India vs Australia, 2nd Test- Cheteshwar Pujara: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కెరీర్‌లో వందో టెస్టును మధుర జ్ఞాపకంగా మిగిల్చుకోవాలని భావించిన అతడిని దురదృష్టం వెక్కిరించింది. కాగా ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన పుజారాకు ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా వందో టెస్టు ఆడే అవకాశం వచ్చింది.
సముచిత గౌరవం
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆసీస్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌కు ఎంపికైన పుజారా.. ఢిల్లీ మ్యాచ్ ద్వారా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’ ద్వారా అతడికి సముచిత గౌరవం ఇచ్చారు.
అదే విధంగా బీసీసీఐ భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ చేతుల మీదుగా ఈ నయావాల్‌కు ప్రత్యేక క్యాప్‌ను అందించింది. ఇక పుజారా కెరీర్‌లో అరుదైన ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అతడి కుటుంబం మొత్తం ఢిల్లీకి చేరుకుంది. అతడి బ్యాటింగ్‌ను చూసేందుకు ఉత్సాహంగా ఎదురుచూసింది.
రెండో భారత బ్యాటర్‌గా
కానీ వాళ్లతో పాటు అభిమానులను పుజారా నిరాశపరిచాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్‌కు వికెట్ సమర్పించుకుని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పుజారా ఖాతాలో చెత్త రికార్డు చేరింది. టెస్టు క్రికెట్‌లో కొంతమందికి మాత్రమే లభించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ (వందో టెస్టు).. కీలకమైన మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన ఎనిమిదో క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. రెండో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
వందో టెస్టులో డకౌట్ అయిన క్రికెటర్లు వీరే
►దిలీప్ వెంగ్‌సర్కార్(ఇండియా)
►అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)
►కర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్)
►మార్క్ టేలర్(ఆస్ట్రేలియా)
►స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్)
►బ్రెండన్ మెకల్లమ్(న్యూజిలాండ్)
►అలిస్టర్ కుక్(ఇంగ్లండ్)
►ఛతేశ్వర్ పుజారా(ఇండియా)
చదవండి: IND vs AUS: చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్.. నో అంటున్నా..
బాగా ఆడితే మాకేంటి? ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment