
Ashes- Steve Smith: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు... బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలతో పాటుగా
Ashes Australia Vs England 4th Test: ఆస్ట్రేలియా బ్యాటింగ్ మాస్ట్రో స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ చరిత్రలో 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్ వంటి దిగ్గజాలు ఉన్న ఎలైట్ గ్రూపులో చోటు దక్కించుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో మూడు వేలకు పైగా పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో ఆరో స్థానంలో.. అదే విధంగా ఆసీస్ ప్లేయర్ల జాబితాలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఇన్నింగ్స్‌తో ఈ ఫీట్ అందుకున్నాడు. స్మిత్ కంటే ముందు వరుసలో సర్ బ్రాడ్‌మన్(5028), హోబ్స్(3636), అలెన్ బోర్డర్(3222), స్టీవ్ వా(3173), గోవర్(3037) ఉన్నారు. కాగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 67, రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులతో యాషెస్ సిరీస్‌లో 3002 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఐదో ఆటగాడిగా మరో రికార్డు
దీనితో పాటు మరో రికార్డును కూడా స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ మీద 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. బ్రాడ్‌మన్(5028), బోర్డర్(3548), గ్యారీ సోబర్స్(3214), స్టీవ్ వా(3200) తర్వాత స్టీవ్ స్మిత్ ఈ ఘనత సాధించాడు.
చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వరుస సెంచరీలు.. యాషెస్‌లో అన్‌స్టాపబుల్ ఖవాజా!
Shot! Smith smacks Wood over the square leg boundary #Ashes pic.twitter.com/shPqKb39xu
— cricket.com.au (@cricketcomau) January 8, 2022