
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పీహెచ్‌డీ పూర్తయింది. శుక్రవారం జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో ఆయన తన పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. వర్సిటీ వీసీ ఇన్‌ఛార్జి వీసీ జయేశ్‌రంజన్ పీహెచ్‌డీ పట్టాను డీజీపీ మహేందర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆన్‌లైన్ ద్వారా అధ్యక్ష ఉపన్యాసం చేశారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ ‘‘ఇంపాక్ట్ ఆఫ్ ఇనర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలిసింగ్’’ పురస్కారం పొందడం ఆనందంగా ఉందన్నారు. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంపై తాను పదేళ్లుగా అధ్యయనం చేస్తున్నానన్నారు. తన పీహెచ్‌డీ పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తన పరిశోధన తెలంగాణ పోలీసులకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment