విఫలమైతే ఆటగాళ్లను తిట్టండి.. ఐపీఎల్‌పై ఆడిపోసుకోవడమేంటి..? | Gautam Gambhir Wants Players To Be Blamed For Poor Performance In ICC Tournament, Not IPL | Sakshi
Sakshi News home page

Gautam Gambhir: ఐసీసీ టోర్నీల్లో విఫలమైతే ఆటగాళ్లను తిట్టండి.. ఐపీఎల్‌పై ఆడిపోసుకోవడమేంటి..?

Published Sun, Nov 27 2022 5:13 PM | Last Updated on Sun, Nov 27 2022 6:23 PM

Gautam Gambhir Wants Players To Be Blamed For Poor Performance In ICC Tournament, Not IPL - Sakshi

ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వైఫల్యాలకు ఐపీఎల్‌ను కారణంగా చూపుతున్న వారికి భారత మాజీ ఓపెనర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చాడు. ఈ బీజేపీ ఎంపీ.. ఐపీఎల్‌ను విమర్శించే వారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెప్పాడు. మెగా ఈవెంట్లలో భారత ఆటగాళ్లు విఫలమైన ప్రతిసారి కొందరు పనిగట్టుకుని ఐపీఎల్‌ను టార్గెట్‌ చేస్తున్నారని, ఐసీసీ టోర్నీల్లో విఫలమైతే ఆటగాళ్లను తిట్టాలి, వారి ప్రదర్శనపై మాట్లాడాలి కానీ, ఐపీఎల్‌పై ఆడిపోసుకోవడం ఏంటని విమర్శకులను నిలదీశాడు.

భారత ఆటగాళ్లు ఫెయిల్‌ అయిన ప్రతిసారి ఐపీఎల్‌ను తిట్టడం ఫ్యాషన్‌ అయిపోయిందని.. ఎందరో క్రికెటర్లకు, నాన్‌ ప్లేయింగ్‌ స్టాఫ్‌కు అన్నం పెట్టే ఐపీఎల్‌పై నిరాధారమైన నిందలు వేయడం ఇకనైనా మానుకోవాలని హెచ్చరించాడు. భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసిన ఐపీఎల్‌.. ఎందరో ఆటగాళ్లకు ఆర్ధిక భరోసా ఇచ్చిందని, అలాంటి కల్పవృక్షాన్ని, ఆటగాళ్లు వైఫలమైన ప్రతిసారి టార్గెట్‌ చేయడం సబబు కాదని శనివారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నాడు.  

కాగా, ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుండి (2008) టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో పెద్దగా రాణించలేకపోతుందన్నది కాదనలేని సత్యం. 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ మినహాయించి, 14 ఏళ్ల వ్యవధిలో భారత్‌ ఆడిన ప్రతి మెగా టోర్నీలో దారుణంగా విఫలమైంది. దీంతో టీమిండియా మెగా టోర్నీల్లో ఇంటిదారి పట్టిన ప్రతిసారి అభిమానులు, కొందరు మాజీలు, విశ్లేషకులు ఐపీఎల్‌నే టార్గెట్‌ చేశారు, చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా గంభీర్‌ ఐపీఎల్‌ను వెనకేసుకొచ్చినట్లు మాట్లాడటం భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్ల వైఫల్యాలకు ఐపీఎల్‌ కారణం కాదని గంభీర్‌.. తన గుండె మీద చెయ్యేసుకుని చెప్పాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరైతే.. అతను బీజేపీ ఎంపీ కాబట్టి, వారి పరోక్ష పెత్తనంతో నడిచే లీగ్‌ను వెనకేసుకు రాక, నిన్ను, నన్ను వెనకేసుకొస్తాడా అని వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌లో రాణిస్తూ, జాతీయ జట్టుకు వచ్చే సరికి చేతులెత్తేస్తున్న తన జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, రోహిత్‌ లాంటి వారు గంభీర్‌కు కనబడరా అని ప్రశ్నిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement