గతేడాది డిసెంబర్‌లో కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. రిషబ్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేశాడు. అతడిని త్వరలోనే తిరిగి మైదానంలో చూసే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏదమైనప్పటికీ పంత్ వంటి విధ్వంసకర బ్యాటర్ వరల్డ్‌కప్‌కు దూరం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ప్రపంచకప్‌లో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వహించనున్నాడు.
ఇక తన దూకుడుతో వరల్డ్ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పంత్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిసబ్ తన విధ్వంసకర ఆట తీరుతో ఎంతో మంది యువ వికెట్‌కీపర్‌లకు ఆదర్శంగా నిలిచాడని గిల్‌క్రిస్ట్ కొనియాడాడు.
"ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వికెట్ కీపర్ బ్యాటర్‌లను రిషబ్ పంత్ తను ఆడే విధంగా ప్రేరేపించాడు. యువ వికెట్ కీపర్‌లు పంత్‌ను ఫాలో అవుతున్నారు. ఇది నిజంగా చాలా గ్రేట్. ఇక భారత్‌కు వికెట్ కీపర్‌లు చాలా మంది అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌కు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో రెండు ఎంపికలు ఉన్నాయి.
కేఎల్ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడు తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. ఇది నిజంగా భారత క్రికెట్‌కు శుభసూచికం అంటూ" గిల్‌క్రిస్ట్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: #Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
Comments
Please login to add a commentAdd a comment