ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ తాను ‘పార్కిన్సన్స్’ వ్యాధితో బాధపడుతున్నట్లు మొదటిసారి ప్రకటించాడు. తాను ఏడేళ్ల క్రితం దీనికి గురయ్యానని, అయితే ఎవరూ తనపై జాలి చూపించరాదని ఇప్పటి వరకు చెప్పలేదన్నాడు. నాడీ వ్యవస్థపై ప్రభావం పడే కారణంగా శారీరక కదలికలు సాధారణంగా లేకపోవడం ఈ వ్యాధి లక్షణం.
‘ఇది తెలిస్తే జనం ఎలా స్పందిస్తారో తెలీదు. బాధపడతారా లేదా ఓదారుస్తారా చెప్పలేం. అయితే ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చెబుతున్నా’ అని బోర్డర్ వెల్లడించాడు.
68 ఏళ్ల బోర్డర్ తాను 80 ఏళ్లు జీవించగలిగితే అదే చాలా గొప్పగా భావిస్తానని, మరో ‘సెంచరీ’ సాధించలేనని మాత్రం కచ్చితంగా చెప్పగలనని భావోద్వేగంతో అన్నాడు. 156 టెస్టుల్లో 11,174 పరుగులు... 273 వన్డేల్లో 6524 పరుగులు చేసిన అలెన్ బోర్డర్ రెండు ఫార్మాట్‌లలో కలిపి 30 సెంచరీలు, 99 అర్ధసెంచరీలు సాధించాడు. అతని నాయకత్వంలోనే ఆ్రస్టేలియా 1987లో తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment