మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ(జూన్ 16న) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. యాషెస్ ట్రోపీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద ఉండగా.. 2015 తర్వాత మళ్లీ యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది.
బజ్‌బాల్‌తో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను.. ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిష్టాత్మక సిరీస్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు వికెట్లతో బౌలర్లు చెలరేగితే.. మరోపక్క బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకోవాలని చూస్తుంటారు. ఆసీస్ త్రయం స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రెవిస్ హెడ్ సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ చరిత్రలో పరుగుల వరద పారించి టాప్-10 క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం.
డాన్ బ్రాడ్‌మన్:
ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్ సిరీస్‌లో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో 37 టెస్టులాడిన బ్రాడ్‌మన్ 5028 పరుగులు సాధించాడు. ఈ దిగ్గజం చేసిన 10వేల పరుగుల్లో సగం పరుగులు యాషెస్ సిరీస్‌లోనే వచ్చాయంటే బ్రాడ్‌మన్ ఎంత కసితో ఆడాడో అర్థమవుతుంది. 90 సగటుతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్‌మన్ 1930లో జరిగిన సిరీస్‌లో ఏకంగా 974 పరుగులు సాధించాడు. ఇప్పటికి ఇదే అత్యధికంగా ఉంది.
జాక్ హబ్స్:
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన జాక్ హబ్స్ యాషెస్‌లో 41 టెస్టులాడి 3636 పరుగులు సాధించాడు. 12 సెంచరీలు బాదిన జాన్ హబ్స్ బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
అలెన్ బోర్డర్:
ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్‌కు కూడా యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. 28 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్ 55.55 సగటుతో 3222 పరుగులు చేశాడు.
స్టీవ్ వా:
ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు కూడా యాషెస్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసిన స్టీవ్ వా 3143 పరుగులు సాధించాడు. ఆసీస్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు యాషెస్‌లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండుసార్లు యాషెస్ ట్రోపీని నెగ్గడంతో పాటు అతని కెప్టెన్సీలో యాషెస్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయాలు అందుకోవడం విశేషం.
స్టీవ్ స్మిత్:
ప్రస్తుతం బ్రాడ్‌మన్ రికార్డును అందుకోగల సత్తా కేవలం స్టీవ్ స్మిత్‌కు మాత్రమే ఉంది. ఈ శకంలో బెస్ట్ టెస్టు క్రికెటర్‌గా పేరు పొందిన స్మిత్ యాషెస్‌లో 32 టెస్టుల్లో 3044 పరుగులు బాదాడు. తాజాగా జరగనున్న సిరీస్‌లో స్టీవ్‌స్మిత్ కీలకం కానున్నాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లకు తలనొప్పిగా తయారయ్యాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం.
డేవిడ్ గోవర్
ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ గోవర్ యాషెస్‌లో 38 టెస్టులాడి 3037 పరుగులు చేశాడు.
వాలీ హామండ్:
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాలీ హామండ్ 33 టెస్టుల్లోనే 3852 పరగులు సాధించాడు.
హెర్బర్ట్ సట్‌క్లిఫ్
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 27 టెస్టుల్లోనే 2741 పరుగులు సాధించాడు.
క్లిమెంట్ హిల్:
ఆస్ట్రేలియా క్రికెటర్ క్లిమెంట్ హిల్ 41 టెస్టుల్లో 2660 పరుగులు సాధించాడు.
జాన్ హెడ్రిచ్:
ఇంగ్లండ్‌కు చెందిన జాన్ హెడ్రిచ్ యాషెస్‌లో 32 మ్యాచ్‌లాడి 2644 పరుగులు సాధించాడు.
చదవండి: ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment