అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన పంత్ (PC: BCCI/Jio Cinema)
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. రివ్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో చాలాసేపు వాగ్వాదానికి దిగాడు. ఆఖరికి తప్పు తనదే అని తేలడంతో మిన్నకుండిపోయాడు.
లక్నో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌లో ఈ ఘటన జరగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రిషభ్ పంత్ తీరుపై మండిపడ్డాడు.
అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన పంత్ లాంటి ఆటగాళ్లను కచ్చితంగా పనిష్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా లక్నోలో ఢిల్లీతో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
రీప్లేలో పంత్ రివ్యూ కోరినట్లుగానే
ఈ క్రమంలో మూడో ఓవర్లో బంతిని కెప్టెన్ పంత్ ఇషాంత్ శర్మకు ఇచ్చాడు. నాలుగో బాల్‌ను అంపైర్ వైడ్‌గా ప్రకటించగా.. పంత్ రివ్యూకు అప్పీలు చేసినట్లుగా కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ అడిగి అతడితో కన్‌ఫామ్ చేసుకునీ మరీ డీఆర్‌ఎస్ కాల్ ఇచ్చాడు.
రివ్యూలో అది వైడ్ బాల్‌గానే తేలడంతో పంత్ అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో అసలు తాను డీఆర్‌ఎస్ కోరనేలేదని అంపైర్‌తో వాదించాడు. అయితే, రీప్లేలో పంత్ రివ్యూ సిగ్నల్ ఇచ్చినట్లుగా తేలింది. అయితే, అతడు ఫీల్డర్లతో సంప్రదించేందుకు అలా చేశాడా? లేదంటే నిజంగానే అంపైర్‌కే సిగ్నల్ ఇచ్చాడా అన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ గొడవ జరిగింది.
పంత్ తీరుపై ఆసీస్ దిగ్గజం ఆగ్రహం
ఈ నేపథ్యంలో ఆడం గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘‘అంపైర్లకు మ్యాచ్‌ను నియంత్రించేందుకు మరింత వెసలుబాటు కల్పించాలి. ఏ ఫార్మాట్లోనైనా ఇలాంటి విషయాల్లో తమ పని తాము చేసుకునే వీలు ఉండాలి.
రిషభ్ పంత్ రివ్యూకు వెళ్లాడా లేదా అన్నది ఇక్కడ వాగ్వాదానికి దారితీసింది. సమన్వయలోపం జరిగిందనే అనుకుందాం. కానీ అందుకోసం సుమారు 3- 4 నిమిషాలు వృథా అయ్యాయి.
రిషభ్ పంత్ ఒక్కడే కాదు.. ఇంతకు ముందు ఇలాగే చాలా మంది అంపైర్లతో గొడవకు దిగడం చూశాను. కావాలని వాదనను పొడిగిస్తే పంత్ అయినా.. ఇంకెవరైనా కచ్చితంగా వారి తప్పునకు తగిన శిక్ష పడాల్సిందే’’ అని పేర్కొన్నాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఈ సీజన్‌లో రెండో గెలుపు అందుకుంది.
Rishabh Pant and on-field umpire Rohan Pandit had a word on review.#LSGvsDC #IPL2024 #RishabhPant pic.twitter.com/NjIVgsAR5p
— 𝗖𝗿𝗶𝗰 𝗶𝗻𝘀𝗶𝗱𝗲𝗿 (@cric_insiderr) April 12, 2024
చదవండి: Rishabh Pant: పంత్ అరుదైన ఘనతలు.. ఐపీఎల్‌లో తొలి కెప్టెన్‌గా
#KL Rahul: అతడొక సర్‌ప్రైజ్.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి
Victory in Lucknow for the @DelhiCapitals 🙌
— IndianPremierLeague (@IPL) April 12, 2024
A successful chase power them to their second win of the season as they win by 6⃣ wickets!
Scorecard ▶️ https://t.co/0W0hHHG2sq#TATAIPL | #LSGvDC pic.twitter.com/6R7an9Cy8g
Comments
Please login to add a commentAdd a comment