ధోనితో శివం దూబే (PC: BCCI/Jio Cinema)
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ పేస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్-2024లోనూ బ్యాట్ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ శివం శివాలెత్తిపోయాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాంఖడేలో ముంబై జట్టును సీఎస్‌కే మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
Dube not leaving the shift key today, IYKYK 😉😏#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/vHZH0TWe4q
— JioCinema (@JioCinema) April 14, 2024
ఈ క్రమంలో శివం దూబేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా వైస్ కెప్టెన్, పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోలుస్తూ శివం దూబేకే టీ20 ప్రపంచకప్-2024లో ఆడే అర్హత ఎక్కువగా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే, శివం దూబే కేవలం స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రమే ఆడగలడని.. కాబట్టి ప్రపంచకప్ టోర్నీలో ఆడించాలనడం తొందరపాటే అవుతుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ వాదనలను తాజాగా తప్పని నిరూపించాడు దూబే.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్‌లో అతడు ఒకే ఒక్క బంతి ఎదుర్కొన్నాడు. మిగిలిన ముప్పై ఏడు బంతులు పేసర్లు సంధించినవే! దూబేను అవుట్ చేసేందుకు జస్‌ప్రీత్ బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌తో పాటు.. ఆకాశ్ మధ్వాల్, రొమారియో షెఫర్డ్‌లతో తానూ బరిలోకి దిగినా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫలితం రాబట్టలేకపోయాడు.
Most sixes since IPL 2022 -
— TCTV Cricket (@tctv1offl) April 15, 2024
🔹 66 Shivam Dube
🔹 66 Nicholas Pooran
Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr
బంతిని సరిగ్గా అంచనా వేస్తూ తెలివైన షాట్లతో విరుచుకుపడుతున్న దూబేను ఆపడం ముంబై పేసర్ల తరం కాలేదు. తద్వారా ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేడన్న అభిప్రాయాలను పటాపంచలు చేశాడు. రానున్న వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తనకు వందకు వంద శాతం ఆడే అర్హత ఉందని తన బ్యాటింగ్ నైపుణ్యాలతో చెప్పకనే చెబుతున్నాడీ లెఫ్టాండ్ బ్యాటర్.
ఈ నేపథ్యంలో విండీస్ దిగ్గజం బ్రియన్ లారా వంటి దిగ్గజాలు సైతం వెస్టిండీస్- అమెరికా వేదికగా సాగే టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్‌కు భారత జట్టులో శివం దూబేకు చోటు ఇవ్వాలని టీమిండియా సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా అటు ముంబై ఇండియన్స్ సారథిగా.. ఇటు ఆల్‌రౌండర్‌గా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఫలితంగా దూబేనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. మరి మీరేమంటారు?!..
ఐపీఎల్-2023 నుంచి తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు శివం దూబే ఇన్నింగ్స్ ఇలా...
19(18), 27(16), 28(26), 8(9), 52(27), 50(21), 52(33), 28(17), 26*(18), 25(12), 48*(34), 22(9), 1(3), 32*(21), 34*(28), 51(23), 18(17), 45(24), 28(18) & 66*(38).
హిట్టర్ సిక్స్‌ల వర్షం
ఇక ఐపీఎల్-2022 నుంచి ఇప్పటి వరకు శివం దూబే మొత్తంగా 66 సిక్సర్లు బాదాడు. ఇందులో స్పిన్నర్ల బౌలింగ్‌లో బాదినవి 34.. పేసర్ల బౌలింగ్‌లో సాధించినవి 32.
చదవండి: #DHONI: ‘మరేం పర్లేదు’.. రోహిత్‌ను ఓదార్చిన ధోని.. ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment