ఐపీఎల్-2024లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఈ ఏడాది సీజన్‌తో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి తిరిగి గాడిలో పడినట్లు కన్పించిన ముంబై.. మళ్లీ పాత ఆట తీరునే కనబరిచించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.. సీఎస్‌కేకు వికెట్ల వెనక ధోని లాంటి మాస్టర్ మైండ్ ఉన్న ఆటగాడు ఉన్నాడు. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ధోనికి బాగా తెలుసు. అందుకు తగ్గట్టు మిగతా ఆటగాళ్లకు సూచనలు ఇస్తుంటాడని హార్దిక్ చెప్పుకోచ్చాడు. దీంతో ముంబై జట్టులో రోహిత్, బుమ్రా వంటి సీనియర్ల ఆటగాళ్ల నుంచి మద్దతు హార్దిక్‌కు లేదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
కాగా రోహిత్ స్ధానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంపికచేసినప్పటి నుంచి ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయిందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది రోహిత్‌కు సపోర్ట్‌గా ఉంటే మరి కొంతమంది హార్దిక్ వైపు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు హార్ధిక్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి క్రెడిట్ ఇవ్వడానికి బదులుగా హార్దిక్.. ధోని పేరును ప్రస్తావించడం తనను ఆశ్చర్యపరిచందని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.
"పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ధోని గురించి హార్దిక్ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. హార్దిక్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జట్టులో తనకు సహాచరుల నుంచి సపోర్ట్ లేనిట్లు అన్పిస్తోంది. అతడు తన నిర్ణయాలతో ముందుకు వెళ్లుతున్నట్లు నేను భావిస్తున్నాను.
ఈ మ్యాచ్‌లో అద్బుతంగా ఆడిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గురించి హార్దిక్ కనీసం మాట్లాడలేదు. అతడు కెప్టెన్సీకి కూడా క్రెడిట్ ఇవ్వలేదు. అతడి వెనుక ధోని ఉన్నాడని అందుకే సీఎస్‌కే గెలుస్తుందని పాండ్యా చెబుతున్నాడు.
దీని బట్టి హార్దిక్ ఆలోచనా విధానం ఎలా ఉందో నాకు ఆర్ధమవుతోంది. హార్దిక్ ఒంటరిగా ఫీలవుతున్నాడు. ముంబై ఇండియన్స్ క్యాంపులో ఆనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే కొనసాగితే ఈ టోర్నీలో ముందుకు సాగడం కష్టమని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment