న్యూఢిల్లీ: విద్యా రుణాల విభాగం హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాను క్రిస్‌క్యాపిటల్ తదితర పీఈ దిగ్గజాల కన్సార్షియంకు విక్రయించినట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. కంపెనీలో 90 శాతం వాటాను రూ. 9,060 కోట్లకు విక్రయించినట్లు వెల్లడించింది. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో విలీనం నేపథ్యంలో విద్యా రుణాల సంస్థను హెచ్‌డీఎఫ్‌సీ విక్రయించింది.
బీపీఈఏ ఈక్యూటీ, క్రిస్‌క్యాపిటల్ ఇన్వెస్టర్ల కన్సార్షియంకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం తాజాగా తెలియజేశాయి. దేశ, విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్ధులకు రుణాలందించే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాలో 9.99% వాటాను కొనసాగించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment