
న్యూఢిల్లీ: సుమారు రెండేళ్ల ఫస్ట్‌క్లాస్ కెరీర్ అనుభవమే మాత్రమే ఉన్న అఫ్గానిస్తాన్ టీనేజ్ క్రికెటర్ బహీర్ షా సంచలనం సృష్టించాడు. ఏకంగా దిగ్గజ ఆటగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలుగొట్టాడు. ప్రపంచ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వెయ్యి అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అత్యధిక సగటును నమోదు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల బహీర్ షా.. ఏడు మ్యాచ్‌ల్లో 12 ఇన్నింగ్స్‌లో 121.77 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఫలితంగా ఫస్ట్‌క్లాస క్రికెట్‌లో ఇంతరవకూ బ్రాడ్‌మన్ పేరిట 95.14 సగటుతో ఉన్న రికార్డును తిరగరాశాడు.
స్పీన్‌ఘర్ రీజియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షా తన తొలిమ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అమో రీజియన్‌పై అజేయంగా 256 రన్స్ చేసి అరంగేట్ర ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో రెండో అత్యధిక స్కోరు చేసిన క్రికెటర్‌గా మరో రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్ మజుందార్ (260) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండేళ్ల రెండు నెలల ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో షా ఇప్పటికే 5 సెంచరీలు సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment