ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ అలెన్ బోర్డర్ రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్‌కీపర్ల జాబితాలో బోర్డర్, విరాట్ సమానంగా నిలిచారు. అలెన్ బోర్డర్ తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై 71 క్యాచ్‌లు పట్టగా.. విరాట్, ఆసీస్‌పై అన్నే క్యాచ్‌లు పట్టాడు.
ఈ విభాగంలో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ టాప్‌లో ఉన్నాడు. స్మిత్.. ఇంగ్లండ్‌పై 76 క్యాచ్‌లు పట్టాడు. స్మిత్ తర్వాతి స్థానంలో శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్ధనే ఉన్నాడు. జయవర్ధనే ఇంగ్లండ్‌పై 72 క్యాచ్‌లు పట్టాడు. స్మిత్, జయవర్ధనే తర్వాతి స్థానాల్లో అలెన్ బోర్డర్, విరాట్ కోహ్లి ఉన్నారు.
ఆసీస్‌తో మూడో టెస్ట్‌లో మిచెల్ మార్ష్ క్యాచ్ పట్టడంతో విరాట్.. బోర్డర్ రికార్డును సమం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్‌కు ఇది మూడో క్యాచ్. మార్ష్ క్యాచ్‌కు ముందు విరాట్ మెక్‌స్వీని, లబూషేన్ క్యాచ్‌లు పట్టాడు. ఈ రెంటిలో లబూషేన్ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
టెస్ట్‌ల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు..
స్టీవ్ స్మిత్-76 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)
మహేళ జయవర్ధనే-72 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)
విరాట్ కోహ్లి-71 క్యాచ్‌లు (ఆస్ట్రేలియాపై)
అలెన్ బోర్డర్-71 క్యాచ్‌లు (ఇంగ్లండ్‌పై)
ఇదిలా ఉంటే, భారత్‌తో మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (101), ట్రవిస్ హెడ్ (152) సెంచరీలతో కదంతొక్కారు. అలెక్స్ క్యారీ (45), మిచెల్ స్టార్క్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీశారు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment