రాజధానిగా, విత్తన భాండాగా రంగా పేరుపొందింది. విత్తనోత్పత్తిపరంగా ఇంత ఘన చరిత్ర కలిగిన తెలంగాణలో అదే స్థాయిలో పరిశోధనలు మాత్రం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయమే దీనికి గొప్ప ఉదాహరణ.
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ విద్యపై బోధన, పరిశోధన, విస్తరణ అంశాలపై నిరంతరం అధ్యయనం జరగాలనే ఉద్దేశంతో నెలకొల్పారు. తెలంగాణను భారత దేశ విత్తన భాండాగారంగా మార్చడంలో వ్యవసాయ వర్సిటీదే కీలకపాత్ర అని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో ప్రకటనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అటు తెలంగాణ ఉద్యమంలోను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత కూడా పలు సందర్భాలలో ఇదే విష యాన్ని గుర్తుచేసిన సంగతి తెలిసిందే.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ ఉన్నత విద్యపై దాదాపు 15 కోర్సులకు పైగా పిజి, పీహెచ్‌డీ కోర్సులు నిర్వహిస్తున్నారు. వాటిలో ఒక విభాగమైన సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (విత్తనో త్పత్తి విభాగం)లో మాత్రం ఇంతవరకు పీహెచ్‌డీ కోర్సు ప్రవేశపెట్టలేదు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసా య విశ్వవిద్యాలయంలో 2002 సంవత్సరం విత్తనో త్పత్తి విభాగంలో పీజీ కోర్సును ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఈ విభాగంలో పిహెచ్‌డీ కోర్సును మాత్రం ప్రవేశపెట్టలేదు. పొరు గురాష్ట్రాలైన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, కర్ణాటకలోని దార్వాడ్ వ్యవసాయ వర్సిటీలు పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి.
కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ వర్సిటీలు మాత్రం పీహెచ్‌డీ కోర్సు చేయాలను కున్న వారికి మొండి చేయి చూపిస్తూ పరిశోధక విద్యార్థులను నిరాశపరుస్తున్నాయి. పీహెచ్‌డీ కోర్సును తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టాలని పరిశోధక విద్యార్థులు గతంలో అనేకసార్లు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించకపోగా తమ వినతిపత్రాలు కాగి తాలకే పరిమితమయ్యాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా వ్యవసాయ విశ్వవిద్యాల యం విత్తనోత్పత్తిలో పీహెచ్‌డీ కోర్సును ప్రవేశపెట్టి వర్సిటీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తే తెలంగా ణను విత్తన భాండాగారంగా మార్చడంలో వర్సిటీ కీలకపాత్ర పోషించే వీలుంటుందని పలువురు వ్యవ సాయ శాస్త్రవేత్తలు, నిపుణుల అభిప్రాయం. విత్తనో త్పత్తికి తెలంగాణ ప్రాంతం అనుకూలమన్నది నిర్వి వాదాంశం. అయితే స్థానికంగా రైతే విత్తన పంట లను పండించి విక్రయించేందుకు అవకాశం కల్పిం చాలి. ముఖ్యంగా ప్రభుత్వ పరిశోధన కేంద్రాలైన వ్యవసాయ వర్సిటీలలో విత్తనోత్పత్తులపై పరిశోధ నలు విస్తృతంగా జరగాలంటే పీహెచ్‌డీ కోర్సులను తక్షణం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(హైదరాబాద్‌లో 27-29 వరకు జరగనున్న
జాతీయ విత్తన సదస్సు సందర్భంగా)
కాటం శ్రీధర్ సాక్షి విలేకరి, హైదరాబాద్