
ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. 2014 నుంచి వరుసగా నాలుగు ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో (శ్రీలంక చేతిలో) ధోని సారధ్యంలో ఓటమిపాలైన భారత్.. ఆతర్వాత కోహ్లి నేతృత్వంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో (పాకిస్తాన్ చేతిలో), అదే కోహ్లి సారధ్యంలో 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో (న్యూజిలాండ్ చేతిలో), తాజాగా రోహిత్ శర్మ సారధ్యంలో 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో (ఆస్ట్రేలియా చేతిలో) ఓటమిపాలైంది.
2014 నుంచి నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియా పరిస్థితి దయనీయంగా ఉంది. నాటి నుంచి భారత జట్టు ఆడిన 8 ఐసీసీ నాకౌట్స్‌లో ఓటమిపాలైంది. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్ (శ్రీలంక చేతిలో), 2015 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ (ఆసీస్ చేతిలో), 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ (విండీస్ చేతిలో), 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ (పాకిస్తాన్ చేతిలో), 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్ (న్యూజిలాండ్ చేతిలో), 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్ (న్యూజిలాండ్ చేతిలో), 2022 టీ20 వరల్డ్‌కప్ సెమీస్ (ఇంగ్లండ్ చేతిలో), తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ (ఆసీస్ చేతిలో) మ్యాచ్‌ల్లో టీమిండియా వరుసగా పరాజయాలపాలైంది. మరోవైపు ఆసీస్ ఏమో మూడు ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్స్ నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..!