ఆసీస్‌ క్రికెటర్‌ కోరికను తీర్చిన హర్షా బోగ్లే | Harsha Bhogle Fulfills Promise Grace Harris Delivers Burger WPL 2023 | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ క్రికెటర్‌ కోరికను తీర్చిన హర్షా బోగ్లే

Published Tue, Mar 7 2023 11:04 PM | Last Updated on Tue, Mar 7 2023 11:09 PM

Harsha Bhogle Fulfills Promise Grace Harris Delivers Burger WPL 2023 - Sakshi

హర్షా బోగ్లే.. పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్‌ కామెంటేటరీకి పెట్టింది పేరు.. తన వాక్చాతుర్యంతో అభిమానులను కట్టిపడేయడం అతని స్పెషాలిటీ. తాజాగా వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో హర్షా బోగ్లే కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్రేస్‌ హారిస్‌ కోరికను హర్షా బోగ్లే నెరవేర్చాడు. మరి గ్రేస్‌ హారిస్‌ కోరిక ఏంటి.. ఆ కథేంటి అనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి. 

ఆర్‌సీబీతో తొలి మ్యాచ్‌ ముగిసిన అనంతరం గ్రేస్‌ హారిస్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాను బర్గర్‌ను చాలా మిస్సవుతున్నానని పేర్కొంది. గ్రేస్‌ హారిస్‌ మాటలు విన్నాడో ఏమో తెలియదు కానీ హర్షా బోగ్లే ఇవాళ ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇవాళ(మార్చి 7న) యూపీ వారియర్జ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు గ్రేస్‌ హారిస్‌ బెంచ్‌కే పరిమితమైంది. మ్యాచ్‌ మధ్యలో హర్షా బోగ్లే గ్రేస్‌ హారిస్‌ వద్దకు వచ్చి నీకిష్టమైన వస్తువు నా దగ్గర ఉంది.. ఇది నీకే అంటూ బర్గర్‌ను ఆమె చేతిలో పెట్టాడు. దీంతో నవ్వులో మునిగి తేలిన గ్రేస్‌ హారిస్‌ సంతోషంగా స్వీకరించి హర్షా బోగ్లేకు కృతజ‍్క్షతలు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement