సచిన్ పరిమితికి మించి క్రికెట్ ఆడలేదు:గిల్క్రిస్ట్ | Sachin Tendulkar has not overstayed, says Adam Gilchrist | Sakshi
Sakshi News home page

సచిన్ పరిమితికి మించి క్రికెట్ ఆడలేదు:గిల్క్రిస్ట్

Published Tue, Nov 12 2013 5:34 PM | Last Updated on Sat, Sep 2 2017 12:33 AM

సచిన్ పరిమితికి మించి క్రికెట్ ఆడలేదు:గిల్క్రిస్ట్

సచిన్ పరిమితికి మించి క్రికెట్ ఆడలేదు:గిల్క్రిస్ట్

న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పరిమితికి మించి క్రికెట్ ను ఆడలేదని ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. సచిన్ పరిమితికి మించి క్రికెట్ ను ఆడాడని, ఇప్పటికే రిటైర్ మెంట్ చాలా ఆలస్యమైందన్న పాకిస్తాన్ మాజీ ఆటగాడు జావెద్ మియాందాద్ వ్యాఖ్యలను గిల్లీ ఖండించాడు. సచిన్ టెండూల్కర్ పరిమితికి మించి క్రికెట్ ను ఆడలేదని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. వెస్టిండీస్తో జరుగనున్న 200 వ టెస్టు అనంతరం రిటైర్ కానున్న సచిన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. భారత క్రికెట్ లో సచిన్ ను తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నాడని, కెరీర్ మొదలైనప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎంతో పరిణితి కనబరిచి ఉన్నత శిఖరాలను అందుకున్నాడని తెలిపాడు.

 

వాలాన్ గాంగ్ యూనివర్శిటీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరిస్తున్నగిల్క్రిస్ట్ ఆస్ట్రేలియా కమీషన్ ముందు హాజరైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ ఒక ప్రత్యేక శైలితో ఉంటూ భారత్ కు సేవలందించాడన్నాడు. అతనిలోని నిబద్ధతే ఇంతకాలం ఆటను కొనసాగించడానికి తోడ్పడిందన్నాడు. ప్రస్తుత టీం ఇండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ థావన్, విరాట్ కోహ్లిలు స్థిరంగా ఆడుతున్నారన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement