
ఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పిన భారత క్రికెటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి.. దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును కూడా బ్రేక్ చేశాడు. శ్రీలంకతో మూడో టెస్టులో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా ఆరో డబుల్ సెంచరీని కోహ్లి సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అత్యంత తక్కువ సమయంలో(రోజులు) ఆరు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దాంతో తొలి ఆరు ద్విశతకాలు సాధించే క్రమంలో బ్రాడ్‌మాన్ రికార్డును విరాట్ అధిగమించాడు.
తన కెరీర్‌లో విరాట్ ఆరు డబుల్ సెంచరీలను సాధించడానికి 499 రోజులు పడితే.. డాన్ బ్రాడ్‌మ్యాన్‌కు తొలి ఆరు ద్విశతకాలు సాధించడానికి 581 రోజులు పట్టింది. 2016, జూలైలో విండీస్‌పై తొలిసారి డబుల్ సెంచరీని కోహ్లి సాధించాడు. అదే ఏడాది మూడు డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లి.. 2017లో ఇప్పటివరకూ మరో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. ఇదిలా ఉంచితే, వరుస ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు బాదిన రెండో భారత క్రికెటర్‌గా కూడా కోహ్లి గుర్తింపు పొందాడు. అంతకుముందు వినోద్ కాంబ్లి మాత్రమే వరుస ఇన్నింగ్స్‌ల్లో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడు కాగా, ఇప్పుడు అతని సరసన కోహ్లి నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment