Indian Cricket Team is the Favorite Team in Any Tourney, Says Australian Cricketer Adam Gilchrist - Sakshi
Sakshi News home page

టోర్నీ ఏదైనా.. ఇండియానే ఫేవరేట్‌

Published Fri, Sep 13 2019 10:27 AM | Last Updated on Fri, Sep 13 2019 11:17 AM

India Is Favourite In Any Tourney Gilchrist - Sakshi

‘‘ఇండియాలో క్రికెట్‌కున్న క్రేజ్‌ మరే దేశంలోనూ లేదు. ఇక్కడి వారు క్రికెట్‌ను అంతలా ఆరాధిస్తారు. ఇండియా టీం కూడా చాలా డేంజర్‌. ఏ టోర్నీలో బరిలో దిగినా...ఎవరితో  ఆడినా...  ఇండియానే ఫేవరేట్‌’’ అని ఆ్రస్టేలియా క్రికెటర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ అన్నారు. గురువారం ఆయన అనంతపురంలోని అనంత క్రీడా మైదానాన్ని సందర్శించారు. స్థానిక క్రీడాకారులతో మాట్లాడారు. దిగ్గజ క్రికెటర్‌ రాకతో  ఆర్డీటీ క్రీడామైదానం పులకించిపోయింది. ఇక్కడి క్రీడాకారులు ఆయనతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకుని మురిసిపోయారు. మాట కలిపి క్రీడా మెలకువలు తెలుసుకునేందుకు పోటీ పడ్డారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: క్రికెట్‌ టోర్నీ ఏదైనా ఇండియానే ఫేవరేట్‌ అని ఆస్ట్రేలియన్‌ దిగ్గజ క్రికెటర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ అన్నారు. అనంతపురంలోని అనంత క్రీడా మైదానాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, జూడో క్రీడాకారులతో ముచ్చటించారు. అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.  

ప్ర: ఇండియా జట్టు గురించి మీ అభిప్రాయం?
జ: ఇండియా జట్టు చాలా ప్రత్యేకమైనది. అత్యంత ప్రమాదకరమైన జట్టుగానే నేను భావిస్తున్నా. ఎలాంటి టోర్నీలోనైనా ఆ జట్టు ఫెవరెట్‌గానే బరిలోకి దిగుతుంది. ఇండియాలో క్రికెట్‌ను కోట్లాది మంది ప్రజలు ఆదరిస్తారు. ఇక్కడి ప్రజలకు క్రికెట్‌కు నిజంగానే ఆరాధ్య క్రీడ.

ప్ర: ప్రస్తుత ఆ్రస్టేలియన్‌ జట్టు ఆటతీరుపై మీ అభిప్రాయం?
జ: ఆస్ట్రేలియన్‌ జట్టు ప్రస్తుతం గడ్డు కాలంలో ఉంది. ప్లేయర్లు రాణించడం కొంచెం కష్టంగా ఉంది. రానున్న కాలంలో మరింతగా పుంజుకుంటుందని భావిస్తున్నా. యాషెస్‌ సీరిస్‌ ద్వారా తప్పక ఫామ్‌లోకి వస్తుంది.

ప్ర: ఇండియాకి రావడం ఎలా అనిపిస్తుంది?
జ: చాలా బాగుంది. ఇండియాలో చాలా అత్యుత్తమమైన క్రికెట్‌ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు తన జీవితాన్ని క్రికెట్‌ ద్వారానే ఆస్వాదిస్తాడు. ప్రతి చోట క్రికెట్‌ ఆడతారు.  

ప్ర: అనంత క్రీడా మైదానం గురించి మీ మాటల్లో..
జ: ఇక్కడి క్రీడాకారులకు ఇదో మంచి అవకాశం. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు అందించే సౌకర్యాలు, వసతులను కలి్పస్తున్నారు. ఇది క్రీడాకారుల పాలిట ఒక వరంగా భావించాలి. అనంత క్రీడాకారులు చాలా అదృష్టం చేసుకున్నారు.

ప్ర: ఆర్డీటీ గురించి?
జ: ఆర్డీటీ నిజంగా ఒక ఉత్తమమైన సంస్థ. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఇంతటి ఉన్నతమైన క్రీడా దిగ్గజాలను తయారు చేస్తుందంటే నిజంగా ఇది క్రీడాకారుల కర్మాగారంగా చెప్పవచ్చు. సాధారణంగా ఒక క్రీడకు అకాడమీని స్థాపించి అభివృద్ధి చేయడం చాలా గొప్ప విషయం. అలాంటిది ఇన్ని అకాడమీలను ఏర్పాటు చేసి వాటిలో వేల సంఖ్యలో క్రీడాకారులకు విద్య, వసతి కలి్పంచి చేరదీయడం చాలా గొప్ప విషయం.

ప్ర: క్రీడాకారులకు భవిష్యత్తులో మీ వంతు సాయం చేస్తారా?
జ: తప్పకుండా. నేను నా వంతు సహాయం చేస్తాను. అనంత క్రీడాకారులకు ప్రతి అంశంలోను తోడుగా ఉండేందుకు ప్రయతి్నస్తా.  


ప్ర: ఇక్కడి క్రీడాకారులకు మీ సలహా?
జ: ఇది ఒక క్రీడా సంగ్రామం. అంతర్జాతీయ స్థాయి శిక్షణను ప్రతి క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడాకారులు వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అప్పుడే క్రీడాకారుడు తను కోరుకున్న ప్రధాన లక్ష్యానికి చేరుకుంటాడు. క్రీడలను ఆడడం కాదు.. వాటిని ఆస్వాదించండి. అప్పుడే అవి మిమ్మల్ని ఉన్నత క్రీడాకారులుగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి.  

ప్ర: అనంతతో మీ అనుభూతి ఎలాంటిది
జ: ఇది నా జీవితంలో మరిచిపోలేని చోటు. ఇది ఆరంభంగానే భావిస్తున్నా. అవకాశం ఉన్న ప్రతిసారీ ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రతి గ్రామంలో క్రీడలను ప్రోత్సహిస్తున్న ఆర్డీటీ సంస్థకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement