Allan Border
-
IND VS AUS 3rd Test: అలెన్ బోర్డర్ రికార్డును సమం చేసిన విరాట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ అలెన్ బోర్డర్ రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్కీపర్ల జాబితాలో బోర్డర్, విరాట్ సమానంగా నిలిచారు. అలెన్ బోర్డర్ తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై 71 క్యాచ్‌లు పట్టగా.. విరాట్, ఆసీస్‌పై అన్నే క్యాచ్‌లు పట్టాడు. ఈ విభాగంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ టాప్‌లో ఉన్నాడు. స్మిత్.. ఇంగ్లండ్‌పై 76 క్యాచ్‌లు పట్టాడు. స్మిత్ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్ధనే ఉన్నాడు. జయవర్ధనే ఇంగ్లండ్‌పై 72 క్యాచ్‌లు పట్టాడు. స్మిత్, జయవర్ధనే తర్వాతి స్థానాల్లో అలెన్ బోర్డర్, విరాట్ కోహ్లి ఉన్నారు. ఆసీస్‌తో మూడో టెస్ట్‌లో మిచెల్ మార్ష్ క్యాచ్ పట్టడంతో విరాట్.. బోర్డర్ రికార్డును సమం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్‌కు ఇది మూడో క్యాచ్. మార్ష్ క్యాచ్‌కు ముందు విరాట్ మెక్‌స్వీని, లబూషేన్ క్యాచ్‌లు పట్టాడు. ఈ రెంటిలో లబూషేన్ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.టెస్ట్‌ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు..స్టీవ్ స్మిత్-76 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)మహేళ జయవర్ధనే-72 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)విరాట్ కోహ్లి-71 క్యాచ్‌లు (ఆస్ట్రేలియాపై)అలెన్ బోర్డర్-71 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)ఇదిలా ఉంటే, భారత్‌తో మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (101), ట్రవిస్ హెడ్ (152) సెంచరీలతో కదంతొక్కారు. అలెక్స్ క్యారీ (45), మిచెల్ స్టార్క్ (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌దే పైచేయి.. ఆసీస్‌కు మరోసారి సవాల్?
ప్రపంచ క్రికెట్లో యాషెష్ తర్వాత అంత్యంత టెస్టు రైవలరీ ఏదైనా ఉందంటే అది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే. ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రతీ రెండేళ్లకు ఓ సారి జరిగే ఈ రెడ్ బాల్ సమరానికి సమయం అసన్నమైంది. నువ్వా నేనా అన్నట్టుగా సాగే ఈ పోటీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమయ్యాయి. భారత జట్టు అయితే 12 రోజుల ముందుగానే ఆసీస్ గడ్డపై అగుడుపెట్టి తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ సిరీస్ భారత్ చాలా కీలకం. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే టీమిండియా ఈ టెస్టు సిరీస్‌ను 4-1 తప్పకగెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ హిస్టరీపై ఓ లుక్కేద్దాం.1996లో మొదలై..భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు క్రికెట్ జర్నీ 1947లో మొదలైంది. లాలా అమర్నాథ్ సారథ్యంలో భారత జట్టు తొలిసారిగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. మొట్టమొదటి సిరీస్‌ను కంగారులు 4-0 తేడాతో సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1947 నుండి 1992 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య 50 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి.అయితే 1996లో భారత క్రికెట్ బోర్డు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా మాజీ సారథి అలన్ బోర్డర్ల గౌరవర్ధం ఓ సిరీస్ నిర్వహించాలని భావించాయి.దీంతో ఆసీస్-భారత్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ’గా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నామకరణం చేశాయి. అప్పటి నుంచి ఈ ట్రోఫీ విజయవంతంగా సాగుతోంది. కాగా గావస్కర్, అలెన్ బోర్డర్ వరల్డ్ టెస్టు క్రికెట్లో తమదైన ముద్ర వేసుకున్నారు. వీరిద్దరూ టెస్టుల్లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసి తమ జట్లకు ఎన్నో అద్బుత విజయాలు అందించారు.మనదే పైచేయి..బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్‌పై భారత్‌దే పైచేయిగా కొనసాగుతోంది. ఈ ట్రోఫీ కింద ఇప్పటివరకు మొత్తం 16 సిరీస్‌లు జరిగాయి. అందులో టీమిండియా 10 సార్లు విజేతగా నిలవగా.. ఆసీస్ ఐదు సిరీస్‌లను సొంతం చేసుకుంది. 2003–04 సిరీస్ మాత్రమే డ్రా అయింది. ఓవరాల్‌గా 1996 నుంచి ఇరు జట్ల మధ్య 57 టెస్టుల్లో జరిగాయి. అందులో టీమిండియా 24, ఆస్ట్రేలియా 21 విజయాలు సాధించింది. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.ఆసీస్ గడ్డపై సరికొత్త చరిత్ర..2018-19లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను టీమిండియా తమ ఖాతాలో వేసుకుంది. 71 ఏళ్లగా ఆసీస్ గడ్డపై ఊరిస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుని తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.ఆ తర్వాత 2021-22లో పర్యటనలో కూడా సత్తాచాటిన భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై మళ్లీ సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత రెండు పర్యాయాలు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించిన టీమిండియా ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌పై వేటు -
లెఫ్టాండర్స్ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!
క్రికెట్లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్క్రిస్ట్లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. కెప్టెన్‌గా ఆసీస్ లెజెండ్ ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలెన్ బోర్డర్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్‌గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్‌క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్‌రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు. అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్‌ను సెలక్ట్ చేశాడన్నమాట!చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ -
ప్రపంచంలో ఏకైక పురుష క్రికెటర్‌గా రోహిత్ ఆల్‌టైమ్ రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో 150వ మ్యాచ్ పూర్తి చేసుకున్న తొలి పురుష క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అఫ్గనిస్తాన్‌తో ఇండోర్ వేదికగా రెండో టీ20 సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. మెన్స్ క్రికెట్లో షార్టెర్ట్ ఫార్మాట్లో తొలుత 150 మ్యాచ్‌ల మైలురాయి అందుకుంది రోహిత్ శర్మ కాగా... టెస్టుల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో తొలుత 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న క్రికెటర్లు 150 టెస్టులు: అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) (డిసెంబర్ 1993) 150 వన్డేలు: అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా) (ఫిబ్రవరి 1987) 150 టీ20లు: రోహిత్ శర్మ(ఇండియా) (జనవరి 2024)*. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ద్వారా రోహిత్ శర్మ దాదాపు 14 నెలల తర్వాత టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు. మొహాలీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ ఆదిలోనే రనౌట్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇండోర్ వేదికగా ఆదివారం(జనవరి 14) నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు 161 - హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్, 2009-2024) 152 - సుజీ బేట్స్ (న్యూజిలాండ్, 2007-2023) 151 - డానీ వ్యాట్ (ఇంగ్లాండ్, 2010-2023) 150 - అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా, 2010-2024) 150 - రోహిత్ శర్మ (భారత్, 2007-2024)* -
వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడినట్లుగా అనిపిస్తుంది. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 5, ట్రెవిస్ హెడ్ 10 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆసీస్ బ్యాటింగ్‌లో మార్నస్ లబుషేన్ 21, స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీశారు. ఇక ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. అయితే మూడో టెస్టులో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో స్మిత్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. లీడ్స్ టెస్టులో 22 పరుగులు చేసిన స్మిత్ ఇప్పటివరకు 3226 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్(3222 పరుగులు)ను దాటిన స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్ కంటే ముందు జాక్ హాబ్స్(3636 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆస్ట్రేలియన్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్(5028 పరుగులు) ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక స్మిత్‌కు ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఆసీస్ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చిరకాలం గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్‌గా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే, సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంటుంది. స్మిత్ జట్టులోకి వచ్చాక ఆసీస్.. ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ గెలిచింది లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మిత్ అనుకుంటున్నాడు.కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన స్మిత్.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9113 పరుగులు చేశాడు. 100 seconds of Steve Smith gold, ahead of his 100th Test for Australia tonight! #Ashes pic.twitter.com/y1JbDt3k8t — cricket.com.au (@cricketcomau) July 6, 2023 చదవండి: భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?.. కోహ్లి, సచిన్, ధోనిలు కాదు! -
అరుదైన వ్యాధికి గురైన దిగ్గజ క్రికెటర్..సెంచరీ కొట్టలేనని భావోద్వేగ ప్రకటన
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ తాను ‘పార్కిన్సన్స్’ వ్యాధితో బాధపడుతున్నట్లు మొదటిసారి ప్రకటించాడు. తాను ఏడేళ్ల క్రితం దీనికి గురయ్యానని, అయితే ఎవరూ తనపై జాలి చూపించరాదని ఇప్పటి వరకు చెప్పలేదన్నాడు. నాడీ వ్యవస్థపై ప్రభావం పడే కారణంగా శారీరక కదలికలు సాధారణంగా లేకపోవడం ఈ వ్యాధి లక్షణం. ‘ఇది తెలిస్తే జనం ఎలా స్పందిస్తారో తెలీదు. బాధపడతారా లేదా ఓదారుస్తారా చెప్పలేం. అయితే ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నా’ అని బోర్డర్ వెల్లడించాడు. 68 ఏళ్ల బోర్డర్ తాను 80 ఏళ్లు జీవించగలిగితే అదే చాలా గొప్పగా భావిస్తానని, మరో ‘సెంచరీ’ సాధించలేనని మాత్రం కచ్చితంగా చెప్పగలనని భావోద్వేగంతో అన్నాడు. 156 టెస్టుల్లో 11,174 పరుగులు... 273 వన్డేల్లో 6524 పరుగులు చేసిన అలెన్ బోర్డర్ రెండు ఫార్మాట్లలో కలిపి 30 సెంచరీలు, 99 అర్ధసెంచరీలు సాధించాడు. అతని నాయకత్వంలోనే ఆ్రస్టేలియా 1987లో తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది. -
యాషెస్ సమరం.. పరుగుల వరద పారించిన టాప్-10 బ్యాటర్లు
మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ(జూన్ 16న) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. యాషెస్ ట్రోపీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద ఉండగా.. 2015 తర్వాత మళ్లీ యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది. బజ్‌బాల్‌తో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను.. ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిష్టాత్మక సిరీస్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు వికెట్లతో బౌలర్లు చెలరేగితే.. మరోపక్క బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకోవాలని చూస్తుంటారు. ఆసీస్ త్రయం స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రెవిస్ హెడ్ సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ చరిత్రలో పరుగుల వరద పారించి టాప్-10 క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం. డాన్ బ్రాడ్‌మన్: ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్ సిరీస్‌లో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో 37 టెస్టులాడిన బ్రాడ్‌మన్ 5028 పరుగులు సాధించాడు. ఈ దిగ్గజం చేసిన 10వేల పరుగుల్లో సగం పరుగులు యాషెస్ సిరీస్‌లోనే వచ్చాయంటే బ్రాడ్‌మన్ ఎంత కసితో ఆడాడో అర్థమవుతుంది. 90 సగటుతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్‌మన్ 1930లో జరిగిన సిరీస్‌లో ఏకంగా 974 పరుగులు సాధించాడు. ఇప్పటికి ఇదే అత్యధికంగా ఉంది. జాక్ హబ్స్: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన జాక్ హబ్స్ యాషెస్‌లో 41 టెస్టులాడి 3636 పరుగులు సాధించాడు. 12 సెంచరీలు బాదిన జాన్ హబ్స్ బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అలెన్ బోర్డర్: ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్‌కు కూడా యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. 28 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్ 55.55 సగటుతో 3222 పరుగులు చేశాడు. స్టీవ్ వా: ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు కూడా యాషెస్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసిన స్టీవ్ వా 3143 పరుగులు సాధించాడు. ఆసీస్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు యాషెస్‌లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండుసార్లు యాషెస్ ట్రోపీని నెగ్గడంతో పాటు అతని కెప్టెన్సీలో యాషెస్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయాలు అందుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్: ప్రస్తుతం బ్రాడ్‌మన్ రికార్డును అందుకోగల సత్తా కేవలం స్టీవ్ స్మిత్‌కు మాత్రమే ఉంది. ఈ శకంలో బెస్ట్ టెస్టు క్రికెటర్‌గా పేరు పొందిన స్మిత్ యాషెస్‌లో 32 టెస్టుల్లో 3044 పరుగులు బాదాడు. తాజాగా జరగనున్న సిరీస్‌లో స్టీవ్‌స్మిత్ కీలకం కానున్నాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లకు తలనొప్పిగా తయారయ్యాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. డేవిడ్ గోవర్ ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ గోవర్ యాషెస్‌లో 38 టెస్టులాడి 3037 పరుగులు చేశాడు. వాలీ హామండ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాలీ హామండ్ 33 టెస్టుల్లోనే 3852 పరగులు సాధించాడు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 27 టెస్టుల్లోనే 2741 పరుగులు సాధించాడు. క్లిమెంట్ హిల్: ఆస్ట్రేలియా క్రికెటర్ క్లిమెంట్ హిల్ 41 టెస్టుల్లో 2660 పరుగులు సాధించాడు. జాన్ హెడ్రిచ్: ఇంగ్లండ్‌కు చెందిన జాన్ హెడ్రిచ్ యాషెస్‌లో 32 మ్యాచ్‌లాడి 2644 పరుగులు సాధించాడు. చదవండి: ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
BGT 2023: పుజారా ఖాతాలో చెత్త రికార్డు.. రెండో భారత బ్యాటర్‌గా!
India vs Australia, 2nd Test- Cheteshwar Pujara: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కెరీర్లో వందో టెస్టును మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలని భావించిన అతడిని దురదృష్టం వెక్కిరించింది. కాగా ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన పుజారాకు ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా వందో టెస్టు ఆడే అవకాశం వచ్చింది. సముచిత గౌరవం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆసీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌కు ఎంపికైన పుజారా.. ఢిల్లీ మ్యాచ్ ద్వారా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’ ద్వారా అతడికి సముచిత గౌరవం ఇచ్చారు. అదే విధంగా బీసీసీఐ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ చేతుల మీదుగా ఈ నయావాల్‌కు ప్రత్యేక క్యాప్‌ను అందించింది. ఇక పుజారా కెరీర్లో అరుదైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అతడి కుటుంబం మొత్తం ఢిల్లీకి చేరుకుంది. అతడి బ్యాటింగ్‌ను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూసింది. రెండో భారత బ్యాటర్‌గా కానీ వాళ్లతో పాటు అభిమానులను పుజారా నిరాశపరిచాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్‌కు వికెట్ సమర్పించుకుని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పుజారా ఖాతాలో చెత్త రికార్డు చేరింది. టెస్టు క్రికెట్లో కొంతమందికి మాత్రమే లభించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ (వందో టెస్టు).. కీలకమైన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన ఎనిమిదో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. రెండో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. వందో టెస్టులో డకౌట్ అయిన క్రికెటర్లు వీరే ►దిలీప్ వెంగ్‌సర్కార్(ఇండియా) ►అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) ►కర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) ►మార్క్ టేలర్(ఆస్ట్రేలియా) ►స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్) ►బ్రెండన్ మెకల్లమ్(న్యూజిలాండ్) ►అలిస్టర్ కుక్(ఇంగ్లండ్) ►ఛతేశ్వర్ పుజారా(ఇండియా) చదవండి: IND vs AUS: చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్.. నో అంటున్నా.. బాగా ఆడితే మాకేంటి? ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు -
భారత్‌తో రెండో టెస్టు.. 7 వికెట్ల స్పిన్నర్‌కు నో ఛాన్స్!
ఢిల్లీ వేదికగా భారత్‌తో రెండో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. తొలి టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ సమం చేయాలాని కమ్మిన్స్ సేన భావిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. ఇక కీలకమైన రెండో టెస్టు కోసం ఆసీస్ తుది జట్టును ఆ దేశ క్రికెట్ దిగ్గజం అలన్ బోర్డర్ అంచనా వేశాడు. అయితే మొదటి టెస్ట్‌లో 7 వికెట్లతో చెలరేగిన టాడ్ మర్ఫీకి తను ఎంపిక చేసిన జట్టులో అలన్ బోర్డర్ చోటివ్వకపోవడం గమనార్హం. మర్ఫీ తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఇక గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు బోర్డర్ తన ప్లేయింగ్‌లో అవకాశం ఇచ్చాడు. అదే విధంగా తొలి టెస్టులో దారుణంగా విఫలమైన మాట్ రెన్షా, స్కాట్ బోలాండ్‌ను కూడా బోర్డర్ ఎంపిక చేయలేదు. రెన్షా స్థానంలో ట్రావిస్ హెడ్‌కు ఆయన ఛాన్స్ ఇచ్చారు. భారత్‌తో రెండో టెస్టుకు అలన్ బోర్డర్ ఎంచకున్న ఆసీస్ జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్ చదవండి: IND vs AUS: 36 ఏళ్లుగా భారత్ చెక్కుచెదరని రికార్డు.. ఆస్ట్రేలియా బ్రేక్ చేస్తుందా? -
‘ఐపీఎల్‌కు వెళ్లకుండా ఆపండి’
మెల్బోర్న్: ఫ్రాంచైజీ క్రికెట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్. అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కావాల్సిన ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా, ఆ సమయంలోనే ఐపీఎల్‌ను బీసీసీఐ నిర్వహించింది. దీనిని తీవ్రంగా తప్పుబట్టాడు బోర్డర్. ప్రపంచస్థాయి గేమ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఐపీఎల్ వంటి లీగ్స్‌కు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు మేల్కోనాల్సిన అవసరం ఉందన్నాడు. ఆటగాళ్లను ఐపీఎల్‌కు వెళ్లకుండా ఆపాలని డిమాండ్ చేశాడు. తొలి ప్రాధాన్యత ఏదనే విషయం అందరికీ తెలిసినా, ఇక్కడ డబ్బు మాయలో అంతా పడిపోతున్నారన్నాడు. ఇది మంచి పరిణామం కాదని బోర్డర్ విమర్శించాడు. (వేరే జట్లకు చేయగలడా.. ఆ అవసరం నాకు లేదు: రోహిత్) లోకల్ టోర్నీల కంటే వరల్డ్ గేమ్స్‌కే ప్రాముఖ్యత ఇవ్వాలన్నాడు. ఈ విషయంలో బోర్డులు ఆటగాళ్లను కట్టడి చేయాల్సిన ఇక నుంచైనా చేయాలన్నాడు. ఇక కోహ్లి వంటి దూకుడైన ఆటగాళ్లు, టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి క్రికెట్ జట్లు టెస్టు క్రికెట్‌ను బ్రతికించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. పెరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి టెస్టు క్రికెట్‌ను కాపాడాలని బోర్డర్ విన్నవించాడు.గత నెలలో బీసీసీఐపై బోర్డర్ విమర్శలు చేశాడు. బీసీసీఐ ఎప్పుడూ మైండ్ గేమ్ ఆడుతూ తమకు అనువుగా ప్రణాళికను ప్లాన్ చేసుకుంటుందని విమర్శించాడు. టీ20 వరల్డ్‌కప్ స్థానంలో ఐపీఎల్ నిర్వహించడంతో బోర్డర్ మండిపడ్డాడు. వరల్డ్ క్రికెట్లో తాము శక్తివంతులమని బీసీసీఐ భావిస్తోందని, ఆర్థికంగా బలంగా ఉన్నా విషయాల్లో కచ్చితత్వం అనేది అవసరమని బోర్డర్ పేర్కొన్నాడు. -
‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’
సిడ్నీ: సమయం దొరికినప్పుడల్లా భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ)పై విరుచుకుపడే ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్.. మరొకసారి ధ్వజమెత్తాడు. గతంలో ఐపీఎల్ కంటే టీ20 వరల్డ్‌కప్‌కే తన తొలి ప్రాధాన్యత అని బీసీసీఐ వైఖరిని తప్పుబట్టిన బోర్డర్.. ఈసారి టీమిండియా మైండ్‌గేమ్ ఆడుతోందని విమర్శించాడు. ఎప్పట్నుంచో తమ సాంప్రదాయంగా నిర్వహిస్తున్న న్యూఇయర్ టెస్టు మ్యాచ్ విషయంలో మార్పులు చేయాలని బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరడంపై మండిపడ్డాడు. ఇది సరైన వైఖరి కాదంటూ బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. ఇక్కడ బీసీసీఐ మైండ్ గేమ్‌కు తెరలేపిందన్నాడు.ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కోవిడ్-19 కారణంగా రద్దు చేసుకున్న టీమిండియాకు ఆ తర్వాత ఇదే అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్. (చదవండి: అతను చాలా డేంజరస్ ప్లేయర్: సచిన్) ఈ నెలలో టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కావాల్సిన ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఆ ప్లేస్‌లో ఐపీఎల్‌ను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఇప్పుడు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆసీస్‌తో జనవరి 3వ తేదీ నుంచి ఆరంభం కావాల్సి ఉన్న న్యూఇయర్ టెస్టు మరింత వెనక్కి జరపాలని బీసీసీఐ కోరింది. జనవరి 7వ తేదీ నుంచి ఆ టెస్టును నిర్వహించాలని బీసీసీఐ తన విజ్ఞప్తిలో పేర్కొంది అయితే దీనిపై బోర్డర్ విరుచుకుపడ్డాడు. ఒక పర్యటనకు ముందు బీసీసీఐ ఇలా కోరడం మైండ్ గేమ్ కాకపోతే ఏంటని ప్రశ్నించాడు. బాక్సింగ్ డే టెస్టు, న్యూ ఇయర్ టెస్టు అనేది తమకు ఎప్పట్నుంచో వస్తున్న సాంప్రదాయమని గుర్తు చేశాడు. మరి న్యూఇయర్ టెస్టును రీ షెడ్యూల్ చేయాలని కోరడం వెనక కారణం ఏమిటని నిలదీశాడు. తమ దేశానికి పర్యటనకు వచ్చే ముందు ఇలా మైండ్ గేమ్ ఆడతారా అంటూ బీసీసీఐని విమర్శించాడు. వరల్డ్ క్రికెట్లో తాము శక్తివంతులమని బీసీసీఐ భావిస్తోందని, ఆర్థికంగా బలంగా ఉన్నా విషయాల్లో కచ్చితత్వం అనేది అవసరమని బోర్డర్ పేర్కొన్నాడు. నవంబర్ చివరి వారంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. డిసెంబర్-3వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.(చదవండి: డైలమాలో సన్‌రైజర్స్!) -
టి20 వరల్డ్‌కప్‌కే నా ప్రాధాన్యత: బోర్డర్
మెల్బోర్న్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కేవలం డబ్బుకు సంబంధించిన వ్యవహారమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అన్నారు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ జరుగనుండగా... ఐపీఎల్‌కు అంతగా ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆసీస్ వేదికగా అక్టోబర్–నవంబర్‌లో జరగాల్సిన వరల్డ్‌కప్ వాయిదా పడితే, దాని స్థానంలో ఐపీఎల్ జరిగే అవకాశముందని వస్తోన్న వార్తలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆ వార్తలతో నేను సంతోషంగా లేను. స్థానిక టోర్నీ అయిన ఐపీఎల్ కన్నా ఐసీసీ ఈవెంట్ వరల్డ్‌కప్‌నకే అధిక ప్రాధాన్యత లభించాలి. ప్రపంచకప్ జరిగే పరిస్థితే లేనప్పుడు లోకల్ టోర్నీని ఎలా నిర్వహిస్తారు. ఐపీఎల్ కేవలం డబ్బుకు సంబంధించినది. ఐపీఎల్‌కు సిద్దమయ్యే ఆటగాళ్లను ఆయా దేశాల బోర్డులు అడ్డుకోవాలి’ అని బోర్డర్ అభిప్రాయపడ్డారు. -
ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్ నిర్వహిస్తారా?
మెల్బోర్న్ : స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా టి20 ప్రపంచకప్‌ను నిర్వహించవచ్చంటూ వస్తున్న కొన్ని ప్రతిపాదనలపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ విస్మయం వ్యక్తం చేశాడు. కోవిడ్–19 కారణంగా టోర్నీ నిర్వహణ సమస్యగా మారడంతో టీవీ ప్రేక్షకుల కోసమే మ్యాచ్‌లు జరపాలంటూ కొందరు చేసిన సూచనలపై అతను తీవ్రంగా స్పందించాడు. ‘ఖాళీ స్టేడియాల్లో ప్రపంచ కప్ ఆడటాన్ని నేను అసలు ఊహించలేను. అసలు ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టోర్నీతో సంబంధం ఉన్నవారంతా దేశం మొత్తం తిరుగుతూ ఆడవచ్చు. కానీ అభిమానులకు మాత్రం అనుమతి ఉండదా. నాకు తెలిసి ఇది జరిగే అవకాశం లేదు. కరోనా బాధ తగ్గి అంతా సాధారణంగా మారిన తర్వాత దీనిని నిర్వహించండి లేదా దీనిని ప్రస్తుతానికి రద్దు చేసి అవకాశం ఉన్న మరో తేదీల్లో సర్దుబాటు చేయండి’ అని బోర్డర్ సూచించాడు. విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులే రానప్పుడు వరల్డ్ కప్ జరుగుతోందని చెబితే ఎవరూ నమ్మరని, తనకు తెలిసి ఇది సాధ్యమయ్యే పని కాదని అతను అన్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు సుమారు 6,400 మంది కరోనా బారిన పడగా, 61 మంది చనిపోయారు. -
‘ధోనిని అధిగమించాడు.. బోర్డర్ సరసన చేరాడు’
ఇండోర్: ‘వేదిక ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. ఫలితం ఒకటే.. రిజల్ట్ రిపీట్.. హిస్టరీ క్రియేట్’ప్రస్తుతం టీమిండియా టెస్టు విజయాల పరంపరం చూస్తుంటే ప్రతీ ఒక్కరూ ఇదే అనుకుంటున్నారు. తాజాగా రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 230 పరుగుల తేడాతో కోహ్లి సేన మరో అపూర్వ విజయం సాధించింది. ఈ భారీ విజయంతో సారథిగా కోహ్లి పలు ఘనతలను అందుకున్నాడు. ఎక్కువ ఇన్నింగ్స్ విజయాలను సాధించిన తొలి టీమిండియా సారథిగా ధోని రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. గతంలో ధోని కెప్టెన్సీలోని టీమిండియా 9 ఇన్నింగ్స్ విజయాలను సాధించగా.. ప్రస్తుతం కోహ్లి సారథ్యంలో ఇప్పటివరకు పది టెస్టు ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేసింది. ఈ జాబితాలో అజారుద్దీన్(8), సౌరవ్ గంగూలీ(7) తరవాతి స్థానాల్లో ఉన్నారు. ఇక సారథిగా అత్యధిక విజయాలను సాధించడంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలెన్ బోర్డర్ సరసన కోహ్లి చేరాడు. కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 32 టెస్టు విజయాలను నమోదు చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్(53), ఆసీసీ మాజీ సారథలు రికీ పాంటింగ్(48), స్టీవ్ వా(41)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక వరుసగా ఆరు టెస్టుల్లో విజయాలు సాధించడంతో టీమిండియాకు ఇది రెండో సారి. గతంలో 2013లో ధోని సారథ్యలో( ఆసీస్‌పై 4, విండీస్‌పై 2) భారత్ వరుసగా ఆరు టెస్టు విజయాలను నమోదు చేసింది. ఇక తాజాగా కోహ్లి సారథ్యంలో విండీస్‌పై 2, దక్షిణాఫ్రికాపై 3, ప్రస్తుతం బంగ్లాపై విక్టరీతో టీమిండియా వరుస టెస్టు విజయాల సంఖ్య ఆరుకు చేరింది. ఇక వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేయడం టీమిండియాకు ఇది మూడో సారి. గతంలో 1992-93, 93-94 మధ్య కాలంలో వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాలను టీమిండియా నమోదు చేసింది. ఇక ఇదే ఊపులో రెండో టెస్టులోనూ కోహ్లి సేన బంగ్లా పని పడితే మరెన్నో రికార్డులు టీమిండియా పేరిట లిఖించబడటం ఖాయంగా కనిపిస్తోంది. -
‘అప్పటికీ భయపడుతూనే ఉన్నా’
సిడ్నీ: వన్డే వరల్డ్‌కప్‌లో అసలు సిసలు సమరానికి వచ్చేసరికి ఆసీస్ తేలిపోవడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ ఆవేదన వ్యక్తం చేశాడు. కీలక సమయంలో ఆసీస్ ఒత్తిడిని జయించడంలో విఫలం కావడంతోనే మెగా టోర్నీని సెమీస్‌లోనే ముగించాల్సి వచ్చిందన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆసీస్ తొలి 10 ఓవర్ల వరకూ బాగానే ఆడినా తర్వాత మాత్రం వరుస వికెట్లు కోల్పోతూ రావడం ఘోర పరాజయంపై ప్రభావం చూపిందన్నాడు. ప్రధానంగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ షాట్ కొట్టి ఔటైన తీరును బోర్డర్ తప్పుబట్టాడు. ఆసీస్ కుదురుకుంటున్న సమయంలో క్యారీ అనవసరపు షాట్ కొట్టి పెవిలియన్ చేరడం ఆసీస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాడు. ‘సరైన సమయంలో ఇంగ్లండ్ జూలు విదిల్చింది. నేను భయపడుతున్నట్లుగానే నాకౌట్ సమరంలో ఇంగ్లండ్ సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో ప్రమాదమని నేను ముందు నుంచీ భయపడుతూనే ఉన్నా. నా భయమే నిజమైంది. ఇంగ్లండ్ సమిష్టిగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించింది. ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టి పైచేయి సాధించింది. ఈ టోర్నీలో ఆసీస్ ప్రదర్శన బాగానే ఉన్నప్పటికీ, సెమీస్‌లో మాత్రం తేలిపోయారు. ముఖ్యంగా అలెక్స్ క్యారీ షాట్‌ను విమర్శించకతప్పదు. ఆసీస్ గాడిలో పడుతున్న సమయంలో క్యారీ ఆ షాట్ కొట్టి ఔట్ అవ్సాల్సింది కాదు. క్యారీ క్రీజ్‌లో ఉండి ఉంటే ఆసీస్ 260-270 పరుగుల మధ్యలో స్కోరు చేసి ఉండేది. అప్పుడు ఆసీస్ కనీసం పోరాడటానికి చాన్స్ దొరికేది’ అని బోర్డర్ అన్నాడు. కాగా, ఇంగ్లండ్ సమిష్ట ప్రదర్శనపై బోర్డర్ ప్రశంసలు కురిపించాడు. అన్ని విభాగాల్లోనూ తాము ఏమిటో నిరూపించుకున్న ఇంగ్లండ్ విజయానికి అన్ని విధాల అర్హత ఉందన్నాడు. ఆసీస్‌పై ఇంగ్లండ్ సాధించిన విజయం అసాధారణమైనదిగా బోర్డర్ అభివర్ణించాడు. పెద్ద టోర్నీలో అది కూడా నాకౌట్లో ఇంగ్లండ్ నుంచి చాలా కాలం తర్వాత అతి పెద్ద ప్రదర్శన వచ్చిందన్నాడు. -
‘కప్ గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది’
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరుగుతన్న ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా అప్రతిహత విజయాలతో దూసుకపోతోంది. టీమిండియాతో మ్యాచ్ మినహా మిగిలిన మ్యాచ్‌ల్లో చాంపియన్ ఆటతో అబ్బురపరిచింది. దీంతో తాజాగా ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా ఆసీస్ నిలిచింది. దీంతో ఆసీస్ మాజీ ఆటగాళ్లతో పాటు ఆ జట్టు అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్‌పై విజయం అనంతరం ఆసీస్ మాజీ దిగ్గజ సారథి అలెన్ బోర్డర్ తమ జట్టు ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఆరు నెలల క్రితం ఆసీస్ జట్టును చూసి భయమేసింది. ఈ జట్టా ప్రపంచకప్‌లో పాల్గొనబోయేది అంటూ అసంతృప్తి కలిగింది. కానీ నా అంచనా తప్పయింది. తాజా ప్రపంచకప్‌లో ఆసీస్ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ చూశాక నాకు పాత ఆసీస్ జట్టు గుర్తొచ్చింది. అప్పటి రోజులు, జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆసీస్ ఈజ్ బ్యాక్ అని ధృఢంగా నమ్ముతున్నా. ప్రస్తుత ఆసీస్ జట్టుకు ప్రపంచకప్ గెలిచే సత్తా ఉంది. ఆటగాళ్లలో పరిణితి పెరగింది. పరిస్థితులను ఆకలింపు చేసుకుంటున్నారు. కివీస్ మ్యాచ్‌లో నన్ను ఎక్కువగా ఆకర్షించించిన ఆటగాళ్లు కీపర్ అలెక్స్ క్యారీ, పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్. టిమ్ పైన్, మాథ్యూ హెడ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉండగా అలెక్స్ ఎందకనీ అందరూ ప్రశ్నించారు. కానీ తన సత్తా ఏంటో ప్రపంచకప్‌లో నిరూపించాకుంటున్నారు. స్టార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత ప్రపంచకప్ హీరో.. తాజా టోర్నీలో కూడా తనేంటో నిరూపించుకుంటున్నాడు. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌తో పాటు ఇంగ్లండ్, భారత్‌లు టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తున్నాయి’అంటూ బోర్డర్ పేర్కొన్నాడు. -
‘భారత్‌తో ఆసీస్‌కు ముప్పే’
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు భారత్‌తో పెను సవాల్ ఎదురుకానుందని ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అన్ని జట్లకు భారత్ గట్టి ప్రత్యర్థి అనడంలో ఎటువంటి సందేహం లేదని, ఆసీస్ కూడా జాగ్రత్తగా ఆడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. భారత క్రికెట్ జట్టులో కొన్ని బలహీనతలున్నప్పటికీ ఆ జట్టుతో పోరు ఆసీస్‌కు చాలా పెద్ద చాలెంజ్ అని పేర్కొన్నాడు. ‘భారత్‌తో ఆసీస్‌కు ముప్పే. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ కాస్త ఇబ్బంది పడింది. దక్షిణాఫ్రికా బాగానే ఆడింది. కానీ సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయలేదు. భారత్ ఇన్నింగ్స్‌కు రోహిత్ శర్మ వెన్నెముకలా నిలిచాడు. భారత్‌కు కొన్ని బలహీనతలు ఉన్నాయి. కానీ రోహిత్, కోహ్లి, బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. భారత జట్టుతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు పెను సవాలు ఎదురుకానుంది’ అని చెప్పాడు. ఇక ప్రస్తుత టోర్నీలో ఏ జట్టు ఫేవరెట్ అనే విషయంలో బోర్డర్ సమాధానం దాటవేశాడు. ఇక్కడ ప్రతి జట్టూ ఇతర జట్టును ఓడించేలా కనిపిస్తోందని, ఏ జట్టూ తిరుగులేని ఫేవరెట్‌గా లేదని బోర్డర్ అన్నాడు. ఆదివారం భారత్-ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. -
‘అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చండి’
సిడ్నీ: ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఏడో స్థానంలో ఆడించడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాక్స్‌వెల్‌ను సరైన స్థానంలో ఆడించకుండా అతడి సేవల్ని వృథా చేస్తున్నారని విమర్శించాడు. సాధారణంగా మాక్స్‌వెల్‌ను సందర్భాన్ని బట్టి మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఆడిస్తుంటారు. టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో మాత్రం ఏడో స్థానంలో ఆడించారు. ఏడో స్థానంలో ఆడిన అతడు కేవలం ఐదు బంతుల్ని మాత్రమే ఎదుర్కొని అజేయంగా 11 పరుగులు చేశాడు. ‘భారత్‌తో తొలి వన్డేలో మ్యాక్వెల్ను ఏడో స్థానంలో ఆడించి అతని సేవల్ని వృథా చేసినట్లే అనిపించింది. ఇక ముందైనా అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చండి. మిడిల్ ఆర్డర్లో మ్యాక్స్‌వెల్ సేవల్ని వినియోగించుకోవాలి. ఆటలో పరిస్థితిని బట్టి మీకు మంచి ఆరంభం కావాలంటే అతడిని మూడో స్థానంలో ఆడించొచ్చు’ అని బోర్డర్ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా, ఆపై బ్యాటింగ్ చేసిన భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి పరాజయం చవిచూసింది. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. -
30 ఏళ్ల తరువాత వరల్డ్ కప్ పతకాలు..
సిడ్నీ:ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్‌కు సంబంధించిన పతకాలను ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆదివారం అందుకోనున్నారు. వన్డే వరల్డ్ కప్ ఆరంభమయ్యాక నాల్గో ఎడిషన్ టైటిల్‌ను ఆసీస్ తొలిసారి సాధించింది. 1987లో వన్డే వరల్డ్ కప్ టైటిల్ ను ఆసీస్ అందుకున్నా.. విజయంలో పాలు పంచుకున్న క్రికెటర్లకు పతకాలు అందలేదు. అప్పట్లో వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చే దేశ క్రికెట్ బోర్డుపైనే అంతా ఆధారపడేది. అప్పట్లో మెగా క్రికెట్ ఈవెంట్లలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉండేది కాదు. ఆ క్రమంలోనే ఆనాటి వరల్డ్ కప్ సాధించిన ఆసీస్ జట్టులో భాగస్వామ్యమైన క్రికెటర్లకు పతకాలు అందలేదు. 1987 వన్డే వరల్డ్ కప్‌ను భారత్-పాకిస్తాన్ జట్లు సంయుక్తంగా నిర్వహించాయి. అయితే వరల్డ్ కప్ విజయంలో భాగస్వామ్యమైన అప్పటి ఆసీస్ ఆటగాళ్లకు పతకాలను ఇవ్వాలని గతేడాది జూన్‌లో ఐసీసీ నిర్ణయించింది. ఆసీస్ ఆటగాళ్లతో పాటు, సహాయక సిబ్బందికి కూడా పతకాలను ఇచ్చేందుకు ఐసీసీ మొగ్గు చూపింది. ఈ మేరకు రేపు సిడ్నీలో పాకిస్తాన్ తో జరిగే నాల్గో వన్డే విరామ సమయంలో ఆసీస్ వెటరన్లు పతకాలను అందుకోనున్నారు. ఇలా ఐసీసీ ముందుకు రావడంపై ఆనాటి వరల్డ్ కప్ అందుకున్న కెప్టెన్ అలెన్ బోర్డర్ హర్షం వ్యక్తం చేశాడు. చాలా ఏళ్ల తరువాత తమకు ఈ తరహాలో గౌరవం అందడం ఎంతో గర్వంగా ఉందని బోర్డర్ పేర్కొన్నాడు.