![Joe Root Breaks 84 Years Record Of Don Bradman To Achieve Big Scores - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/02/6/joe-root.jpg.webp?itok=W0Euq_k3)
చెన్నై: టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు.1937లో టెస్టు క్రికెట్‌లో వరుసగా మూడుసార్లు 150కి పైగా రన్స్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా బ్రాడ్‌మన్ చరిత్ర సృష్టించగా.. 84ఏళ్ల తర్వాత 150 ప్లస్ స్కోర్లతో హ్యాట్రిక్ మైలురాయి అందుకున్న రెండో కెప్టెన్‌గా రూట్ నిలవడం విశేషం. ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న రూట్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ సూపర్ ఫామ్‌లో రూట్ వరుసగా 228, 186 పరుగులతో చెలరేగాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. 8 వికెట్ల నష్టానికి 555 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది. కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ(218)తో ఆకట్టుకోగా, స్టోక్స్ 82 పరుగులతో రాణించాడు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బౌలర్లు అశ్విన్ ఒక వికెట్ తీయగా, నదీం, ఇషాంత్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక 263 పరుగుల వద్ద పర్యాటక జట్టు తొలి రోజు ఆటను ముగించిన సంగతి తెలిసిందే.
చదవండి:
దేవుడా.. పెద్ద గండం తప్పింది
పంత్ బంతి ఎక్కడుంది.. ఎటు పరిగెడుతున్నావు
Comments
Please login to add a commentAdd a comment