హ్యారీపోటర్ కుర్చీకి కోట్లలో డిమాండ్! | 'Harry Potter' Author's Chair Sells For $394,000 In New York | Sakshi
Sakshi News home page

హ్యారీపోటర్ కుర్చీకి కోట్లలో డిమాండ్!

Published Thu, Apr 7 2016 12:12 PM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

హ్యారీపోటర్ కుర్చీకి కోట్లలో డిమాండ్! - Sakshi

హ్యారీపోటర్ కుర్చీకి కోట్లలో డిమాండ్!

న్యూయార్క్: పురాతన, చారిత్రక నాణేలు, వస్తువులు, అపురూప చిత్రాలు, వజ్రాలు ఇలా కొన్ని ప్రత్యేక వస్తువులు వేలం పాటలో వేలు, లక్షల కోట్ల రూపాయల ధర పలకడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు కేవలం ఓ చెక్క కుర్చీ కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అయితే దాని వెనుక ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని అలరించి, వేలాది కోట్ల రూపాయలు వసూలు చేసిన హ్యారీపోటర్ కథ ఉంది. అందుకే ఆ కుర్చీ అంత ధర పలికింది.  

హ్యారీపోటర్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులను ఆకట్టుకున్న బ్రిటిష్ రచయిత జెకె రోలింగ్ వాడిన కుర్చీ వేలంలో 2 కోట్ల 63 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. రోలింగ్ ఆ కుర్చీలోనే కూర్చొని హ్యారీపోటర్ లోని మొదటి రెండు వ్యాల్యూమ్ లు రాయడమే ఆ కుర్చీకి అంత డిమాండ్ రావడానికి కారణం.  రోలింగ్ కు ఆమె తల్లి 1930 శకం నాటి ఓ మిస్ మ్యాచ్ కుర్చీని (ఇంట్లోని నాలుగు సరిపోలని కుర్చీల్లో ఒకదాన్ని) బహుమతిగా ఇచ్చిందట.  న్యూయార్క్ లో నిర్వహించిన వేలంలో ఇప్పుడా ఓక్ కుర్చీ 2 కోట్ల 63 లక్షల రూపాయల ధర పలికినట్లు హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏభై ఏళ్ళ వయసున్న రచయిత రోలింగ్ 1997, 1998 ల్లో ప్రచురితమైన  'హ్యారీపోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్', 'హ్యారీపోటర్ అండ్ ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్'  రెండు సిరీస్ ను ఆ కుర్చీలోనే కూర్చొని రాసిందట. కుర్చీని ఆక్షన్ కు ఇచ్చిన రోలింగ్ తాను టైప్ రైటర్ ముందు కూర్చొనేందుకు అదే కుర్చీని వాడానని, నా రచనలకు ఆ కుర్చీ ఎంతో సహాయపడిందని తెలుపుతూ కుర్చీతోపాటు ఓ లేఖను కూడ రాసి ఇచ్చినట్లు ఆక్షన్ హౌస్ తెలిపింది.

అయితే ఎంతో గుర్తుగా ఉన్న ఆ కుర్చీని వీడేందుకు చాలా బాధ అనిపించినా దాని అమ్మకం వెనుక అంతకంటే ప్రముఖమైన కారణం ఉందని తెలిపింది. గులాబీ, బంగారు, ఆకుపచ్చ రంగు పెయింట్ చేసిన పదాలతో అలంకరించిన ఆ కుర్చీని 2002 లో నేషనల్ సొసైటీకి విరాళంగా ఇచ్చినట్లు ఆమె తెలిపింది.  మాంత్రిక జగతి, పురాణాలతో కూడిన పిల్లల సాహిత్యాన్నిరాసిన చరిత్ర  ఆ కుర్చీకి ఉందని, అందుకే  ఆ కుర్చీ అంతటి ప్రాముఖ్యతను పొందిందని ఆక్షన్ హౌస్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement