India vs Australia- Cheteshwar Pujara: భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా తన భార్య పూజతో కలిసి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం న్యూఢిల్లీలో రెండో టెస్టు మొదలవుతుంది. పుజారా కెరీర్‌లో ఇది 100వ టెస్టు కానుంది.
ప్రధాని మోదీని కలిసిన ఫొటోలు పంచుకున్న పుజారా.. ‘‘నా కెరీర్‌లో ప్రత్యేకమైన వందో టెస్టు ఆడటానికి ముందు గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీజీని కలవడం సంతోషంగా ఉంది’’ అని ట్వీట్ చేశాడు. ప్రధాని మోదీ సైతం.. కెరీర్‌లో అరుదైన మైలురాయికి చేరువైన పుజారాకు బెస్ట్ విషెస్ చెప్పారు.
నయావాల్
1988, జనవరి 25న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించిన పుజారా.. పూర్తి పేరు చతేశ్వర్ అరవింద్ పుజారా. చిన్ననాటి నుంచే క్రికెట్ పట్ల మక్కువ గల అతడు.. అండర్-19 కేటగిరీలో 2005లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.
అంచెలంచెలుగా ఎదుగుతూ.. భారత్- ఆస్ట్రేలియా మధ్య 2010లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో టెస్టుతో పుజారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
యువరాజ్‌సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4(బౌండరీ) పరుగులే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులతో సత్తా చాటాడు. టెస్టు స్పెషలిస్టుగా ఎదిగి.. మిస్టర్ డిపెంబుల్, వాల్ రాహుల్ ద్రవిడ్ వారసుడిగా పేరొందాడు.
కాగా పుజారాకు 2013లో పూజా పబరీతో వివాహం జరిగింది. వీరికి కూతురు అతిథి ఉంది. ఇదిలా ఉంటే... తాజాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పుజారా ఆకట్టుకోలేకపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. 7 పరుగులకే పెవిలియన్ చేరాడు.
చదవండి: రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్
Chetan Sharma: వివాదంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్‌స్టార్లు.. ఫిట్‌నెస్ లేకున్నా అంటూ..
Comments
Please login to add a commentAdd a comment