శ్రీలంక యువ సంచలనం కమిందు మెండిస్ క్రికెట్ దిగ్గజాల రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో తొలి 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్, జార్జ్ హెడ్లీ సరసన నిలిచాడు. బ్రాడ్‌మన్, కమిందు, హెడ్లీ.. తమ తొలి 13 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేశారు. ఇన్నింగ్స్‌ల పరంగా టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఐదు సెంచరీల రికార్డు ఎవర్టన్ వీక్స్ పేరిట ఉంది. వీక్స్ కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు సెంచరీలు పూర్తి చేశాడు.
ఆతర్వాత హెర్బర్ట్ సచ్‌క్లిఫ్, నీల్ హార్వే తొలి 12 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా కమిందు బ్రాడ్‌మన్ రికార్డు సమం చేశాడు. కమిందు తన కెరీర్‌లో తొలి 13 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సార్లు ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. అలాగే తానాడిన తొలి ఎనిమిది టెస్ట్‌ల్లో కనీసం అర్ద సెంచరీ చేశాడు.
న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్‌తో (182 నాటౌట్) పాటు దినేశ్ చండీమల్ (116), కుసాల్ మెండిస్ (106 నాటౌట్) సెంచరీలతో కదంతక్కొడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 602 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్ (88), కరుణరత్నే (46), ధనంజయ డిసిల్వ (44) కూడా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. టిమ్ సౌథీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఫాస్టెస్ట్ 1000 రన్స్
న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులతో అజేయంగా నిలిచిన కమిందు మెండిస్ టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కమిందు ఈ మార్కును కేవలం 13 ఇన్నింగ్స్‌లోనే తాకాడు. తద్వారా డాన్ బ్రాడ్‌మన్ సరసన నిలిచాడు. బ్రాడ్‌మన్ కూడా టెస్ట్‌ల్లో తన తొలి వెయ్యి పరుగులను 13 ఇన్నింగ్స్‌ల్లోనే రీచ్ అయ్యాడు. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ 1000 పరుగుల రికార్డు హెర్బర్ట్ సచ్‌క్లిఫ్, ఎవర్టన్ వీక్స్ పేరిట ఉంది. వీరిద్దరు 12 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును తాకారు.
చదవండి: భారత్‌తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు
Comments
Please login to add a commentAdd a comment