2 టన్నుల ఆర్డర్ ఇస్తే సరఫరా చేయనున్న టీజీఎస్‌డీసీ
టీజీఎస్‌డీసీ కౌంటర్లలో కొనుగోలు చేసే విత్తనాలపై రైతులకు 6 శాతం డిస్కౌంట్
యాసంగి సీజన్‌లో 40 వేల క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రైతులకు అవసరమైన విత్తనాలను నేరుగా సరఫరా చేసేందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ (టీజీఎస్‌డీసీ) సిద్ధమైంది. ప్రైవేట్ కంపెనీలు, దళారుల మాయమాటలకు రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రస్తుత యాసంగి సీజన్ నుంచే కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్, ఆదర్శ రైతు సేవాకేంద్రాలు(ఏఆర్‌ఎస్‌కేస్), డీసీఎంలతోపాటు హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న టీజీఎస్‌డీసీ విక్రయ కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్ నుంచి గ్రామాల్లోని రైతులు 2 టన్నులకు మించి విత్తనాలు ఆర్డర్ చేస్తే నేరుగా వారి వద్దకే సరఫరా చేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ నాటికి కనీసం 15 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణానికి అవసరమయ్యే 7 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందించాలని విత్తనాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది.
ఈ యాసంగి సీజన్‌లో ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి 40 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమవుతాయని టీజీఎస్‌డీసీ భావిస్తోంది. ఇందుకోసం సంస్థ ఇప్పటికే 30 వేల క్వింటాళ్ల విత్తనాలను రాష్ట్రంలోని అన్ని మండలాలకు పంపించింది.
⇒ ఇందులో సన్నరకం విత్తనాలైన తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్– 15048), కేఎన్‌ఎం 1638, జేజీఎల్ 27356 అందుబాటులో ఉంచారు.
⇒ ఇక దొడ్డు రకాలైన ఎంటీయూ–1010, జేజీఎల్– 24423, కేఎన్‌ఎం–118, ఆర్‌ఎన్‌ఆర్–29,325 రకాలను అందుబాటులో ఉంచింది. రైతు వద్దకే విత్తనాలు, సంస్థ కౌంటర్లలో 6 శాతం డిస్కౌంట్ ఈ సీజన్ నుంచే ప్రారంభిస్తున్నట్టు చైర్మన్ అన్వేష్‌రెడ్డి చెప్పారు. వరి విత్తనాలతోపాటు శనగ, వేరుశనగ, పెసర మొదలైన విత్తనాలను కూడా సంస్థ అందుబాటులో ఉంచింది.
రైతుల అవగాహన కోసం సమావేశాలు
విత్తనాల పట్ల రైతుల్లో ఉన్న సందేహాల ను తొలగించడం, ప్రైవేట్ కంపెనీల దందాకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా విత్తనా భివృద్ధి సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా చైర్మన్ అన్వే‹Ùరెడ్డి సహకార సంఘాల చైర్‌పర్సన్లు, సీఈఓలతో ఆదిలాబాద్, జగిత్యా ల, మెదక్ జిల్లాల్లో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. మిగతా జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు నిర్వహించి రైతులను చైతన్యపరచాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment