భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో చాలా ఆసక్తికర గణాంకాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అలాంటి సమాచారమే మరొకటి, నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఐసీసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్ని ఫైనల్ మ్యాచ్‌లు (వన్డే వరల్డ్‌కప్ (12), టీ20 వరల్డ్‌కప్ (8), డబ్ల్యూటీసీ (1), ఛాంపియన్స్ ట్రోఫీ (8)) జరిగాయి.. అందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఎన్ని ఫైనల్స్ ఆడాయి (వేర్వేరుగా, కలిసి).. వాటిలో భారత్ ఎన్ని గెలిచింది, ఆస్ట్రేలియా ఎన్ని గెలిచింది అన్న సమాచారం.
వివరాల్లోకి వెళితే.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 ఫైనల్ మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్ 10 ఫైనల్స్‌లో పాల్గొనగా.. ఆస్ట్రేలియా 11 ఫైనల్ మ్యాచ్‌లు ఆడింది. భారత ఆడిన 10 ఫైనల్స్‌లో ఐదింట గెలుపొందగా.. ఆసీస్ ఆడిన 11 ఫైనల్స్‌లో ఎనిమిదింట విజయం సాధించింది.
భారత్ ఆడిన ఐసీసీ ఫైనల్స్..
- 1983 వన్డే వరల్డ్‌కప్: విండీస్‌పై భారత్ గెలుపు
- 2000 ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి
- 2002 ఛాంపియన్స్ ట్రోఫీ: శ్రీలంకతో పాటు సంయుక్త విజేత
- 2003 వన్డే వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
- 2007 టీ20 వరల్డ్‌కప్: పాకిస్తాన్‌పై గెలుపు
- 2011 వన్డే వరల్డ్‌కప్: శ్రీలంకపై గెలుపు
- 2013 ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్‌పై గెలుపు
- 2014 టీ20 వరల్డ్‌కప్: శ్రీలంక చేతిలో ఓటమి
- 2017 ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్ చేతిలో ఓటమి
- 2021 డబ్ల్యూటీసీ: న్యూజిలాండ్ చేతిలో ఓటమి
ఆస్ట్రేలియా ఆడిన ఐసీసీ ఫైనల్స్..
- 1975 వన్డే వరల్డ్‌కప్: విండీస్ చేతిలో ఓటమి
- 1987 వన్డే వరల్డ్‌కప్: ఇంగ్లండ్‌పై గెలుపు
- 1996 వన్డే వరల్డ్‌కప్: శ్రీలంక చేతిలో ఓటమి
- 1999 వన్డే వరల్డ్‌కప్: పాకిస్తాన్‌పై గెలుపు
- 2003 వన్డే వరల్డ్‌కప్: భారత్‌పై గెలుపు
- 2006 ఛాంపియన్స్ ట్రోఫీ: వెస్టిండీస్‌పై గెలుపు
- 2007 వన్డే వరల్డ్‌కప్: శ్రీలంకపై గెలుపు
- 2009 ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్‌పై గెలుపు
- 2010 టీ20 వరల్డ్‌కప్: ఇంగ్లండ్ చేతిలో ఓటమి
- 2015 వన్డే వరల్డ్‌కప్: న్యూజిలాండ్‌పై గెలుపు
- 2021 టీ20 వరల్డ్‌కప్: న్యూజిలాండ్‌పై గెలుపు
Comments
Please login to add a commentAdd a comment