పీహెచ్‌డీ విద్యార్థులకు 70 వేల ఫెలోషిప్‌ | 70,000 Fellowship for PhD students | Sakshi
Sakshi News home page

పీహెచ్‌డీ విద్యార్థులకు 70 వేల ఫెలోషిప్‌

Published Sun, Aug 20 2017 3:05 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

పీహెచ్‌డీ విద్యార్థులకు 70 వేల ఫెలోషిప్‌ - Sakshi

పీహెచ్‌డీ విద్యార్థులకు 70 వేల ఫెలోషిప్‌

కోల్‌కతా: ఐఐటీ, ఐఐఎస్‌సీలో పీహెచ్‌డీలు చేసే పరిశోధకులకు నెలకు రూ. 70వేలు ఫెలోషిప్‌లు ఇవ్వనున్నట్లు కేంద్ర ఉన్నత విద్య సెక్రటరీ కేవల్‌ కుమార్‌ శర్మ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరిగిన 67వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఫెలోషిప్‌ స్కీమ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఆర్థిక పరమైన కారణాల వల్లే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తుతున్నారని అటువంటి వారు స్వదేశంలోనే ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధకులకు ఐదేళ్ల పాటు ప్రతి నెలా రూ.70 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ త్వరలోనే ఆమోదం తెలపనుందని, వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఫెలోషిప్‌లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement