హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అక్రమాలను నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో గురువారం ఏర్పాటుచేసిన పీహెచ్‌డీ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు (3న) ఓయూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి పోలీసులను తొలగించాలని, పీహెచ్‌డీ సీట్ల కేటాయింపు, జాబితా విడుదలపై విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ప్రొఫెసర్లను తొలగించాలని, రిజర్వేషన్లు పాటించాలని, పీహెచ్‌డీ అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 20% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పీహెచ్‌డీ సాధన సమితి నాయకులు తెలిపారు.