
క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 1931, నవంబర్ 2వ తేదీన ఓ అరుదైన ఘనత సాధించాడు. కేవలం మూడు ఓవర్లలో 100 పరుగులు చేశాడు. అప్పట్లో ఓ ఓవర్‌కు ఎనిమిది బంతులు వేసేవారు. బ్రాడ్‌మన్ వరుసగా ఓవర్‌కు 33, 40, 27 పరుగులు చొప్పున సాధించాడు. బ్రాడ్‌మన్ ఈ 100 పరుగులను కేవలం 18 నిమిషాల వ్యవధిలో చేశాడని అంటారు. ఓ లోకల్ కౌంటీ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైందని తెలుస్తుంది.
బ్రాడ్‌మన్ మూడు ఓవర్లలో చేసిన పరుగుల్లో నాన్ స్ట్రయికర్ కేవలం రెండు సింగిల్స్ మాత్రమే తీసి స్ట్రయిక్ రొటేట్ చేశాడు. బ్లాక్ అనే బౌలర్ వేసిన తొలి ఓవర్‌లో బ్రాడ్‌మన్ వరుసగా 6, 6, 4, 2, 4, 4, 6, 1 పరుగులు చేశాడు. అనంతరం హోరీ బేకర్ అనే బౌలర్ వేసిన ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 6, 6, 4, 6, 4 పరుగులు చేశాడు. తిరిగి బ్లాక్ వేసిన ఓవర్‌లో 1, 6, 6, 1, 1, 4, 4, 6 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 14 సిక్సర్లు, 29 ఫోర్ల సాయంతో 256 పరుగులు చేసి ఔటయ్యాడు.